చక్రేశ్వరి శివాలయం
From Wikipedia, the free encyclopedia
చక్రేశ్వర శివాలయం ఒడిషా రాష్ట్రానికి చెందిన భువనేశ్వర్ లో ఉన్న శైవ ఆలయం. దీనిని 10-11 వ శతాబ్దాలలో నిర్మించారు. ఇది భువనేశ్వర్ నగరంలోని హతియాసుని మార్గంలో ఉంది. శివ లింగం గర్భగుడి లోపల వృత్తాకార యోనిపీఠంలో ఉంది. ఈ దేవాలయం చుట్టూ తూర్పు, ఉత్తరం ప్రైవేటు నివాస భవనాలు, పడమర వైపు చక్రేశ్వర కొలను ఉన్నాయి. ఈ దేవాలయంలో శివరాత్రి, దీపావళి , సంక్రాంతి వంటి పండగలలో వివిధ ఆచారాలు గమనించవచ్చు. ఈ దేవాలయంలో రుద్రాభిషేకం, చంద్రాభిషేకం వంటి పవిత్ర కార్యక్రమాలు జరుగుతుంటాయి.
త్వరిత వాస్తవాలు చక్రేశ్వరి శివాలయం, భౌగోళికాంశాలు : ...
చక్రేశ్వరి శివాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 20°14′27″N 85°50′12″E |
ప్రదేశం | |
దేశం: | భారతదేశము |
రాష్ట్రం: | ఒడిశా |
ప్రదేశం: | భువనేశ్వర్ |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శివుడు |
ప్రధాన దేవత: | పార్వతి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | కళింగ నిర్మాణశైలి |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా.శ..10-11వ శతాబ్దాలు |
మూసివేయి