కపూర్ కుటుంబం
From Wikipedia, the free encyclopedia
కపూర్ కుటుంబం బాలీవుడ్ లో ప్రముఖ కుటుంబం. ఈ వంశానికి చెందిన చాలా మంది ప్రస్తుతం హిందీ సినీ రంగంలో ప్రఖ్యాత నటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు ఉన్నారు. పాకిస్థానీ పంజాబ్ లోని సంముంద్రి పట్టణానికి చెందినది ఈ కుటుంబం. పాకిస్థాన్ లోని ఖ్యాబెర్ పఖ్తున్ఖ్వా, పేష్వార్ ప్రాంతాల్లో ఈ కుటుంబానికి "కపూర్ హవేలీ" అనే వంశపారంపర్య భవనం ఉంది. ముంబైలో కపూర్ కుటుంబానికి పార్వతి థియేటర్, ఆర్.కె.స్టుడియోలు కూడా ఉన్నాయి.