![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/19/Kutty_padmini.jpg/640px-Kutty_padmini.jpg&w=640&q=50)
కుట్టి పద్మిని
భారతీయ నటి / From Wikipedia, the free encyclopedia
కుట్టి పద్మిని దక్షిణ భారతదేశపు సినిమా నటి. ఈమె ఎక్కువగా తమిళ సినిమాలలో నటించింది. ఈమె తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషా చిత్రాలలో కూడా నటించింది.[1] ఈమె తన మూడవయేట 1959లో తొలిసారిగా తమిళ చిత్రంతో బాల నటిగా తన నటజీవితాన్ని ప్రారంభించింది. ఈమె ఎం.జి.రామచంద్రన్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, జైశంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ మొదలైన నటులతో కలిసి నటించింది. ఈమె తమిళనాడు రాష్ట్రం నుండి జాతీయ ఉత్తమ బాలనటి అవార్డును గెలుచుకున్న తొలి కళాకారిణి.[2]
త్వరిత వాస్తవాలు కుట్టి పద్మిని(kutty padmini), జననం ...
కుట్టి పద్మిని(kutty padmini) | |
---|---|
![]() కుట్టి పద్మిని | |
జననం | (1956-06-05) 1956 జూన్ 5 (వయసు 68) |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి, సినిమా నిర్మాత, వాణిజ్యవేత్త |
క్రియాశీల సంవత్సరాలు | 1959-ప్రస్తుతం |
పిల్లలు | కీర్తన, రిధినెక, ఆర్య |
మూసివేయి