కెచ్వా భాష
దక్షిణ అమెరికాలోని ఆండీస్ ప్రాంతంలో మాట్లాడే భాషల కుటుంబం / From Wikipedia, the free encyclopedia
కెచ్వా లేదా కెచువా[1][2] అనేది కెచ్వా ప్రజలు మాట్లాడే ఒక భాష లేదా ఒక భాషా కుటుంబం. ఈ భాషను ప్రధానంగా పెరూ దేశంలోని ఆండీస్ పర్వతాల్లోను, దక్షిణ అమెరికాలోని ఎత్తైన ప్రాంతాలలోనూ నివసిస్తున్నవారు మాట్లాడుతారు. ఇది అమెరికా ఖండాల్లోని ఆదిమ వాసుల భాషల్లో అత్యధికులు మాట్లాడే భాష లేదా భాషా కుటుంబం. మొత్తం 80 లక్షలు నుండి కోటి మంది దాకా మాట్లాడుతారు.[3] పెరూవియన్లలో సుమారు 25% (77 లక్షలు మంది) కెచ్వా భాష మాట్లాడతారు. ఇంకా సామ్రాజ్యం లో ప్రధాన భాషగా ఇది చాలా ప్రసిద్ది చెందింది. పెరూని పాలించిన స్పెయిన్ దేశస్థులు ఈ భాష వాడకాన్ని ప్రోత్సహించారు. కాబట్టి తక్కిన ఆదిమ అమెరికా భాషల మాదిరి కాకుండా కెచ్వా అంతరించిపోలేదు. ఇది పెరూలో అనేక ప్రాంతాల సహ-అధికారిక భాష. ఆ దేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో రెండవది కూడా.
త్వరిత వాస్తవాలు కెచ్వా భాష, అధికారిక స్థాయి ...
కెచ్వా భాష | ||
---|---|---|
మాట్లాడే దేశాలు: | ఆర్జెంటీనా, బొలీవియా, కొలంబియా, ఈక్వేడర్, పెరూ, చిలీ. | |
ప్రాంతం: | మధ్య ఆండీస్ పర్వతశ్రేణి ప్రాంతం | |
మాట్లాడేవారి సంఖ్య: | 80 లక్షలు నుండి కోటి మంది | |
భాషా కుటుంబము: | కెచ్వా భాష | |
అధికారిక స్థాయి | ||
అధికార భాష: | ![]() ![]() | |
నియంత్రణ: | అధికారిక నియంత్రణ లేదు | |
భాషా సంజ్ఞలు | ||
ISO 639-1: | qu | |
ISO 639-2: | — | |
ISO 639-3: | — | |
గమనిక: ఈ పేజీలో IPA ఫోనెటిక్ సింబల్స్ Unicodeలో ఉన్నాయి. |
మూసివేయి