కోణార్క్
13 వ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం ఉండే స్థలం / From Wikipedia, the free encyclopedia
కోణార్క్ ఒడిషా రాష్ట్రంలో పూరీ జిల్లాకు చెందిన ఒక మధ్యతరహా పట్టణం. ఇది బంగాళాఖాతం సముద్ర తీరాన ఆ రాష్ట్ర రాజధానికి భువనేశ్వర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.[1] ఇది భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక స్థలాలలో ఒకటి. ఇక్కడ నల్ల గ్రానైటు రాళ్ళతో కట్టిన పదమూడవ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం ఉంది. దీన్ని తూర్పు గాంగ వంశానికి చెందిన నరసింహదేవుడు (1236 - 1264) నిర్మించాడు. ఈ ఆలయం ప్రపంచ వారసత్వ పరిరక్షిత ప్రదేశం. సూర్యుని రథం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం నగిషీలు చెక్కిన శిల్పాలతో అలంకరించబడి ఉంది. ఈ ఆలయ సముదాయం మొత్తం ఏడు బలమైన అశ్వాలు, 12 జతల అలంకృత చక్రాలతో లాగబడుతున్న పెద్ద రథం ఆకారంలో కట్టబడింది.