![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/72/HP_Laserjet_5_DN_1.jpg/640px-HP_Laserjet_5_DN_1.jpg&w=640&q=50)
కంప్యూటర్ ప్రింటర్
From Wikipedia, the free encyclopedia
ప్రింటుకు కావలసిన విషయాలను పేపరు మీద ముద్రించుకొనుటకు ప్రింటర్లను ఉపయోగిస్తాము. ఈ ప్రింట్అవుట్ లను శాశ్వత డాక్యుమెంట్లుగా దాచుకోవచ్చు. కంప్యూటర్ ప్రింటర్ సి.పి.యు నుండి వివరాలను తీసుకొని మనకు అర్ధమయ్యే భాషలో ప్రింటు చేస్తుంది. ప్రింటర్ ద్వారా పొందిన కాపీని హార్డ్ కాపీ అని కూడా అంటారు. ప్రింటర్ ద్వారా మనం పొందే రంగును బట్టి ప్రింటర్లు రెండు రకాలు.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/72/HP_Laserjet_5_DN_1.jpg/320px-HP_Laserjet_5_DN_1.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4e/ZEUS_3D_Printer.png/640px-ZEUS_3D_Printer.png)
త్వరిత వాస్తవాలు
మూసివేయి
బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్స్ : ఇవి తెల్లని లేదా ఇచ్చిన రంగు పేపరు మీద నల్లని అక్షరాలు ప్రింటు చేస్తాయి.
కలర్ ప్రింటర్స్ : ఇవి రంగు రంగులలో మనం ఎన్నుకున్న రంగును బట్టి ముద్రిస్తాయి.
కంప్యూటర్ ప్రింటర్ పదమును నిర్వచిస్తే " కంప్యూటర్కి సంబంధించిన డాక్యుమెంట్లు లేదా కంప్యూటర్ లో ఉన్న ఇతర సమాచారంను కాగితం కాపీలను ముద్రణ చేసుకోవడానికి కంప్యూటర్కు అనుసంధానించే (కనెక్ట్ ) చేయగల ఒక యంత్రం.[1]