![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/96/Saffran_crocus_sativus_moist.jpg/640px-Saffran_crocus_sativus_moist.jpg&w=640&q=50)
కుంకుమ పువ్వు
From Wikipedia, the free encyclopedia
కుంకుమ పువ్వు (Saffron) ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఇరిడాసే కుటుంబానికి చెందిన కుంకుమ పువ్వును ప్రధానంగా శీతలీ ప్రదేశాల్లో పండిస్తారు. కుంకుమపువ్వులో ఉపయోగపడే భాగం - ఎర్ర కేసరాలు మాత్రమే. ఒక కిలో కేసరాలు తయారు చేయాలంటే కనీసం రెండు లక్షల పూలు అవసరమవుతాయి. అందుకే కుంకుమ పువ్వు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యము. కేసరాలు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటాయి. కుంకుమ పువ్వు గర్భిణులు ఆహారంలో తీసుకుంటే పుట్టే బిడ్డ నల్లగానో, చామనఛాయతోనో కాక తెల్లగానో, ఎర్రగానో పుడతుందని ప్రాచుర్యంలోని విశ్వాసం. అయితే అది సరికాదని, తల్లిదండ్రుల జన్యువులు (దాన్ని వారు జీవించే ప్రదేశం ప్రభావితం చేస్తుంది) తప్ప కుంకుమపువ్వు వంటి ఆహార విషయాలు బిడ్డ రంగును నిర్ణయించడంలో ఏ ప్రభావం చూపలేవని వైద్యులు, పరిశోధకులు చెప్తున్నారు.
త్వరిత వాస్తవాలు కుంకుమ పువ్వు, Scientific classification ...
కుంకుమ పువ్వు | |
---|---|
![]() | |
A saffron crocus flower with red stigma. | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | Asparagales |
Family: | |
Genus: | క్రోకస్ |
Species: | క్రో. సెటైవస్ |
Binomial name | |
క్రోకస్ సెటైవస్ | |
మూసివేయి