చాందీపూర్
ఒడిశాలోని ఒక పట్నం / From Wikipedia, the free encyclopedia
చాందీపూర్ ను చాందీపూర్-ఆన్-సీ అని కూడా అంటారు. ఒరిస్సా (ఒడిషా), బాలేశ్వర్ (బాలెసోర్) జిల్లాలోని ఓ చిన్న సముద్ర తీర రిసార్టు. బాలేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి 16 కిమీ దూరంలో ఉంటుంది.
చాందీపూర్కు ఒక విశిష్టత ఉంది - భారత్ తయారుచేసిన క్షిపణులు దాదాపుగా అన్నిటినీ పరీక్షించేది ఇక్కడే.
చాందీపూర్కు మరో విశిష్టత ఉంది - ఆటూ పోట్ల సమయాల్లో సముద్రం వెనక్కు వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తూ ఉంటుంది. ఆటు/పాటు సమయంలో సముద్రం 5 కి.మీ. వెనక్కి వెళ్తుంది. మళ్ళీ పోటు సమయంలో మామూలుగా వస్తుంది. అంటే, చూస్తూండగానే రోజుకు ఒకసారి సముద్రం అదృశ్యమై మళ్ళీ ప్రత్యక్షమౌతుందన్నమాట. దీనివల్ల ఈ బీచి జీవవైవిధ్యానికి ఆలవాలమైంది. బీచి దగ్గరలో మిర్జాపూర్ వద్ద బుద్ధ బలంగా నది సంగమం వద్ద గుర్రపునాడా పీత దొరుకుతుంది. ఇదొక చక్కని పిక్నిక్ స్థలం. ఒరిస్సా పర్యాటక సంస్థ వారి పాంథనివాస్ ఒకటి ఇక్కడ ఉంది.