From Wikipedia, the free encyclopedia
ఆరం లిలీ (Arum lily) లేదా ఆరేసీ (Araceae) కుటుంబానికి చెందిన చేమ మొక్క శాస్త్రీయ నామం కోలొకేషియా ఎస్కులెంటా (Colocasia esculenta). దీనిని కో. యాంటీకోరం (C. antiquorum) అని కూడా అంటారు. ఎస్కులెంటా అంటే "ఆహారంగా పనికొచ్చేది అని అర్థం." యాంటీకోరం అంటే "ప్రాచీనులు ఉపయోగించినది" అని అర్థం. ఆరేసీ కుటుంబానికి చెందినది కనుక దీనిని "ఆరం" (arum) అని కూడా అంటారు. హిందీ లోనూ, ఉర్దూ లోను దీనిని "ఆర్వీ" అనడానికి మూలం ఇదే. హిందీలో ఖుయ్యా అని కూడా అంటారు. ఇంగ్లీషులో టేరో (taro) అని కాని టేరో రూట్ (taro) అని కాని అంటారు.
చేమ మొక్క ఆకులు ఏనుగు చెవుల్లా పెద్దగా ఉంటాయి. అందుకనే ఇంగ్లీషులో ఈ మొక్కని Elephant ear అంటారు. చేమ మొక్కకి కాండం అంటూ ఉండదు; ఆకులు, కాడలు పొడుగ్గా పెరుగుతాయి. ఇది బహువార్షిక మొక్క. ఇది చిత్తడి నేలల్లోనూ, కాలవల వెంట పెరుగుతుంది. దుంపలు గుత్తులు గుత్తులుగా పెరుగుతాయి. మధ్యలో ఒక పెద్ద దుంప (corm) దాని చుట్టూ పిల్ల దుంపలు (cormels) ఉంటాయి.
పేరు లోని యాంటీకోరంని బట్టి చేమ ప్రాచీన కాలం నుండి ఉపయోగంలో ఉందని తెలుస్తోంది. దీని జన్మస్థానం మూడొంతులు ఆగ్నేయ ఆసియా ప్రాంతం (అనగా, ప్రస్తుతం ఇండేనేసియా, ఫిలిప్పిన్ దీవులు, వియత్నాం, వగైరా). ఇది భారతదేశం లోనికి ప్రాచీన కాలంలోనే వచ్చి ఉంటుందని పెద్దలు అంచనా వేస్తున్నారు.
Nutritional value per 100 గ్రా. (3.5 oz) | |
---|---|
శక్తి | 594 కి.J (142 kcal) |
34.6 g | |
చక్కెరలు | 0.49 |
పీచు పదార్థం | 5.1 g |
0.11 g | |
0.52 g | |
విటమిన్లు | Quantity %DV† |
థయామిన్ (B1) | 9% 0.107 mg |
రైబోఫ్లావిన్ (B2) | 2% 0.028 mg |
నియాసిన్ (B3) | 3% 0.51 mg |
పాంటోథెనిక్ ఆమ్లం (B5) | 7% 0.336 mg |
విటమిన్ బి6 | 25% 0.331 mg |
ఫోలేట్ (B9) | 5% 19 μg |
విటమిన్ సి | 6% 5 mg |
Vitamin E | 20% 2.93 mg |
ఖనిజములు | Quantity %DV† |
కాల్షియం | 2% 18 mg |
ఇనుము | 6% 0.72 mg |
మెగ్నీషియం | 8% 30 mg |
మాంగనీస్ | 21% 0.449 mg |
ఫాస్ఫరస్ | 11% 76 mg |
పొటాషియం | 10% 484 mg |
జింక్ | 3% 0.27 mg |
| |
†Percentages are roughly approximated using US recommendations for adults. Source: USDA Nutrient Database |
కంద, పెండలం మాదిరే ఈ దుంపలలో కూడా కేల్సియం ఆగ్జలేట్ ఉండడం వల్ల పచ్చివి తింటే నోరు పాడవుతుంది. ఉడకబెట్టుకుని తినాలి. హవాయి దీవులలో చేమ చాల ముఖ్యమైన వంటకం. దీనిని ఉడకబెట్టి, ముద్ద చేసి, ఊరబెట్టి "పోయ్" (poi) అనే పదార్థాన్ని చేసి ఆ ద్వీపవాసులు ఎంతో ఇష్టంగా తింటారు. ఉడకబెట్టిన ముక్కల్ని ఎర్రగా పెనం మీద వేయించిన (stir fry) చేమ వేపుడు తెలుగు దేశంలో ప్రసిద్ధమైన వంటకమే. ఉడకబెట్టిన దుంపలకి ఆవ పెట్టి వండిన కూర కూడా బాగుంటుంది కాని కొంచెం జిగురుగా ఉంటుందని కొంతమంది ఇష్టపడరు. పోషక విలువల పరంగా, 100 గ్రాముల చామదుంపలు సుమారు 120 కేలరీలను ఇస్తాయి. సంశ్లిష్ట కర్బనోదకాలు (కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్) ఉండడం వల్ల, పోషక నార (డయటరీ ఫైబర్) ఉండడం వల్ల ఇది నెమ్మదిగా జీర్ణం అవుతూ, రక్తప్రవాహం లోకి గ్లూకోజ్ ని నిదానంగా విడుదల చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు శరీరములో చాలినంత శక్తి ఉంటుంది. బరువు తగ్గడములో సహకరిస్తుంది. మిగతా వేరు దుంపల మాదిరిగానే వీటిలో ప్రాణ్యములు (ప్రోటీన్లు) కొద్దిగానే ఉంటాయి.
విటమిన్ " సి," "బి-6 ," "ఇ," మేంగనీస్, కేల్సియం, ఇనుము, భాస్వరం తోపాటు పోషక నార (dietary fiber), ఏంటీ ఆక్సిడేంట్లు వంటి పోషక పదార్థాలు చేమ దుంపలలో ఉన్నాయి.
మరీ ఎక్కువగా తినడము వలన కడుపులో వికారము, అసౌకర్యము, విరోవనాలు వంటివి కలుగవచ్చును.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.