చైనా వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్ III
From Wikipedia, the free encyclopedia
చైనా వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్ III, అనేది బీజింగ్‌లోని అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యం. బీజింగ్ లో చోయాంగ్లో వద్ద ఉన్న మూడవ తూర్పు రింగు రోడ్డు, జియాంగ్యుమన్స్ ఔటర్ స్ట్రీట్ జంక్షను వద్దనున్న సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లోని చైనా వరల్డ్ ట్రేడ్ సెంటర్ సముదాయ మూడవ దశ అభివృద్ధిలో భాగంగా ఈ భవనం రూపుదిద్దుకుంది. 29 అక్టోబరు 2007 న ఈ భవనం 330 m (1,083 ft) ఎత్తుతో అగ్రస్థానంలో నిలిచింది.[5] ఈ భవనం 2010వ సంవత్సరంలో పూర్తయింది. ఈ భవన సెప్టెంబరు 11, 2001 దాడుల్లో నాశనమైన న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోని అసలైన ట్విన్ టవర్లను పోలి ఉంటుంది. ఇది బీజింగ్ లోని అత్యంత ఎత్తయిన భవనం.
త్వరిత వాస్తవాలు సాధారణ సమాచారం, రకం ...
చైనా వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్ III | |
---|---|
సాధారణ సమాచారం | |
రకం | ఆఫీసు, హోటలు and దుకాణాలు |
భౌగోళికాంశాలు | 39.9109336°N 116.452176°E / 39.9109336; 116.452176 |
నిర్మాణ ప్రారంభం | 2005 |
పూర్తి చేయబడినది | 2010 |
ఎత్తు | |
నిర్మాణం ఎత్తు | 330 మీ. (1,083 అ.)[1] |
పైకప్పు నేల | 311.8 మీ. (1,023 అ.)[1] |
సాంకేతిక విషయములు | |
అంతస్థుల సంఖ్య | 74 (+5 భూగర్భ అంతస్థులు)[1] |
నేల వైశాల్యం | 280,000 మీ2 (3,013,900 sq ft)[1] |
లిఫ్టులు / ఎలివేటర్లు | 41, షిండ్లెర్ గ్రూపుచే తయారు చేయబడ్డాయి[1] |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | స్కిడ్మోర్, ఓవింగ్స్, మెర్రిల్[1] |
నిర్మాణ ఇంజనీర్ | అరుప్ గ్రూప్ లినిటెడ్[1] |
మూలాలు | |
[1][2][3][4] |
మూసివేయి