From Wikipedia, the free encyclopedia
కివీ పండు అనేది 'యాక్టినిడియా చైనిన్సెస్' అనే తీగ జాతి మొక్కకు కాసే పండు. ఈ రకమైన పళ్ళను న్యూజిలాండ్ వంటి చల్లని దేశాల్లో పండిస్తారు. కివి పండుని 'చైనీస్ గూస్ బెర్రీ' అని కూడా అంటారు. ఇందుకు ప్రధాన కారణం కివీ పండులో ఆక్రోట్ ఫలం ఆకారంలో ఉండి గూస్ బెర్రీ రుచిని పోలి ఉంటాయి. కివీ పండు పన్నెండో శతాబ్దం నుండి సాగులో ఉంది. వీటి సాగు చైనా నుండి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు విస్తరించడంతో ప్రసిద్ధి గాంచినవి.[1]
కివీ చైనా, తైవాన్ ప్రధాన భూభాగానికి చెందింది, న్యూజిలాండ్, కాలిఫోర్నియాలో వాణిజ్యపరంగా పెరుగుతుంది. పండు కొద్దిగా ఆమ్ల రుచిని కలిగిఉండి, పచ్చిగా లేదా ఉడికించి తినవచ్చు. కివీలో సి, కె, విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి.[2]
కివి పండు న్యూజిలాండ్ దేశానికి చెందింది కాదు. చైనాలోని మిషన్ పాఠశాలలను సందర్శిస్తున్న వాంగనూయి బాలికల కళాశాల ప్రిన్సిపాల్ మేరీ ఇసాబెల్ ఫ్రేజర్ 1904 లో విత్తనాలను న్యూజిలాండ్ తీసుకరావడం, వాటిని 1906 సంవత్సరంలో వాంగనూయి నర్సరీమాన్ అలెగ్జాండర్ అల్లిసన్ వేసి పెంచాడు, పండ్లు 1910 సంవత్సరంలో మొదటిసారి రావడం, ప్రజలు ఈ పండును గూస్బెర్రీ రుచిని కలిగి ఉందని భావించి, దీనిని చైనీస్ గూస్బెర్రీ అని పిలవడం ప్రారంభించారు. ఇది గూస్బెర్రీస్కు చెందిన గ్రాస్యులారియాసి కుటుంబానికి సంబంధించింది కాదు.
న్యూజిలాండ్ 1950 సంవత్సరాలలో అమెరికా దేశానికి పండును ఎగుమతి చేయడం ప్రారంభించింది. 1959 జూన్ లో, జాక్ టర్నర్ ఆక్లాండ్‌లో జరిగిన టర్నర్స్ అండ్ గ్రోవర్స్ మేనేజ్మెంట్ సమావేశంలో కివిఫ్రూట్ అనే పేరును సూచించాడు. కివీఫ్రూట్ ఉత్పత్తిలో 2017 సంవత్సరంలో చైనా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది, తరువాత ఇటలీ, న్యూజిలాండ్, ఇరాన్ , చిలీ దేశాలు ఉన్నాయి.[3]
చైనీస్ గూస్బెర్రీస్ అని కూడా పిలుబడే కివీ కాయలు చూడటానికి ముదురు గోధుమ రంగు జూలుతో కోడి గ్రుడ్డు ఆకారంలో వుండి, లోపల అనేక గింజలతో నిండిన ఆకు పచ్చని లేదా పసుపు పచ్చని గుజ్జు కలిగివుంటుంది. ఈ మధ్య భారతీయ నగర మార్కెట్లలో యాపిల్ పండంత ఖరీదులో లభిస్తున్నాయి. కమలాలకు రెట్టింపు 'విటమిన్ సి', ఆపిల్‌లోకన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలూ దీని సొంతం. పీచు పదార్థం, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాల నిలయం 'కివీ' పండు. న్యూజిలాండ్‌లో మాత్రమే పండే కివీలు ఇప్పుడు మన మార్కెట్లోనూ విరివిగా దొరుకుతున్నాయి. కొవ్వులూ, సోడియం తక్కువగా ఉండటం వల్ల హృద్రోగులూ, మధుమేహ వ్యాధిగ్రస్తులూ కూడా దీన్ని తినొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. బరువు తగ్గించుకోవాలనుకునేవారికీ ఇది మంచి నేస్తమే. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలవల్ల బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. పోషకాలే కాదు, నోరూరించే రుచి కూడా కివీ సొంతం.
కివిపండులో అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి . ఇది అనేక ప్రాంతాలలో పండిస్తారు, అండాకారంలో ఉంటుంది . సుమారు 5.8 పొడవు 2.0 సెం.మీ. వెడల్పు, 5.5 సెం.మీ. ఎత్తు కలిగి మెత్తగా ఉంటుంది . మంచి సువాసన కలిగి ఉంటుంది . దీనిని వ్యాపార పండుగా అనేక దేశాలలో పండిస్తున్నారు . చైనాలో దీనిని 'గూస్ బెర్రీ ' పండుగా వాడుకలో ఉన్నది .
కివి పండుకు పేర్లు చాలా ఉన్నాయి. చాలామంది దీనిని వండర్ ఫ్రూట్ అని పిలవటం కూడా వింటూంటాం. ఇంతటి ఆశ్చర్య ఫలితాలనిచ్చే ఈపండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. పండ్లు అన్నిటిలోకి అధిక పోషకాలు కలిగిన ఈ కివి పండు పై రట్జర్స్ యూనివర్శిటీకి చెందిన డా. పౌల్ లారెన్స్ కొన్ని పరిశోధనలు చేశారు. సాధారణంగా మనం తినే 27 రకాల పండ్లలో కివి పండులోఅధిక పోషకాలుంటాయని స్టడీ తెలిపింది. కివి పండులో పోషకాలు దిగువ వివరించబడినవి. చూడండి.
కివి మొక్కలు సమశీతోష్ణ మండలాల్లో, అనగా వాతావరణంలో ఎండాకాలానికి చలికాలానికి మధ్య మోస్తరు తేడా మాత్రమే ఉన్న ప్రదేశాల్లో పెరుగుతాయి. అందుకే వీటిని ఇటలీ, న్యూజిలాండ్, చిలీ, ఫ్రాన్స్, గ్రీస్, జపాన్, ఇరాన్, అమెరికా, కంబోడియా వంటి దేశాల్లో సాగు చేస్తున్నారు. ఇటీవల భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సాగు చేస్తున్నారు.
కివీ సాగు ద్రాక్ష సాగు వలె వుంటుంది. కివీ మొక్కల్లో శ్రీ, పురుష మొక్కలు వేరువేరుగా వుంటాయి. తుమ్మెదలు పురుష పువ్వుల నుండి పుప్పొడిని సేకరించి స్త్రీ పువ్వుల మీదకు చేరవేయడం ద్వారా స్త్రీ మొక్కల నుండి కాయలు తయారవుతాయి. ఇలా ఒక పురుష మొక్క 3 నుండి 8 స్త్రీ మొక్కలు కాయలు తయారుచేయడానికి ఉపయోగపడుతుంది. ఒక హెక్టారుకు టన్నుల కొద్దీ కాయల దిగుబడి వస్తుంది. విత్తనాలు నాటిన 2 నుండి 3 సంవత్సరాలకే పంట దిగుబడి వస్తుంది. కివీ మొక్కలను గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా కూడా ఉత్పత్తి చేయవచ్చు.
కివీ పండ్లతో ప్రయోజనాలోన్నో. దీని తొక్కను తీసి పారేస్తుం టాం. కానీ అందులో చాలా విషయం ఉంది. తొక్కు వెనుక యాంటీ ఆక్సిడెంట్లు పూర్తి పీచు పదార్థంతో నిండిన గుజ్జు ఉంటుంది. మొక్కజొన్నను మినహా యిస్తే.. కంటి చూపును కాపాడే లుటియి న్ పదార్థ్ధం ఏ ఇతర పండు, కూరగాయాల్లో కూడా ఇందులో ఉన్నంత ఉండదు. రోజుకు రెండు నుంచి మూడు కివీలు తిన్నవారిలో శరీరం లోపల రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గినట్లు నార్వేలో గుర్తించారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.