చంబా జిల్లా
హిమాచల్ ప్రదేశ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
హిమాచల్ ప్రదేశ్ జిల్లాలలో చంబా జిల్లా ఒకటి. ఈ జిల్లాకు చంబా పట్టణం కేంద్రంగా ఉంది. జిల్లా లోని డల్హౌసీ, కజీహియార్ హిల్ స్టేషన్లలో సెలవులు గడిపేందుకు మైదానప్రాంతాల ప్రజలు ఎక్కువగా వస్తూంటారు. ఉత్తర భారతదేశంలో క్రీ.పూ 500 నుండి చరిత్రను ఆధారాలతో వ్రాతపూర్వకంగా నమోదుచేసిన ప్రాంతమిదే అని భావిస్తున్నారు. అత్యంత ఎత్తైన పర్వశ్రేణులు ఇక్కడ శతాబ్దాలుగా ఉన్న శిథిలాలు, అనేక శిలాశాసనాలను సరక్షిస్తున్నాయి . ఇది హిమాచల్ ప్రదేశ్ వాయవ్య ప్రాంతంలో ఉంది. 1000 సంవత్సరాలకు పూర్వం చంబా మహారాజు నిర్మించిన ఆలయాలలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఆలయాలకు భూమిదానం చేసిన తామ్రపత్రాలు ఇప్పటికీ సంరక్షించబడుతూ చట్టబద్ధమైన విలువను కలిగి ఉన్నాయి.,
త్వరిత వాస్తవాలు చంబా జిల్లా, దేశం ...
చంబా జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హిమాచల్ ప్రదేశ్ |
ముఖ్య పట్టణం | చంబా |
విస్తీర్ణం | |
• మొత్తం | 6,528 కి.మీ2 (2,520 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 3,93,386 |
• జనసాంద్రత | 60/కి.మీ2 (160/చ. మై.) |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి