చిన్నమస్తా భగవతి
From Wikipedia, the free encyclopedia
చిన్నమస్తా భగవతి ఆలయం నేపాల్ లోని సప్తరి జిల్లా రాజ్బిరాజ్ దక్షిణ సరిహద్దు ప్రాంతంలోని చిన్నమస్తా సఖాడా గ్రామంలో ఉంది. చిన్నమస్తా భగవతి ఆలయం ప్రజల కోరికలను నెరవేర్చే శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడికి నేపాల్, భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు సందర్శనార్థం వస్తూ ఉంటారు. ఈ ఆలయం సప్తరి జిల్లా ప్రధాన కార్యాలయం రాజ్బిరాజ్ నుండి 10 కి.మీ దూరంలో భారత సరిహద్దుకు సమీపంలో ఉంది. ఈ ఆలయంలో దషైన్ను ప్రధాన పండుగగా జరుపుకుంటారు. ఈ ఆలయంలో మొక్కుబడి ఉన్న భక్తులు మేకలను బలి ఇస్తారు. చాలా మంది హిందువులు తమ కొత్త వాహనాలకు పూజలు నిర్బహించుకోడానికి ఇక్కడికి వస్తుంటారు.[1]
త్వరిత వాస్తవాలు చిన్నమస్తా భగవతి దేవాలయం, స్థానం ...
చిన్నమస్తా భగవతి దేవాలయం | |
---|---|
స్థానం | |
దేశం: | నేపాల్ |
రాష్ట్రం: | సాగరమాత |
జిల్లా: | సప్తారి జిల్లా |
ప్రదేశం: | సఖ్దా, చిన్నమస్త |
భౌగోళికాంశాలు: | 26°27′04″N 86°43′52″E |
మూసివేయి