పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States) . ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని విభాగాలుగా, ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి. కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
కేరళ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.