From Wikipedia, the free encyclopedia
LXDE అనేది యునిక్స్, ఇతర POSIX కంప్లెయింట్ వేదికల కొరకు అనగా లినక్స్ లేదా BSD వంటి వాటికోసం రూపొందించబడిన ఒక ఉచిత, ఓపెన్ సోర్సు తేలికైన డెస్కుటాప్ పర్యావరణం. LXDE అంటే "లైట్ వెయిట్ X11 డెస్కుటాప్ ఎన్విరాన్మెంట్". తక్కువ ప్రదర్శన కనపర్చు పాత తరం కంప్యూటర్లకు, కొత్త తరం నెట్ బుక్లు,, ముఖ్యంగా ఇతర చిన్న కంప్యూటర్లు, RAM తక్కువ మొత్తంలో ఉన్న కంప్యూటర్లతో బాగా పని చేయడానికి LXDE రూపొందించబడింది. ఉబుంటు పై పరీక్షించినపుడు నోమ్ 2.29, కెడియి 4.4,, ఎక్స్ఎఫ్సియి 4.6 పోలిస్తే LXDE 0.5 అతి తక్కువ మెమోరీ వినియోగాన్ని,, తక్కువ శక్తి ఖర్చువుతుందని నిరూపించబడింది. మొబైల్ కంప్యూటర్లులో ఇతర డెస్కుటాప్ పర్యావరణాలలో కంటే LXDE తో బ్యాటరీ శక్తి తక్కువ ఖర్చవుతుంది.
ఎల్ఎక్స్డిఇ(LXDE) | |
---|---|
అప్రమేయ LXDE డెస్కుటాప్ | |
అభివృద్ధిచేసినవారు | LXDE జట్టు |
మొదటి విడుదల | 2006 |
ప్రోగ్రామింగ్ భాష | C (GTK+) |
నిర్వహణ వ్యవస్థ | యునక్స్ వంటిది |
భాషల లభ్యత | బహుళ భాషలలో |
ఆభివృద్ది దశ | క్రియాశీలము |
రకము | డెస్కుటాప్ పరిసరం |
లైసెన్సు | గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్, GNU LGPL |
LXDE వివిధ ప్రముఖ లినక్స్ పంపకాలైన ఆర్క్ లినక్, డెబియన్, మాండ్రివా, ఉబుంటులో వినియోగించబడుతున్నది, ఇటీవలే ఫెడోరా, ఓపెన్ స్యూజ్ వంటి పంపకాలలో కూడా వాడబడుతున్నది. ఇది నాపిక్స్, లుబుంటుల యొక్క అప్రమేయ డెస్కుటాప్ పర్యావరణముగా ఉంది.
LXDE ప్రోజెక్టు తైవానీస్ ప్రోగ్రామర్ అయిన హాంగ్ జెన్ యీ చే 2006లో ప్రారంభించబడింది, ఇతడిని పిసిమాన్ అని కూడా పిలుస్తారు. LXDE యొక్క మొదటి పర్వికము పిసిమాన్ఎఫ్ఎమ్ అనే ఒక కొత్త దస్త్ర నిర్వాహకం.
LXDE సి ప్రోగ్రామింగ్ భాషలో వ్రాయబడింది. ఇది జిటికే ప్లస్ ఉపకరణసామాగ్రిని వాడుకుని యునిక్స్, POSIX కంప్లెయింట్ వేదికల పై అనగా లినక్స్, BSD వంటి నిర్వహణ వ్యవస్థల యందు నడుస్తుంది. GTK+ అనేది సాధారణంగా అనేక లినక్స్ పంపకాలలో వాడబడి అనువర్తనాలను వివిధ వేదికల పై నడుపుటకు సహాయపడుతుంది. LXDE వ్యక్తిగత భాగాలు(లేదా కొన్ని భాగాలు ఆధారితత్వాల ద్వారా) రోలింగ్ విడుదలలని ఉపయోగించుకుంటాయి. జిపియల్ లైసెన్స్ కోడ్ అలాగే ఎల్ జిపియల్ లైసెన్స్ కోడ్ని కూడా LXDE కలిగివుంటుంది.
పంపణీఆదరణ కొరకు లినక్స్ పంపకాల స్థానాలను సమీక్షించగా, 2011 జనవరి ప్రారంభంలో చేసిన సర్వే ప్రకారం 2010, 2009 లతో పోల్చి చూస్తే ఇతర డెస్కుటాప్ పర్యావరణాల కంటే LXDE యొక్క ప్రజాదరణ గణనీయంగా పెరిగిందని బోడనర్ లాడిస్లావ్ పేర్కొన్నారు. పట్టిక గణాంకాల ఆధారంగా చూస్తే తేలికపాటి డెస్కుటాప్ పర్యావరణాలను వాడే పంపకాలు పెరుగుదల కనిపించిందన్నారు.
కాకపోతే నోమ్, కెడియి ప్లాస్మా డెస్కుటాప్ వంటి ఇతర ప్రధాన డెస్కుటాప్ పర్యావరణాలలో వలె కాకుండా, LXDE యొక్క భాగాల కొన్ని ఆధారితత్వాలు సరిగా స్థిరత్వం పొందిలేవు. కాని బదులుగా, అవి స్వతంత్రంగా నడువగలవు.
LXDE వివిధ భాగాలను కలిగివుంది:
PCMan File Manager | ఫైల్ నిర్వాహకం |
LXInput | మౌస్, కీబోర్డు స్వరూపణ సాధనం |
LXLauncher | సులభ రీతి అనువర్తన ప్రారంభకం |
LXPanel | డెస్కుటాప్ ప్యానల్ |
LXSession | X సెషన్ నిర్వాహకం |
LXAppearance | జిటికె+ థీము మార్పకం |
Leafpad | పాఠ్య కూర్పకము |
Xarchiver | దస్త్ర సంగ్రహకం |
GPicView | బొమ్మ వీక్షకం |
LXMusic | ఒక XMMS2 క్లయింటు, ఆడియో ఆటకం |
LXTerminal | టెర్మినల్ ఎమ్యులేటర్ |
LXTask | కార్య నిర్వాహకం |
LXRandR | A GUI front-end to RandR |
LXDM | X ప్రదర్శక నిర్వాహకం |
LXNM | తేలికపాటి నెట్వర్క్ అనుసంధాన సహాయకం డెమోన్. వైరులేని అనుసంధానాలకు సహకరిస్తుంది (లినక్స్ మాత్రమే). |
Openbox | విండో నిర్వాహకం |
obconf | ఓపెన్బాక్స్ స్వరూపించుటకు ఒక గ్రాఫికల్ వాడుకరి అంతరవర్తి సాధనం |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.