చైనా సెంట్రల్ టెలివిజన్
From Wikipedia, the free encyclopedia
చైనా సెంట్రల్ టెలివిజన్(CCTV) అనేది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(CCP)చే నియంత్రించబడే చైనీస్ ప్రభుత్వరంగ బ్రాడ్‌కాస్టర్. CCTV వివిధ కార్యక్రమాలను ప్రసారం చేసే 50 ఛానెల్‌ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఆరు వేర్వేరు భాషల్లో ఒక బిలియన్ కంటే ఎక్కువ వీక్షకులకు అందుబాటులో ఉంది.[1] దాని కార్యక్రమాలలో చాలా వరకు వార్తలు, డాక్యుమెంటరీ, సామాజిక విద్య, హాస్యం, వినోదం, నాటకం మిశ్రమంగా ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగం చైనీస్ సోప్ ఒపెరాలు, వినోదాలను కలిగి ఉంటాయి.[2] చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన సున్నితమైన అంశాలకు సంబంధించిన వార్తలు నిషేదం. తరచుగా ఆ పార్టీ శత్రువులపై ఇది ఆయుధంగా ఉపయోగించబడుతుంది.[3][4] CCTVని నేషనల్ రేడియో, టెలివిజన్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తుంది. ఇది నేరుగా CCP ప్రచార విభాగానికి నివేదిస్తుంది.[5][6]
1 మే 1958న ప్రభుత్వ యాజమాన్యంలోని న్యూస్, పబ్లిక్ ఒపీనియన్ స్టీరింగ్ ఏజెన్సీగా, CCP మౌత్ పీస్‌గా పని చేయడానికి CCTV స్థాపించబడింది. CCTV వార్తల కమ్యూనికేషన్, సామాజిక విద్య, సంస్కృతి, వినోద సమాచార సేవలు వంటి అనేక రకాల విధులను నిర్వర్తిస్తుంది. రాష్ట్ర టెలివిజన్ స్టేషన్‌గా ఇది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ, స్టేట్ కౌన్సిల్ రెండింటికీ బాధ్యత వహిస్తుంది.[7] ఇది చైనా ప్రభుత్వ ప్రచార నెట్‌వర్క్‌లో ప్రధాన పాత్ర పోషిస్తుంది.[3]