కాకినాడ ఓడరేవు
ఆంధ్రప్రదేశ్, కాకినాడలో ఉన్న ఓడరేవు / From Wikipedia, the free encyclopedia
కాకినాడ ఓడరేవు ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో, విశాఖపట్నం ఓడరేవుకు దక్షిణాన 170 కి,మీ. దూరంలో ఉంది.[1]
కాకినాడ ఓడరేవు | |
---|---|
Location | |
Country | భారతదేశం |
Location | ఆంధ్రప్రదేశ్ |
Coordinates | 16°58′30″N 82°16′44″E |
Details | |
Opened | 1999 ఏప్రిల్ 1 |
No. of berths | 4 + 2 (నిర్మాణంలో ఉంది) |
Statistics | |
Annual cargo tonnage | 145 లక్షల టన్నులు (2016-17) |
Website www.kakinadaseaports.in |
కాకినాడ పోర్ట్ అనేది కాకినాడ యాంకరేజ్ పోర్టు, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కాకినాడ ఫిషింగ్ హార్బర్, షిప్ బ్రేకింగ్ యూనిట్లు మొదలైనవాటితో కూడిన పెద్ద కాంప్లెక్స్. కాకినాడ యాంకరేజ్ పోర్టుకు శతాబ్దాల చరిత్ర ఉంది.[2]
కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ అన్ని కాలాల్లోనూ పనిచేసే డీప్ వాటర్ పోర్టు. దాని ఛానెల్ లోతు 12 మీటర్లుంటుంది. ఈ పోర్టులో 50,000 DWT వరకు ఉన్న నౌకలు రాగలవు. 2010-2011లో ఈ పోర్టు గుండా 10.81 మిలియన్ టన్నుల సరుకు రవాణా అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో కాకినాడ బీచ్‌ను అభివృద్ధి చేసింది. ఓడరేవు నుండి ఉప్పాడ ప్రాంతం వరకు 100 ఎకరాలలో ఈ బీచ్ విస్తరించి ఉంది.[1]
కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్‌ను [3] 2011 లో ప్రారంభించారు.
కాకినాడ జిల్లాలో కాకినాడ గేట్‌వే పోర్ట్ పేరుతో కొత్త ఓడరేవు నిర్మాణంలో ఉంది. 16 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయగల సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఇది మూడవ పోర్ట్ అవుతుంది.[4]