గోలియత్ బర్డ్ ఈటర్ అనే జీవి ఒక రకమైన సాలీడు. ఇది "టారంటులా" కుటుంబానికి, "థెరస్పోసిడె" వర్గానికి చెందినది. ఇది ప్రపంచంలో రెండవ అతి పెద్ద సాలీడు. మొదటి స్థానంలో గలది "జెయింట్ హంట్స్‌మాన్ స్పైడర్". ఇది ద్రవ్యరాశి లో అతి పెద్దది కావచ్చు[1]. దీనిని "గోలియత్ బర్డ్ ఈటింగ్ స్పైడర్" అని కూడా పిలుస్తారు. దీనిని 18వ శతాబ్దంలో "మారియా సైబిలా మెరియన్" అనే వ్యక్తి హమ్మింగ్ బర్డ్ ను తినుచుండగా పరిశీలించి దీనిని "థెరఫోసైడ్స్" "బర్డ్ ఈటింగ్" అని పిలిచాడు.[2]

త్వరిత వాస్తవాలు గోలియత్ బర్డ్ ఈటింగ్ స్పైడర్, Conservation status ...
గోలియత్ బర్డ్ ఈటింగ్ స్పైడర్
Thumb
Theraphosa blondi, adult female
Conservation status
Not evaluated (IUCN 3.1)
Scientific classification
Kingdom:
Phylum:
Arthropoda
Class:
Arachnida
Order:
Araneae
Suborder:
Mygalomorphae
Family:
Theraphosidae
Genus:
Theraphosa
Species:
T. blondi
Binomial name
Theraphosa blondi
(Latreille, 1804)
Synonyms
  • T. blondii
  • T. leblondii
మూసివేయి
Thumb
దక్షిణాఫ్రికా లో దొరికిన గోలియత్ బర్డ్ ఈటర్

లక్షణాలు

ఇవి ఎక్కువగా అమెరికా అడవుల్లో ఉండే ఈ రాకాసి సాలీళ్ళు. దీని ఒంటి నిండా వెండ్రుకలు ఉంటాయి. ఇవి వాటిని ఎదుటి జీవి పైకి బాణాల్లాగా విసరగలదు. ఆ వెండ్రుకలు గుచ్చుకుంటే ఏ జీవైనా విలవిల్లాడాల్సిందే. ఇది ఎనిమిది కాళ్లనూ విప్పిందంటే 12 అంగుళాల స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఇది అన్ని సాలీళ్లలాగా గూడు కట్టదు. బొరియల్లో జీవించే దీనికి ఎనిమిది కాళ్లతో పాటు ఎనిమిది కళ్లుంటాయి. రెండు కోరలు కూడా ఉంటాయి. ఒక్కొక్కటీ అంగుళం పొడవుంటే ఈ కోరల్లో విషం ఉంటుంది. వీటితో గుచ్చిందంటే ఇక ఆ జీవి కదల్లేదు. ఇవి పాములు, పక్షులు, కప్పలు, తొండల్లాంటి జీవులపై అమాంతం దూకి కోరలతో కాటేస్తాయి. ఆ విషం వల్ల వాటి శరీరంలో కండరాలన్నీ మెత్తగా అయిపోతాయి. అప్పుడు ఆ సారాన్ని ఇది పీల్చేస్తుందన్నమాట. దీనికి ఇంకో విద్య కూడా ఉంది. వెంట్రుకలతో ఉన్న కాళ్లను ఒకదానికి ఒకటి రుద్దిందంటే 'హిస్స్‌స్‌స్‌...' అనే శబ్దం వస్తుంది. ఇది ఏకంగా 15 అడుగుల దూరం వినిపిస్తుంది. వీటిలో ఆడవి 25 సంవత్సరాలు బతికితే, మగవి ఆరేళ్లే ఉంటాయి. మగవాటిని ఆడవి చంపి తినేయడమే దీనికి కారణం. ఇవి 400 గుడ్లు పెడతాయి. వాటి నుంచి రెండు నెలల్లో పిల్లలు వస్తాయి. పుట్టగానే సొంతంగా జీవిస్తాయి.[3]

అలవాట్లు - జీవావరణం

థెరఫోస బ్లోండి అనే ఈ జీవి దక్షిణ అమెరికా లోని రైన్ ఆడవులలో ఉంటుంది. ఇవి సాధారణంగా తడిగా ఉన్న చిత్తడినేల గల ప్రదేశాలలో ఉంటాయి. ఇవి చిన్న చిన్న బొరియలలో నివసిస్తాయి. ఇవి బొరియలను స్వయంగా తయారుచేసుకొని, లేదా యితర జీవులు తయారు చేసిన బొరియలలో నివసిస్తాయి.

జీవిత చక్రం

ఆడ జీవులు కలసి ఉంటాయి. కొన్ని సందర్భాలలో సహచరులని తింటాయి. ఆడ జీవులు 3 లేదా 4 సంవత్సరాలకు పరిపక్వత పొందుతాయి. వీటి సరాసరి జీవన ప్రమాణం 15 నుండి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. మగ జీవులు పరిపక్వత పొందిన తర్వాత చనిపోతాయి. వీటి సరాసరి జీవన ప్రమాణం 6 సంవత్సరాలు ఉంటుంది. వీటి రంగు ముదురు నుండి లేత ఊదా రంగులో ఉంటుంది. ఊదా రంగు చారలు వాటి కాలిపై కూడా కనిపిస్తాయి. ఈ జీవులు శరీరంపై వెండ్రుకలు కలిగి ఉంటాయి. ఆడ జీవులు 100 నుండి 200 గుడ్లను పెట్టి రెండు నెలలలో పొదుగుతాయి.

వర్ణన

ఈ సాలీళ్ళు యొక్క కాళ్ల మధ్య దూరం 30 సెం.మీ ఉంటుంది. ఇవి 170 గ్రాముల బరువు ఉంటాయి. ఇది అన్ని సాలీళ్లలాగా గూడు కట్టదు. బొరియల్లో జీవించే దీనికి ఎనిమిది కాళ్లతో పాటు ఎనిమిది కళ్లుంటాయి. రెండు కోరలు కూడా ఉంటాయి. ఒక్కొక్కటీ అంగుళం పొడవుంటే ఈ కోరల్లో విషం ఉంటుంది. వీటితో గుచ్చిందంటే ఇక ఆ జీవి కదల్లేదు. ఇది ఎనిమిది కాళ్లనూ విప్పిందంటే 12 అంగుళాల స్థలాన్ని ఆక్రమిస్తుంది.ఇది అన్ని సాలీళ్లలాగా గూడు కట్టదు. బొరియల్లో జీవించే దీనికి ఎనిమిది కాళ్లతో పాటు ఎనిమిది కళ్లుంటాయి. రెండు కోరలు కూడా ఉంటాయి. ఒకోటీ అంగుళం పొడవుండే ఈ కోరల్లో విషం ఉంటుంది. వీటితో గుచ్చిందంటే ఇక ఆ జీవి కదల్లేదు.ఇవి పాములు, పక్షులు, కప్పలు, తొండల్లాంటి జీవులపై అమాంతం దూకి కోరలతో కాటేస్తాయి. ఆ విషం వల్ల వాటి శరీరంలో కండరాలన్నీ మెత్తగా అయిపోతాయి. అప్పుడు ఆ సారాన్ని ఇది పీల్చేస్తుంది. దీనికింకో విద్య కూడా ఉంది. వెంట్రుకలతో ఉన్న కాళ్లను ఒకదానికి ఒకటి రుద్దిందంటే "హిస్స్‌స్‌స్‌..." మనే శబ్దం వస్తుంది. ఇది ఏకంగా 15 అడుగుల దూరం వినిపిస్తుంది.ఇవి 400 గుడ్లు పెడతాయి. వాటి నుంచి రెండు నెలల్లో పిల్లలు వస్తాయి. పుట్టగానే సొంతంగా జీవిస్తాయి.[4]

విషము

విషంతో కూడిన యితర పురుగుల మాదిరిగా అవి పెద్ద కోరలు కలిగి ఉంటాయి. వీటితో మనిషి శరీరాన్ని చీల్చగలదు.(1.9–3.8 సెం.మీ. లేదా 0.75–1.5 అంగుళాలు). అవి కోరల ద్వారా విషాన్ని దాడి చేయవలసిన జీవుల శరీరాల్లోకి పంపిస్తాయి. ఈ విషం కందిరీగ కొండితో చేసిన గాయాల కన్నా సాపేక్షంగా ప్రమాదకరమైనది కాదు. ఈ జీవులు మానవులపై దాడి చేయటానికి కారణం స్వయం రక్షణ కోసమే. వీటి దాడి అన్ని సందర్భాలలోనూ విషపూరితం కాకపోవచ్చు. అవి దాడి చేయునపుడు, అవి వాటి పొట్ట భాగానికి రాపిడి కలిగిస్తాయి. అపుడు రోమాలు పైకి వచ్చి అవి మానవ శరీరానికి తగిలి దురద భావన కలుగుతుంది. ఈ రోమాల రాపిడి మనుష్యులకు ప్రమాదకరమైనది.

ఏదైనా దాడి చేస్తే ఇవి ఎదుర్కొనే విధానం చిత్రంగా ఉంటుంది. భయపడినప్పుడు వెనక కాళ్లతో పొట్టమీద రుద్దుకుంటే అక్కడ ఉండే వెంట్రుకలు బాణాల్లాగా గాలిలోకి ఎగిరి ఎదురుగా ఉన్న జీవి శరీరంలోకి దిగబడతాయి. వాటిలో ఉండే విషం వల్ల అది కదలలేకుండా అయిపోతుంది. గూడు అల్లని సాలీళ్లగా కూడా వీటికి గుర్తింపు ఉంది. భూమిలోపల బొరియల్లో ఉండే ఇవి వాటి గోడల్ని మాత్రం దారాలతో నింపుతాయి. మట్టి కూలిపోకుండా ఉండడానికన్నమాట. ఇవి తడవకి 2000 గుడ్లు పెడతాయి. కొన్నింటిలో కాళ్లు ప్రమాదవశాత్తూ తెగిపోయినా అవి మళ్లీ యధావిధిగా పెరుగుతాయి. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో వీటిని తింటారు కూడా. వీటి ప్రధాన శత్రువు స్పైడర్‌ వాస్ప్‌ అనే కీటకం.[5]

సూచికలు

ఇతర లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.