From Wikipedia, the free encyclopedia
చత్తీస్గఢ్ లోని జగదల్పూర్ పట్టణానికి ఉత్తరాన 30 కిలో మీటర్ల దూరంలో ఇంద్రావతి నదిపై ఉన్న జలపాతమే చిత్రకోట్ జలపాతం. దీన్ని చిత్రకూట్ జలపాతం అని కూడా అంటారు. చిత్రకోట్ జలపాతముల దగ్గర పర్యాటకుల కోసం నిర్మించబడిన అతిథి గృహములు కూడా ఉన్నాయి.
చిత్రకోట్ జలపాతం | |
---|---|
ప్రదేశం | బస్తర్ జిల్లా, చత్తీస్గఢ్ |
అక్షాంశరేఖాంశాలు | 19°12′23″N 81°42′00″E |
రకం | Cataract |
మొత్తం ఎత్తు | 29 మీటర్లు (95 అ.) |
బిందువుల సంఖ్య | 3 |
నీటి ప్రవాహం | ఇంద్రావతి నది |
ఈ జలపాతం ఎత్తు 29 మీటర్లు.[1][2] ఇది భారతదేశంలోకెల్లా వెడల్పైన జలపాతం. నీరు బాగా ఉన్న సమయంలో దీని వెడల్పు 200 మీటర్లు ఉంటుంది.[3] దీని వెడల్పు కారణంగా దీన్ని భారతదేశపు నయాగరా అని అంటారు.[4] నీటి ప్రవాహం తక్కువగా ఉన్నపుడు ఈ జలపాతం మూడు పాయలుగా దూకుతుంది.
చిత్రకోట్ జలపాతం గుర్రపునాడా ఆకరంలో ఉంటుంది. నదిలో ప్రవాహం ఉధృతంగా ఉన్నపుడు, గుర్రపు నాడా మొత్తంపై నీరు దూకుతూ ఉంటుంది. వరదనీరు వచ్చే కాలంలో ప్రవాహంలో మట్టి కూడా వస్తుంది. .[5][6]
ఈ జలపాతం వద్ద ఒక శివాలయం ఉంది. జలపాతానికి ఎడమ వైపున సహజంగా ఏర్పడీన గుహలున్నాయి. వీటిని పార్వతి గుహలు అంటారు..
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.