కార్యాలయం, (ఆఫీసు) అనేది సాధారణంగా ఏదేని ప్రభుత్వ, ప్రవేటు సంస్థ తన కార్యకలాపాలు నిర్వహించే నిమిత్తం ఏర్పరచుకున్న స్థలం, భవనం, గది లేదా ఇతర ప్రాంతాన్ని కార్యాలయం అని అంటారు.వీటిలో ఒక గది నుండి పెద్ద పెద్ద భవనముల వరకు ఒకే సంస్థ కార్యాలయం క్రింద ఉపయోగిస్తుంటారు.ఒక కార్యాలయంలో ఒకరు లేదా ఎక్కువ మంది ఉద్యోగులు, అధికారులు (Officers), పనివారు (Workers) ఉంటారు. ఒక సంస్థకు చెందిన కార్యాలయాలు ఒక ఊరిలోని వివిధ ప్రదేశాలలో లేదా వేర్వేరు ఊరుల్లో ఉండవచ్చును. ఎక్కువగా కార్యాలయాలు గల సంస్థలకు అందులోని ఒకదాన్ని ప్రధాన కార్యాలయం (Head office) గా వ్యవహరిస్తారు.ఇక్కడ సంస్థకు సంబందించిన ఉద్యోగులు, అధికారులు,ఇతర వర్కర్స్ సంస్థ సమకూర్చిన వస్తువులు ఉపయోగించి, వారికి అప్పగించిన భాధ్యతలు ప్రకారం, లక్ష్యాల సాధించటానికి, ఉత్పత్తిని ఇవ్వడానికి, లేదా తీసుకోవటానికి పరిపాలనా పనులను నిర్వహిస్తారు. "ఆఫీసు" అనే పదం ఒక సంస్థలో నిర్దిష్ట విధులతో జతచేయబడిన స్థానాన్ని కూడా సూచిస్తుంది.చట్టంలో ఒక సంస్థ లేదా సంస్థ అధికారిక ఉనికిని కలిగి ఉన్న ఏ ప్రదేశంలోనైనా కార్యాలయాలను కలిగి ఉంటుంది.[1][2]

Thumb
గ్రామ పంచాయితీ కార్యాలయం,నున్న

చరిత్ర

Thumb
ఉప తపాలా కార్యాలయం,మైదకబరు.

కార్యాలయం నిర్మాణం,ఆకారం, నిర్వహణ ఆలోచనతోపాటు నిర్మాణ సామగ్రి రెండింటినీ ప్రభావితం చేస్తుంది. గోడలు లేదా అడ్డు గోడలు కలిగి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.శాస్త్రీయ పురాతన కాలం నాటి కార్యాలయాలు తరచుగా ప్యాలెస్ కాంప్లెక్స్ లేదా పెద్ద ఆలయంలో భాగంగా ఉండేవి. సాధారణంగా ఒక గది ఉండేది. అక్కడ కాగితం చుట్టలు (స్క్రోల్స్) ఉంచబడతాయి. ఉద్యోగులు, లేఖకులు వారు నిర్వర్తించవలసిన పనిని ఇక్కడ చేస్తారు. లేఖకుల పనిని ప్రస్తావించే పురాతన గ్రంథాలు అటువంటి "కార్యాలయాల" ఉనికిని సూచిస్తాయి.ఈ గదులను కొన్నిసార్లు కొంత మంది పురావస్తు శాస్త్రవేత్తలు, సాధారణ పత్రికలు "లైబ్రరీలు" అని నిర్వచించారు. ఎందుకంటే పేపరు స్క్రోల్‌లను సాహిత్యంతో తరచుగా అనుబంధిస్తారు. వాస్తవానికి అవి నిజమైన కార్యాలయాలు, ఎందుకంటే స్క్రోల్స్ రికార్డ్ కీపింగ్, ఒప్పందాలు, శాసనాలు వంటి ఇతర నిర్వహణ విధులు నిర్వర్తించబడతాయి.[1][2]

మాదిరి కార్యాలయాలు

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.