![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7f/Safflower.jpg/640px-Safflower.jpg&w=640&q=50)
కుసుమ
From Wikipedia, the free encyclopedia
కుసుమ (ఆంగ్లం: సాఫ్లవర్/Safflower ) శాస్త్రీయ నామం కార్థమస్ టింక్టోరియస్ (Carthamus Tinctorius Orange) .ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందిన మొక్క.దీని మొదటి ఆవాస ప్రాంతం ఐయా మత్తు ఆఫ్రికా, అలాగే మధ్యభారతం నుండి తూర్పుమధ్యధరాప్రాంతపుదాటి యుథోపియా వరకు వ్యాప్తిచెందినది[1] ఇది చాలా కొమ్మలు కలిగిన ఏకవార్షిక గుల్మం. దీని ఆకులు వాడిగా ఉన్న ముండ్లు కలిగిఉంటాయి. ఈ మొక్కలు 30 నుండి 36 అంగుళాలఎత్తు వరకూ పెరుగుతాయి.[2] కుసుమ పూలు గుండ్రని ఆకారము కలిగి పచ్చటి పసుపు, నారింజ, ఎరుపు లేక తెలుపు రంగులలో ఉంటాయి. ఇవి ఒక్కో కొమ్మకు ఒకటి నుండి ఐదు చొప్పున వస్తాయి. ఒక్కో పువ్వులో 15-20 గింజలు ఉంటాయి. ఈ మొక్క యొక్క తల్లి వేరు దృఢంగా ఉండడం వలన కుసుమ మొక్క పొడి వాతావరణాన్ని బాగా తట్టుకోగలదు. కానీ కాండం పెరిగే దశ నుండి మొక్క పూర్తిగా ఎదిగే వరకూ మంచును ఎంత మాత్రం సహించలేదు.కొమ్మల లేతచివరలలో విటమిన్ A, ఐరన్, ఫాస్పరన్,, కాల్సియంలు అధిశాతంలో ఉన్నాయి. ఆందుచే వీటిని ఓషదులు సాలిడ్ డ్రస్సింగ్స్ తయారిలో వుపయోగిస్తారు.గింజలలో 30% వరకు నూనె వుండును. మిగతా నూనెగింజలలోవున్న నూనెశాతంతో పొల్చిన యిదిబాగా తక్కువ. నూనెగింజలలో నూనె 40-60% వుండును.నూనెగింజల దిగుబడి 600-700 కే.జిలు/హెక్టారుకు/భారతదేశంలో.పూలు అయ్యినచో 100 కే.జీ.లు/హెక్టరుకు.[3] https://upload.wikimedia.org/wikipedia/commons/e/ef/6.mullakaaya_and_seeds._...JPG కుసుమ ప్రధానంగా నూనె గింజ పంట అయినప్పటికీ, అనాదిగా కుసుమ[4] పూరేకుల నుండి తీసిన రంగును ఆహార పదార్ధాలకు రంగునిచ్చే మూలకంగా, వస్త్రాలకు అద్దకపు రంగుగా విరివిగా వాడేవారు.[5] కృత్రిమ రసాయన రంగులు అందుబాటులోకి వచ్చాక అద్దకపు రంగుగా కుసుమ వినియోగం తగ్గిపోయింది. ఇటీవల సహజ రంగులపై మక్కువ పెరుగుతున్న నేపథ్యంలో కుసుమ రంగుకు గిరాకీ పెరిగే అవకాశముంది.
కుసుమ | |
---|---|
![]() | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | Asterids |
Order: | Asterales |
Family: | |
Tribe: | Cynareae |
Genus: | |
Species: | C. tinctorius |
Binomial name | |
Carthamus tinctorius (Mohler, Roth, Schmidt & Boudreaux, 1967) | |
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/97/Carthamus_tinctorius_MHNT.BOT.2011.3.34.jpg/640px-Carthamus_tinctorius_MHNT.BOT.2011.3.34.jpg)