![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1f/Clementinum_baroque_library_7.jpg/640px-Clementinum_baroque_library_7.jpg&w=640&q=50)
చెక్ గణతంత్రం జాతీయ గ్రంథాలయం
From Wikipedia, the free encyclopedia
చెక్ గణతంత్రం జాతీయ గ్రంథాలయం (Czech: Národní knihovna České republiky ) చెక్ గణతంత్రం దేశపు కేంద్ర గ్రంథాలయం. ఇది దేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంది. లైబ్రరీ ప్రధాన భవనం ప్రాగ్ మధ్యలో ఉన్న చారిత్రక క్లెమెంటినమ్ భవనంలో ఉంది. లైబ్రరీ లోని దాదాపు సగం పుస్తకాలు ఇక్కడ ఉంటాయి. మిగిలిన సగం పుస్తకాలు హోస్టివార్ జిల్లాలో ఉంటాయి. [3] నేషనల్ లైబ్రరీ చెక్ గణతంత్రంలో అతిపెద్ద లైబ్రరీ. ఇందులో దాదాపు 60 లక్షల డాక్యుమెంట్లున్నాయి. లైబ్రరీలో ప్రస్తుతం దాదాపు 20,000 మంది నమోదిత పాఠకులు ఉన్నారు. ఎక్కువగా చెక్ భాషా పుస్తకాలు ఉన్నప్పటికీ, ఈ లైబ్రరీలో టర్కీ, ఇరాన్, భారతదేశాలకు చెందిన పాత విషయాలను కూడా నిల్వ చేస్తుంది. [4] లైబ్రరీలో ప్రేగ్లోని చార్లెస్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. [5]
త్వరిత వాస్తవాలు దేశము, తరహా ...
![]() జాతీయ గ్రంథాలయం లోని బరోక్ లైబ్రరీ హాల్ | |
దేశము | చెక్ రిపబ్లిక్ |
---|---|
తరహా | జాతీయ గ్రంథాలయం |
స్థాపితము | 1777 (247 సంవత్సరాల క్రితం) (1777) |
ప్రదేశము | Clementinum, Prague |
భౌగోళికాంశాలు | 50°5′14.62″N 14°25′2.58″E |
గ్రంధ సంగ్రహం / సేకరణ | |
గ్రంధాల సంఖ్య | మొత్తం 73,58,308 [1] 21,271 manuscripts[1] c. 4,200 incunabula[2] |
మూసివేయి