![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/56/Charlie_Munger_%2528cropped%2529.jpg/640px-Charlie_Munger_%2528cropped%2529.jpg&w=640&q=50)
చార్లీ ముంగెర్
From Wikipedia, the free encyclopedia
చార్లెస్ థామస్ ముంగెర్ (ఆంగ్లం Charles Thomas Munger) (1924 జనవరి 1 - 2023 నవంబరు 28) ఒక అమెరికన్ వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు, పరోపకారి. అతను బెర్క్‌షైర్ హాత్వే(Berkshire Hathaway) వైస్ ఛైర్మన్, వారెన్ బఫ్ఫెట్ వ్యాపార భాగస్వామి. పైగా ఆయనకు చార్లీ ముంగెర్ కుడిచేతి వ్యక్తిగా అభివర్ణింస్తారు.
చార్లీ ముంగెర్ | |
---|---|
![]() 2010లో చార్లీ ముంగెర్ | |
జననం | చార్లెస్ థామస్ ముంగెర్ (1924-01-01)1924 జనవరి 1 ఒమాహా, నెబ్రాస్కా, అమెరికా |
మరణం | 2023 నవంబరు 28(2023-11-28) (వయసు 99) శాంటా బార్బరా, కాలిఫోర్నియా, అమెరికా |
విద్య |
|
వృత్తి | వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు, పరోపకారి, ఆర్థిక విశ్లేషకుడు, న్యాయవాది |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | వారెన్ బఫ్ఫెట్తో బెర్క్‌షైర్ హాత్వేలో ప్రముఖ పెట్టుబడులు |
బిరుదు | వైస్ ఛైర్మన్, బెర్క్‌షైర్ హాత్వే |
జీవిత భాగస్వామి | నాన్సీ జీన్ హగ్గిన్స్
(m. 1945; div. 1953)నాన్సీ బారీ బోర్త్విక్
(m. 1956; died 2010) |
పిల్లలు | 7 |
Military career | |
సేవలు/శాఖ | యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ |
సేవా కాలం | 1943–1946 |
ర్యాంకు | రెండవ లెఫ్టినెంట్ |
యూనిట్ | ఆర్మీ ఎయిర్ ఫోర్సెస్ |
పోరాటాలు / యుద్ధాలు | రెండవ ప్రపంచ యుద్ధం |
సంతకం | |
![]() |
చార్లీ ముంగెర్ 1984 నుండి 2011 వరకు వెస్కో ఫైనాన్షియల్ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా పనిచేశాడు. అతను కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డైలీ జర్నల్ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా, కాస్ట్కో హోల్‌సేల్ కార్పొరేషన్(Costco) డైరెక్టర్‌గా కూడా ఉన్నాడు.
అతని ‘నో నాన్సెన్స్’ విధానంతో అమెరికన్ ఇండస్ట్రీలో ప్రసిద్ధి చెందాడు. నాణ్యమైన కంపెనీలు గుర్తించి తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఆ కంపెనీల ఉత్పాదకత ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి ఈక్విటీల్లో పెట్టుబడిపెట్టి లాభం సంపాదించడంలో ఆయన దిట్ట.