![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/42/Mahesh_Babu_in_Spyder.jpg/640px-Mahesh_Babu_in_Spyder.jpg&w=640&q=50)
ఘట్టమనేని మహేశ్ బాబు
ప్రముఖ సినీ నటుడు / From Wikipedia, the free encyclopedia
ఘట్టమనేని మహేశ్ బాబు (ఆగష్టు 9, 1975) తెలుగు సినీ నటుడు. ఈయన ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు. బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు. కథానాయకుడిగా 25కి పైగా చిత్రాల్లో నటించాడు. మొదటి సినిమా రాజకుమారుడు తోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నాడు. 2003 లో వచ్చిన నిజం సినిమాకు మొదటి సారిగా నంది ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు. తర్వాత 2005 లో వచ్చిన అతడు, 2011 లో వచ్చిన దూకుడు, 2015 లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నాడు. సినీ నటి నమ్రత శిరోద్కర్ ను వివాహం చేసుకున్నాడు.
త్వరిత వాస్తవాలు మహేశ్ బాబు, జననం ...
మహేశ్ బాబు | |
---|---|
![]() స్పైడర్ సినిమా లో మహేష్ బాబు | |
జననం | ఘట్టమనేని మహేశ్ బాబు (1975-08-09) 1975 ఆగస్టు 9 (వయసు 48) మద్రాస్, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | ప్రిన్స్, సూపర్ స్టార్ |
పౌరసత్వం | భారతదేశం |
విద్యాసంస్థ | లయోలా కాలేజీ, చెన్నై. |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1979 - 1990 (బాల నటుడు); 1999 - ప్రస్తుతం |
ఎత్తు | 6.3" అడుగులు |
జీవిత భాగస్వామి | నమ్రత శిరోద్కర్ |
పిల్లలు | గౌతమ్ కృష్ణ, సితార |
తల్లిదండ్రులు |
|
పురస్కారాలు | నంది పురస్కారం,ifa,siima |
వెబ్సైటు | http://www.princemahesh.com/ |
మూసివేయి