ఖుంజేరబ్ కనుమ కారకోరం పర్వత శ్రేణిలో ఉన్న కనుమ దారి. ఇది పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరు, గిల్గిట్-బాల్టిస్తాన్ లోని హుంజా, నగర్ జిల్లాలకూ, చైనా నైరుతి సరిహద్దులోని జింజియాంగ్‌కూ మధ్య ఉంది. సముద్ర మట్టం నుండి దీని ఎత్తు 4,693 మీటర్లు ఉంటుంది.

త్వరిత వాస్తవాలు ఖుంజేరబ్ కనుమ, సముద్ర మట్టం నుండి ఎత్తు ...
ఖుంజేరబ్ కనుమ
Thumb
Khunjerab Pass
సముద్ర మట్టం
నుండి ఎత్తు
4,693 m (15,397 ft)
ఇక్కడ ఉన్న
రహదారి పేరు
Karakoram Highway
ప్రదేశంపాక్ ఆక్రమిత కశ్మీరు లోని హుంజా / చైనా లోని జింజియాంగ్
శ్రేణికారకోరం శ్రేణి
Coordinates36°51′00″N 75°25′40″E
Thumb
ఖుంజేరబ్ కనుమ
ఖుంజేరబ్ కనుమ స్థానం
Thumb
ఖుంజేరబ్ కనుమ
ఖుంజేరబ్ కనుమ (Gilgit Baltistan)
Thumb
ఖుంజేరబ్ కనుమ
ఖుంజేరబ్ కనుమ (Xinjiang)
మూసివేయి
Thumb
అంతరించిపోతున్న జాతి మంచు చిరుత ఖుంజెరాబ్ జాతీయ ఉద్యానవనంలో కనిపిస్తుంది
త్వరిత వాస్తవాలు ఖుంజేరబ్ కనుమ, Chinese name ...
ఖుంజేరబ్ కనుమ
Chinese name
సంప్రదాయ చైనీస్紅其拉甫山口
సరళీకరించిన చైనీస్红其拉甫山口
మూసివేయి

శబ్దవ్యుత్పత్తి

దీని పేరు స్థానిక వాఖీ భాషలోని రెండు పదాల నుండి ఉద్భవించింది. ఈ భాషలో "ఖూన్" అంటే రక్తం అని, "జేరబ్": అంటే నీటిబుగ్గ లేదా జలపాతం అనీ అర్థం.

ప్రశస్తి

ఖుంజేరబ్ కనుమ ప్రపంచంలోనే ఎత్తైన అంతర్జాతీయ సరిహద్దు రహదారి. కారకోరం హైవే పై ఇది అత్యంత ఎత్తైన ప్రదేశం. ఈ కనుమ గుండా వేసిన రహదారి 1982 లో పూర్తయింది. కారకోరం శ్రేణిలో అంతకు ముందు ప్రాచుర్యంలో ఉన్న మింటాకా, కిలిక్ కనుమల గుండా పోయే కచ్చా రోడ్ల స్థానంలో ఈ కొత్త రహదారి ప్రాచుర్యం పొందింది. ఖుంజేరబ్ కనుమ గుండా కారకోరం హైవేను వెయ్యాలని 1966 లో నిర్ణయించారు. మింటాకా కనుమకు వైమానిక దాడుల ముప్పు ఎక్కువ ఉందని పేర్కొంటూ చైనా, మరింత నిటారుగా ఉన్న ఖుంజేరబ్ కనుమ‌ను సిఫారసు చేసింది. [1]

ఈ కనుమ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు లోని నేషనల్ పార్క్ స్టేషన్ నుండి, దీహ్ లోని చెక్ పాయింట్ నుండీ 42 కి.మీ. దూరం లోను, సోస్త్ లోని కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ పోస్ట్ నుండి 75 కి.మీ. దూరం లోనూ, గిల్గిట్ నుండి 270 కి.మీ. దూరం లోనూ, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాదు నుండి 870 కి.మీ. దూరం లోనూ ఉంది.

చైనా వైపు ఈ కనుమ, చైనా నేషనల్ హైవే 314 (జి 314 ) కు నైరుతి టెర్మినస్. ఇది తాష్కుర్గాన్ నుండి 130 కి.మీ., కష్గర్ నుండి 420 కి.మీ., ఉరుమ్కి నుండి 1,890 కి.మీ. ఉంటుంది. కనుమ నుండి 3.5 కి.మీ. దూరంలో, తాష్కుర్గాన్ కౌంటీలో చైనా దేశపు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఉంది

ఈ పొడవైన, చదునైన కనుమ దారి శీతాకాలంలో ఎక్కువగా మంచుతో కప్పడిపోయి ఉంటుంది [2] అందుచేత ఈ కనుమను, నవంబర్ 30 నుండి మే 1 వరకూ భారీ వాహనాలకూ, డిసెంబరు 30 నుండి ఏప్రిల్ 1 వరకు అన్ని రకాల వాహనాలకూ మూసివేస్తారు. [3]

పునర్నిర్మించిన కారకోరం హైవే ఖుంజేరబ్ కనుమ గుండా వెళుతుంది.

2006 జూన్ 1 నుండి, గిల్గిట్ నుండి జిన్జియాంగ్లోని కష్గర్ వరకు సరిహద్దు మీదుగా రోజువారీ బస్సు సర్వీసు నడుపుతున్నారు. [4]

Thumb
పాకిస్తాన్లోని నగరాలకు దూరాన్ని చూపించే దారి సూచిక

ఈ కనుమ వద్ద ట్రాఫిక్ ఎడమ వైపు (పాకిస్తాన్-పరిపాలన గిల్గిట్-బాల్టిస్తాన్) నుండి కుడి వైపుకు (చైనా) మారుతుంది. ఇలాంటి కొద్ది అంతర్జాతీయ సరిహద్దులలో ఇది ఒకటి.

ప్రపంచంలో అత్యంత ఎత్తున ఉన్న ఎటిఎం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తున ఉన్న ఎటిఎం ఈ కనుమ వద్ద పాకిస్తాన్ వైపున ఉంది. దీనిని నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్, 1LINK లు నిర్వహిస్తున్నాయి. . [5]

రైల్వే

2007 లో, పాకిస్తాన్ పాలిత గిల్గిట్-బాల్టిస్తాన్‌ను చైనాతో అనుసంధానించేలా, ఈ కనుమ ద్వారా రైలుమార్గ నిర్మాణాన్ని అంచనా వేయడానికి కన్సల్టెంట్లను [6] నియమించారు. పాకిస్తాన్ లోని హవేలియన్ (కనుమ నుండి750 కి.మీ.) ను చైనా వైపున జిన్జియాంగ్‌ లోని కష్గర్ (కనుమ నుండి 350 కి.మీ.) తో అనుసంధానించే మార్గం కోసం 2009 నవంబరులో సాధ్యాసాధ్యాల అధ్యయనం ప్రారంభమైంది. [7] అయితే, ఆ తరువాత ఈ పనిలో ఎటువంటి పురోగతి జరగలేదు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత సిపిఇసి ప్రణాళికలో భాగం కాదు.

గ్యాలరీ

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.