From Wikipedia, the free encyclopedia
గుంటూరు నగర పాలక సంస్థ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరానికి చెందిన స్థానిక స్వపరిపాలన సంస్థ. ఇది రాష్ట్రంలోని ఒక పురాతన పురపాలక సంస్థ.[1]
సంకేతాక్షరం | GMC |
---|---|
ఆశయం | కృషితో నాస్తి దుర్భిక్షం |
స్థాపన | 1866 1994 (సంస్థ నవీకరణ) |
రకం | ప్రభుత్వేతర సంస్థ |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన సంస్థ |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | గుంటూరు |
కార్యస్థానం | |
అధికారిక భాష | తెలుగు |
మున్సిపల్ కమిషనర్ | ఎస్.నాగలక్ష్మి |
ప్రధానభాగం | కమిటీ |
జాలగూడు | http://www.gunturcorporation.org/ |
ఈ సంస్థ, 1866 లో గుంటూరు పురపాలక సంస్థగా ఏర్పడింది, 1881 లో మొదటి ఎన్నికలు జరిగాయి. 1891 లో రెండో గ్రేడ్, 1971 లో మొదటి గ్రేడ్, 1952 లో ప్రత్యేక గ్రేడ్, 1960 లో ఎంపిక గ్రేడ్ గా ఎర్పడింది. 1994 లో గుంటూరు నగర పాలక సంస్థగా ఏర్పడింది.[2][3]
2012 లో, గుంటూరు పది పరిసర గ్రామాలను నగరంలో విలీనం చేశారు.[4][5] కార్పొరేషన్ యొక్క ప్రస్తుత ప్రాంతం 168.41 కి.మీ2 (65.02 చ. మై.) విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. 52 వార్డులు కలిగిఉంది.[6] ఎస్.నాగలక్ష్మి ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ గా ఉంది.[7]
పౌర సేవల్లో ప్రధానమైనవి, రోడ్లు, బస్సు షెల్టర్లు, కాలిబాటలు, పబ్లిక్ గార్డెన్స్ మొదలైనవి కార్పొరేషన్ వారు అభివృద్ధి చేశారు.[8]
ఒక 15 మెగావాట్ల వ్యర్ధాల నుండి విద్యుత్ ఉత్పత్తి చెసే ప్లాంట్ ను జెఐటియఫ్ లిమిటెడ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహకారంతో ఏర్పాటు చేశారు. గుంటూరు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లు, గుంటూరు జిల్లా నుండి ఏడు ఇతర పురపాలక సంఘాలతో పాటు దీనిలో భాగస్వామ్యులు.[9]
నేషనల్ అర్బన్ పారిశుద్ధ్య విధానం (2009 –10) ప్రకారం, నగరనికి మొత్తం 39.363 పాయింట్లతో 42వ స్థానం ఇచ్చారు.[10]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.