జపనీయుల షింటో నృత్యరీతి From Wikipedia, the free encyclopedia
కగురా (神楽 (かぐら) , "దైవ వినోదం" ("గాడ్-ఎంటర్టైన్మెంట్") అనేది షింటో ఆచార వేడుకల్లోని ఒక నిర్దిష్టమైన నృత్యం. ఆచరణలో దేవుని ఉనికిని సూచించే ఈ పదబంధం "కమి నో కురా (దైవ పీఠం) " కి సంక్షేపం. కగురా యొక్క ఒక ప్రధాన విధి "చింకోన్ (ఆత్మను శుద్ధి చేసి, కదిలించడం) ". ఇది ఊరేగింపు-పూనకాల తో కూడిన ప్రక్రియ. సాధారణంగా ఒక మంత్రగత్తె (షమన్) నృత్యం చేస్తూ, దేవతలను వంటిమీదికి వచ్చిన అనుభూతిని (ఒరాకిల్) లోనై ---- అలా ఏర్పడ్డ రంగంలో (సెట్టింగ్‌లో) , పూనకంతో నర్తిస్తూ ఆ నర్తకి తానే స్వయంగా దైవంగా మారుతుంది. [1] ఒకప్పటి కమి'గాకరి (神懸 (かみがかり) , (దైవీ కరణ "ఓరాక్యులర్ డివినిఫికేషన్") ప్రక్రియ నుంచి ఉద్భవించిన ఈ ఉత్సవ కళ, కగురా ఒక సహస్రాబ్ది కి పైగా భిన్న దిశల్లో వికసించింది. నేటికీ ఇదొక సజీవ సంప్రదాయంగా, వ్యవసాయ క్యాలెండర్ లయలతో పెనవేసుకున్న ఆచారాలుగా, ప్రధానంగా షిమనే మండలం (ప్రిఫెక్చర్) లోని కొన్ని ప్రాంతాల్లోనూ, హిరోషిమా వంటి పట్టణ కేంద్రాల్లోనూ వర్ధిల్లుతోంది.
కాగురాలో మై, ఒడోరి అనేవి రెండు ప్రధాన రకాలు. మెయ్, వృత్తాకారం గా నిశ్శబ్దంగా, గాంభీర్యం తో అతి నెమ్మదైన కదలికలను ప్రదర్శిస్తుంది; ఇక ఒడోరి అతి వేగమైన కదలికలతో చురుకుగా గెంతటం, దూకడం లాంటి క్రియాశీల శక్తిని ప్రదర్శిస్తుంది. ఈ రెండూ కాగురా కు రెండు పదబంధాలుగా అర్థం చేసుకోవచ్చు --మెయ్ అనేది సమ్మోహక స్థితి (ట్రాన్స్) కి చేసే తొలి ప్రక్రియ అయితే ఓడోరి అనేది గాఢమైన అపస్మారక దశ.
మెయ్ నృత్యలో, మంత్రగత్తె (షమన్) , పూజారులు సమూహం తనను చుట్టుముట్టి, గోహీ లు (శుభ్రం లేదా శుద్ధి కోసం వాడే ఒక ఉత్సవ మంత్రదండం), ఇతర వాయిద్యాలను పట్టుకుని, దేవతలను పిలుస్తూ ప్రదక్షిణలు చేస్తుండగా, తను నెమ్మదిగా సమ్మోహన స్థితిలోకి ప్రవేశిస్తుంది, ఆమె కదలికలు ఒక్కసారిగా పూనకంగా మారిపోతాయి కదలికలకు, దీనిని ఓడోరి అంటారు. [2]
కోజికి, నిహోన్ షోకి లాంటి ఇతిహాసాలు ఈ నృత్యాల పుట్టుకకు సంబంధించిన ఒక జానపద కథను వివరిస్తాయి. ఈ గ్రంథాల్లో, సూర్య దేవత అమతెరసు కు సంబంధించిన ఒక ప్రసిద్ధ పురాణ కథ ఉంది. ఆమె ఒక గుహలోకి వెనుదిరిగి వెళ్లగా, ప్రపంచాన్ని చీకటి, చలి కమ్మెస్థాయి. అప్పుడు ఉషస్సు, ఉల్లాసాలకు దేవతైన అమే-నో-ఉజుమే, ఇతర దేవతలను ఆటవిక నృత్యంలోకి రప్పిస్తుంది, దాంతో ఆ గొడవ (రక్కస్) ఏమిటో చూడటానికి అమతెరసు బయటకు తిరిగి వచ్చేలా ఒత్తిడికి గురి చేస్తుంది. ఈ ఘటన నుంచి అనేక ఆచారాలు, కళలు ఉద్భవించాయి. వాటిలో కాగురా ఒకటి.
కముకురా లేదా కమికురా, కగుర అనేవి నిజానికి ప్రారంభంలో మందిరపు కన్యలు (మంత్రగత్తెలు,మికో( Miko)) రాజధర్బార్ లో చేసే పవిత్ర నృత్యాలు. ఆ కన్యలను ఆమె-నో-ఉజుమె వారసులుగా భావించేవారు. ప్రదర్శన సమయంలో, మందిరపు కన్యలు సాధారణంగా దైవ సమ్మోహితం (ట్రాన్స్) కోసం ముసుగులు, ఈటెలు లాంటి ఉపకరణాలు ఉపయోగిస్తారు. దేవతలను ఆవాహన చేయగల శక్తి ఉన్న కగురా సంగీతం వినిపిస్తుండగా, ఆ కన్య (మైకో) దేవతలకు ఆవాహనా మధ్యమంగా, దేవతల నుండి సందేశాలను ఆశీర్వాదాలను స్వీకరించడానికి నృత్యం చేయడం ప్రారంభిస్తుంది. [2] 1871లో, జపాన్‌కు పశ్చిమాన పూజారులు ప్రదర్శించిన కగుర కళా ప్రదర్శనలు తమ గౌరవాన్ని కించపరిచాయని, ఇవామి షింటో కార్యాలయాలు ప్రదర్శనను నిషేధించాయని పేర్కొన్నారు. పౌర ప్రదర్శన బృందాల మద్దతుతో, ఆ సమయంలోని ప్రదర్శన శకలాలూ ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. [3]
అయితే, కాలక్రమేణా, ఇంపీరియల్ కోర్టుల పవిత్ర, ప్రత్యేక ప్రాంగణాల్లో ఈ మికగుర ప్రదర్శనలు కొనసాగాయి. ఇది ఎన్నో ప్రసిద్ధ ఆచార నృత్యాలకు ప్రేరణనిచ్చింది. సతోకగుర (satokagura) పేరుతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధ రూపాలుగా, గ్రామాలలోనూ, ఇతర జానపద సంప్రదాయాలకు అనుగుణంగానూ అనేక విభిన్న రూపాల్లోకి అభివృద్ధి చెందింది. వీటిలో మైకో కగురా, షిషి కగురా, ఇసే- స్టైల్, ఇజుమో- స్టైల్ కగురా నృత్యాలు ఉన్నాయి. శతాబ్దాలుగా మరెన్నో వైవిధ్య రూపాలుగా అభివృద్ధి చెందాయి. వాటిలో కొన్ని చాలా నూతనమైనవిగాను, వాటిలో అనేకం అత్యంత లౌకిక జానపద సంప్రదాయాలుగానూ మారాయి.
ఈ కగురా, ప్రత్యేకించి కథ చెప్పడం లేదా కల్పిత కథల పునర్నిర్మాణం వంటి రూపాల ద్వారా నోహ్ కళా రంగం (థియేటర్) పైన ప్రాథమికమైన ప్రభావం చూపింది.
మికగుర (御神楽) రాజధర్బారుల్లోనూ, ప్రముఖ షింటో పుణ్యక్షేత్రాలైన కమో-జింజా, ఇవాషిమిజు హచిమాన్-గో లలో ప్రదర్శించే ఒక ఆచార నృత్యం. [4] ఇది హాస్య భరితంగానో, కవితాత్మకమగానో దేవతలను స్వాగతించడం, అలరించడం, పలకరించడం కోసం పాడే పాటలతో కూడుకొని ఉంటుంది. నేడు కొన్ని సార్లు ఇది గగాకు ఉప కళా రూపంగా భావించడం జరుగుతోంది. దీనిపైన ఆ ప్రభావమూ ఉంది. [5] దీనిపై పూర్వపు చైనీస్ స్ఫూర్తి ఉన్నా, ప్రాంతీయ మూలకాలతో బాటు, కంగెన్ (管弦) , బుగాకు (舞楽) , సైబారా (催馬楽) , లాంటి గగాకు రూపాల ప్రభావం ఉంది. [6][7] క్లుప్తంగా చెప్పాలంటే మికాగుర, గగాకు సంగీతం తో సాగే నృత్యం. [8]
కగురా-డెన్ ఔ నిక్కో టోషో-గు. కగురా ఉటా అనేది 26 పాటల (నివాబి, అచిమే, సకాకి, కరాకామి, హయకరకామి, కొమోమాకురా, సజానామి, సెంజాయ్, హయౌతా, హోషి, అసకురా, సోనోకోమా మొదలైనవి) తో కూడిన పవిత్రమైన స్వర కచేరీ. ఒక గాయకుడు కొన్ని రోజులపాటు సాంప్రదాయకంగా సాగించే ఈ కచేరీ నేడు ఆరు గంటలు సాగే 12 కీర్తనల కచేరిగా కుదించడం జరిగింది. [6] వీటలో ఒక జాపనీస్ వేణువు (Japanese transverse flute (笛 )) , లేదా ఒక సంప్రదాయ సన్నాయి (hichiriki) , వీలైతే ఒక యమాటోగొటో (yamatogoto) , శకుబ్యోషి క్లావ్స్ (shakubyoshi claves) [4] వాడతారు.
మికగురా నృత్యాలు అనేకం ఉన్నాయి, వాటిలో కొన్ని: [6]
అధికారిక సార్వభౌమ (ఇంపీరియల్) ఆచార నృత్యాల (మికగురా) ప్రదర్శనలు, పవిత్ర స్థలాలలోనూ, అనేక ప్రత్యేక సందర్భాలలోనూ జరిగేవి. సార్వభౌమ అభయారణ్యంలో, పవిత్ర అద్దం ఉన్న చోట గగాకు ధర్బారు సంగీతంలోని భాగంగా ప్రదర్శించేవారు. ఇంపీరియల్ హార్వెస్ట్ ఫెస్టివల్ అప్పుడు, ఇసే, కామో, ఇవాషిమిజు హచిమాన్-గో వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలల్లో కూడా ఈ మికాగురా ప్రదర్శనలు జరుగుతాయి. గత 1000 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఇంపీరియల్ హౌస్‌హోల్డ్ ఏజెన్సీ కి చెందిన ఆచార విభాగం ప్రకారం, ఇప్పటికీ ప్రతి డిసెంబరు మాసంలో ఇంపీరియల్ అభయారణ్యంలోనూ, ఇంపీరియల్ పంటల పండుగల వేడుకల్లోనూ మికాగురా ప్రదర్శనలు కొన సాగుతున్నాయి.
సతోకగుర, లేదా "సాధారణ కగురా" అనేది విస్తృతార్థక పదం, ఇది ఇంపీరియల్ ఆచార నృత్యాల (మికాగురా) నుండి రూపు దిద్దుకుని, ఇతర జానపద సాంప్రదాయ రీతులను సమ్మిళితం చేసుకున్న ఒక వైవిద్య భరితమైన ఆచార నృత్యం. ఇది నోహ్, క్యోజెన్ ల మూలం వద్ద ఉంటుంది. [9] ఎంపిక చేసిన కొన్ని సాంప్రదాయాలు సంక్షిప్తంగా : [4]
టోకుగావా షోగునేట్ (1603–1868) పాలన ప్రారంభ కాలంలో, రూపుదిద్దుకున్న నృత్య రీతులు ఎడోలో వినోద ప్రధాన ప్రదర్శనలుగా మారాయి. షోగునేట్ పాలన ప్రారంభానికి సంబంధించిన వేడుకలలో సింహ నృత్యాలు, విన్యాసాలు, గారడీలు లాంటి అనేక వినోదాలను నగరం అంతటా వేదికలపై ప్రదర్శించారు. అన్నీ నామమాత్రంగా "దైకగురా"ల ఆధ్వర్యంలో జరిగాయి. కాలక్రమేణా, కధలు చెప్పే రకుగో కళనూ (రకుగో స్టోరీ టెల్లింగ్) , ఇతర ప్రసిద్ధ వినోద రీతులను మిళితం చేసుకుని, నేటికీ దైకగురాను వీధి వినోద అంశాలను కూడా కలుపుకుని
ప్రదర్శిస్తూనే ఉన్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.