From Wikipedia, the free encyclopedia
Jones, Sam. "Eritrea human rights abuses may be crimes against humanity, says UN". The Guardian. Retrieved 8 June 2015. The report 'catalogues a litany of human rights violations by the "totalitarian" regime of President Isaias Afwerki "on a scope and scale seldom witnessed elsewhere"' said
ఎరిట్రియా లేదా ఎరిత్రియా (ఆంగ్లం : Eritrea), (అరబ్బీ : إرتريا ఇరిత్రియా), [1] అధికారిక నామం ఎరిట్రియా రాజ్యం [2] ఈశాన్య ఆఫ్రికా (హార్ను ఆఫ్ ఆఫ్రికా) లోని ఒక దేశం. దేశ పశ్చిమసరిహద్దులో సూడాన్, దక్షిణసరిహద్దులో ఇథియోపియా, ఆగ్నేయసరిహద్దులో జిబౌటి దేశాలు ఉన్నాయి. దీని తూర్పున, ఈశాన్యసరిహద్దులో ఎర్ర సముద్రపు పొడుగైన తీరం ఉంది. దేశవైశాల్యం 1,18,000 చ.కి.మీ. జనసంఖ్య 50 లక్షలు గలదు. దీని రాజధాని అస్మారా. దేశంలో దాహ్లాకు ద్వీపసమూహం, అనేక హనిషు దీవులు భాగంగా ఉన్నాయి. గ్రీకుపేరు ఎరిట్రియా ఎర్ర సముద్రం (Ἐρυθρὰ Θάλασσα ఎరిథ్రా తలాస్సా) ఆధారంగా దేశానికి నిర్ణయించబడిందని భావిస్తున్నారు. 1890 లో మొదటిసారిగా ఇటలీ ఎరిత్రియా నుండి ఇటలీని స్వీకరించి ఇటలీ దేశానికి నిర్ణయించబడింది.
ఎరిట్రియా ఒక బహుళ జాతి దేశంగా ఉంది. దేశజనాభాలో గుర్తింపు పొందిన 9 జాతి సమూహాలకు చెందిన సుమారు 5 మిలియన్ల ప్రజలు ఉన్నారు. చాలామంది నివాసితులకు ఇథియోపియా సెమిటికు భాషలు, కుషిటికు శాఖలు, ఆఫ్రోయాసియాటికు భాషా కుటుంబానికి చెందిన భాషలు వాడుకభాషలుగా ఉన్నాయి. ఈ సమూహాలలో 55% మందికి టిగ్రిన్యాసు వాడుకభాషగా ఉంది. సుమారు 30% మంది నివాసులకు టిగ్రే భాష వాడుకభాషగా ఉంది. అదనంగా అనేక నిలో-సహారను వాడుకభాషా వాడుకరులు ఉన్నారు. ఈ భూభాగంలో చాలామంది క్రైస్తవ మతం లేదా ఇస్లాం మతానికి కట్టుబడి ఉంటారు.[3]
సా.శ.. మొదటి - రెండవ శతాబ్దంలో ఉత్తర ఇథియోపియా అంతటా విస్తరించిన స్థాపించబడిన ఆక్సం రాజ్యమే ఆధునిక ఎరిట్రియా ప్రాంతంగా ఉంది.[4][5] ఇది నాలుగవ శతాబ్దం మధ్యలో క్రైస్తవ మతాన్ని స్వీకరించింది.[6] మధ్యయుగ కాలంలో ఎరిట్రియా మెదీరి బహ్రీ సామ్రాజ్యం పాలనలోకి పడిపోయింది. చిన్న ప్రాంతం హమాసియానులో భాగంగా ఉంది.
పలు స్వతంత్ర విభిన్న రాజ్యాలు, సుల్తానేట్సు (ఉదాహరణకి మెదీరీ బహ్రీ, ఆస్మా సుల్తానేటు) లతో విలీనమైన ఫలితంగా ఇటలీ ఎరిట్రియా ఏర్పడింది. 1942 లో ఇటలీ వలస సైన్యం ఓటమి చెందిన తరువాత, 1952 వరకు ఎరిత్రియా పాలన బ్రిటీషు సైనిక పాలనా యంత్రాంగం నిర్వహించింది. ఐక్యరాజ్యసమితి జనరలు అసెంబ్లీ నిర్ణయాన్ని అనుసరించి 1952 లో ఎరిత్రియా స్వయంగా స్థానిక పార్లమెంటుగా పాలనాబాధ్యతలు స్వీకరించింది. విదేశీ వ్యవహారాలు, రక్షణ ఇథియోపియా ఫెడరలు హోదాలో 10 సంవత్సరాలు ఉంది. 1962 లో ఇథియోపియా ప్రభుత్వం ఎరిత్రియా పార్లమెంటును రద్దు చేసి అధికారికంగా ఎరిత్రియాను విలీనం చేసుకుంది. 1941 లో ఇటాలియన్లు తొలగించిన తరువాత ఎరిత్రియన్లు జరగబోయేది ఊహించి ఎరిత్రియా స్వాతంత్ర్యం కొరకు పోరాడారు. 1960 లో ఎరిత్రియా లిబరేషన్ ఫ్రంట్ ఇన్ అపోజిషను ఏర్పాటుచేయబడింది. 1991 లో స్వాతంత్ర్యం కొరకు 30 సంవత్సరాల నిరంతర సాయుధ పోరాటం తరువాత ఎరిత్రియా విముక్తి యోధులు రాజధాని నగరమైన అస్మారాలో విజయం సాధించారు.
ఏకపార్టీ ప్రభుత్వం అయిన ఎరిత్రియా స్వతంత్రం నుండి ఎన్నడూ జాతీయ శాసనసభ ఎన్నికలు నిర్వహించ లేదు.[7] హ్యూమను రైట్సు వాచి ఆధారంగా ఎరిత్రియా ప్రభుత్వం మానవ హక్కుల చరిత్ర ప్రపంచంలోనే అత్యంత దిగువస్థాయిలో ఉందని ఆరోపించబడింది.[8] ఎరిత్రియా ప్రభుత్వం ఈ ఆరోపణలను రాజకీయం లక్ష్యంగా ఆరోపించబడ్డాయని త్రోసిపుచ్చింది.[9] నిరవధికంగా నిర్బంధ శిబిరాల అవసరార్ధం దీర్ఘకాలం నిర్బంధ సైనిక సేవ కోరబడుతుంది. దీని నుండి తప్పించుకోవడానికి కొంతమంది ఎరిత్రియన్లు దేశాన్ని విడిచి వెళ్లిపోతారు.[10] స్థానిక మాధ్యమాలు అన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నందున ఎరిత్రియా ప్రపంచ ప్రెసు ఫ్రీడం ఇండెక్సులో చివరి ద్వితీయ స్థానంలో ఉంది., చివరి స్థానంలో ఉత్తర కొరియా ఉంది.
ఎరిత్రియా సార్వభౌమ దేశం ఆఫ్రికా సమాఖ్య, ఐక్యరాజ్యసమితి, ఇంటరు ఇంటరుగవర్నుమెంటలు అథారిటీలో సభ్యదేశంగా ఉంది. బ్రెజిల్, వెనిజులా, భారతదేశం, టర్కీలతో కలిసి అరబు లీగులో ఒక పరిశీలకసభ్యదేశంగా ఉంది.[11]
ఎరిత్రియా అనే పేరు ఎర్ర సముద్రం (Ἐρυθρὰ Θάλασσα ఎరిథ్రా తలాస్సా, విశేషణం ἐρυθρός erythros "ఎరుపు") ఆధారంగా ఉన్న పురాతన గ్రీక్ నామం నుండి ఉద్భవించింది. 1890 లో ఇటాలియన్ ఎరిత్రియా (కొలోనియా ఎరిట్రియా) ఏర్పడటంతో ఈ పేరును అధికారికంగా స్వీకరించారు.[12] బ్రిటీషు, ఇథియోపియా ఆక్రమణ తరువాత కొనసాగింది. 1993 స్వాతంత్ర్య ప్రజాభిప్రాయ సేకరణ 1997 రాజ్యాంగం ద్వారా ఇది పునరుద్ఘాటించబడింది.[13]
ఎరిత్రియాలోని బుయా హోమో ఎరెక్టసు, పురాతన హోమో సేపియన్లకు సంబంధం పురాతన మానవులైన హోమోనిదుల నివాసప్రాంతంగా ఉండేదని ఇటాలియను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సుమారు 1 మిలియను సంవత్సరాలకు పూర్వం నాటి పురాతన కాలానికి చెందిన అస్థిపంజరం లభించిన ప్రదేశంగా గుర్తించబడింది. పురాతనమైన ఈ అస్థిపంజరం హోమోనిదులు, ఆధునిక శరీరనిర్మాణం కలిగిన పురాతన మానవులకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తుందని విశ్వసించారు.[14] ఎరిత్రియాలోని డానాకిలు డిప్రెషను విభాగం మానవ పరిణామ క్రమంలో కూడా ప్రధాన పాత్ర పోషించిందని విశ్వసిస్తున్నారు. " హోమో ఎరెక్టసు " హోమినిదుల నుంచి ఆధునిక మానవుల శరీరనిర్మాణం కలిగిన మానవుల పరిణామం జరిగిందని భావిస్తున్నారు.[15]
చివరి మంచుయుగం కాలం ఎరిత్రియా ఎర్ర సముద్ర తీరం ఆరంభకాల ఆధునిక మానవులచే ఆక్రమించబడింది.[16] ఆరంభకాల మానవులు ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి పూర్వం ఈ ప్రాంతంలో నివసించారని కొంతమంది విద్వాంసులు విశ్వసిస్తున్నారు. ఆరంభకాల మానవులకు ఆఫ్రికా మూలమని అనేక మంది విశ్వసిస్తున్నారు.[16] 1999 లో ఎరిట్రియా, కెనడా, అమెరికా, డచ్చి, ఫ్రెంచి శాస్త్రవేత్తలచే ఏర్పడిన ఎరిట్రియా రీసెర్చి ప్రాజెక్టు బృందం ఎర్ర సముద్రతీరం వెంట మస్సావాకు దక్షిణప్రాంతంలో ఉన్న బే ఆఫ్ జులా సమీపంలో 1,25,000 సంవత్సరాల పూర్వం నాటి రాతి, లావా ఉపకరణాలు ఉపయోయోగించిన ఒక పాలియోలిథికు ప్రాంతాన్ని కనుగొన్నారు. ఎర్రసముద్రపు వనరుల నుండి నత్తలు, శఖులు, గుల్లచేపలను పట్టడానికి ఈ ఉపకరణాలను ఉపయోగించారని భావిస్తున్నారు.[17]
భాషావేత్తల అభిప్రాయం ఆధారంగా నియోలిథికు యుగంలో నైలు లోయలో ఉర్హెమిటు ("అసలైన మాతృభూమి") నుండి ఆఫ్రోయాసిటికు భాషావాడుకరులు ఈ ప్రాంతానికి చేరుకున్నారని భావిస్తున్నారు.[18][19] ఇతర పరిశోధకులు ఆఫ్రోయాసియాటికు కుటుంబం హోర్నులో స్థాపించబడిందని ప్రతిపాదించారు, దాని మాట్లాడేవారు తరువాత అక్కడ నుండి విడిపోయారు.[20]
జిబౌటీ, ఇథియోపియా, ఉత్తర సోమాలియా, సుడాను ఎర్ర సముద్ర తీరంతో కలిసి, [21] ప్రస్తుత ఎరిత్రియాను క్రీ.పూ 25 వ శతాబ్దంలో పురాతన ఈజిప్షియన్లు ప్రస్తావించిన పుంటు అని పిలవబడిందని భావిస్తున్నారు.[22] ఫారో సహోరు, హాత్షెప్సుటు రాణి పాలనలో పురాతన పుంటీలు పురాతన ఈజిప్టులతో దగ్గరి సంబంధాలను కలిగి ఉన్నారు.
దీనిని మమ్మిఫియదు బాబున్ల జన్యు అధ్యయనాలు నిర్ధారించాయి. 2010 లో పురాతన ఈజిప్షియన్లు బహుమతిగా ఈజిప్టుకు పుంటు నుండి తీసుకువచ్చిన బబూను మమ్మీలపై ఒక అధ్యయనం జరిగింది. ఈజిప్షియను మ్యూజియం, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి వచ్చిన శాస్త్రవేత్తలు బ్రిటీషు మ్యూజియంలో భద్రపరచబడిన రెండు బబూను మమ్మీల నుండి వెంట్రుకల పరిశీలన కోసం ఆక్సిజను ఐసోటోపు విశ్లేషణను ఉపయోగించారు. బబున్లలో ఒకటి ఐసోటోపికు డేటాను వక్రీకరించింది, అందువలన ఇతర ఆక్సిజను ఐసోటోపు విలువలు ప్రస్తుతం ప్రాంతాల బాబూన్ల నమూనాలతో పోల్చబడ్డాయి. ఎరిత్రియా, ఇథియోపియాలో మమ్మీలతో అత్యంత సన్నిహితంగా సరిపోలిన మమ్మీలు కనుగొన్నట్లు పరిశోధకులు ప్రారంభంలో కనుగొన్నారు. ఇది పుంటు తూర్పు ఇథియోపియా, అన్ని ఎరిత్రియాలతో కూడిన ఒక ఇరుకైన ప్రాంతం అని సూచించబడింది.[23] 2015 లో పుంటు నుండి వచ్చిన ఇతర ప్రాచీన బబూను మమ్మీల ఐసోటోపికు విశ్లేషణ ఎరిత్రియా-ఇథియోపియా కారిడారు, తూర్పు సోమాలియాతో కూడిన ప్రాంతం నుండి నమూనాలు వచ్చాయని ధ్రువీకరించాయి.[24]
అస్మారాలోని సెంబెలు జరిపిన పురాతత్వ త్రవ్వకాలలో ప్రాచీన పూర్వ-అక్షుమైటు నాగరికత చిహ్నాలు కనుగొనబడ్డాయొ. ఈ ఓనా పట్టణ సంస్కృతి హోర్ను ప్రాంతంలోని మొట్టమొదటి మతసంబంధ, వ్యవసాయ వర్గాలలో ఒకటిగా భావించబడుతోంది. ఈ ప్రదేశంలోని కళాకృతులు క్రీ.పూ 800, క్రీ.పూ 400 మధ్యకాలం నాటివని భావిస్తున్నారు. మొదటి సహస్రాభికాలం నాటి ఎరిత్రియను ఇథియోపియా పర్వత ప్రాంతాలలోని ఇతర అక్సూమిటు నివాసాలకు ఇవి సమకాలీనమైనవని భావిస్తున్నారు.[25]
అదనంగా ఒంటా సంస్కృతి పురాతన భూమి పుంటుతో సంబంధం కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. తేబెసు (లక్సోరు) లో ఒక సమాధిలో 18 వ రాజవంశ పాలనా కాలం నాటి ఫోరాఒహు రెండవ అమానొఫిసు (రెండవ అమెన్హోటెపు), పొడవైన గొంతు కలిగిన కుండలు (ఓనా ప్రజలచే చేయబడిన కుండ వంటివి) పంటు నుండి వచ్చిన ఓడలో సరుకులో భాగంగా చిత్రీకరించబడ్డాయి.[26]
సెంట్రలు ఎరిత్రియాలోని అగార్డాటు వద్ద, సమీపంలోని జర్పిన త్రవ్వకాలలో గషు సమూహం అని పిలువబడే ప్రాచీన పూర్వ-అక్షుమైటు నాగరికత అవశేషాలు లభించాయి.[27] సి-గ్రూపు (తేహెయు) మతసంబంధ సంస్కృతికి చెందినవిగా గుర్తించిన సెరామిక్సు క్రీ.పూ 2500-క్రీ.పూ. 1500 మధ్యకాలంలో నైలు లోయలో నివసించిన ప్రజలవని విశ్వసిస్తున్నారు.[28] కొన్ని ఆధారాలు క్రీ.పూ. 3500 కి చెందినవని తెలియజేసాయి.[29] అదే కాలంలోని నైలు లోయలో వృద్ధి చెందిన కెర్మా సంస్కృతికి అనుగుణంగా ఉండే షార్డ్సు, గషు గ్రూపుకు చెందిన బర్కా లోయలోని ఇతర స్థానిక పురావస్తు ప్రదేశాలలో కూడా కనుగొనబడ్డాయి.[27] పీటరు బెహ్రెన్సు (1981) మరియనే బీచసు-గెర్స్టు (2000) అభిప్రాయంలో సి-గ్రూపు, కెర్మా ప్రజలు వరుసగా బెర్బెరు, కుషిటికు శాఖల ఆఫ్రోయాసియాటికు భాషలను మాట్లాడారు.[30][31]
ఎమిత్రియా ఉత్తర ఇథియోపియా ఉత్తర సరిహద్దులను విస్తరించిన ఒక రాజ్యం డిట్టెటు. క్రీ.పూ 10 నుండి 5 వ శతాబ్దాల్లో క్రీ.పూ. యెహలో ఒక పెద్ద ఆలయ సముదాయం ఉండటంతో ఈ ప్రాంతం దీనికి రాజధానిగా ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. క్యూహైతొ తరచుగా కోలే పట్టణంగా భావించబడుతుంది.[32] అలాగే దక్షిణ ఎరిత్రియాలోని మాతారా దక్షిణ ఎరిట్రియాలో పురాతన డిమాటు రాజ్యంళొణీ నగరాలలో ఒకటిగా ఉంది.
ఈ పాలన నీటిపారుదల పథకాలు అభివృద్ధి చేశాయి. వీరు నాగలిని ఉపయోగించారు, చిరుధాన్యాలు పండించారు, ఇనుప పనిముట్లు, ఆయుధాలను తయారుచేశాయి. క్రీ.పూ. 5 వ శతాబ్దంలో డిమాటు పతనం తరువాత పీఠభూమి చిన్న వారసత్వ రాజ్యాలు ఆధిపత్యం చేసాయి. ఇది మొదటి శతాబ్దం కాలంలో అక్సాం రాజ్యం ఆవిర్భావం వరకు కొనసాగింది, ఇది ఆ ప్రాంతాన్ని తిరిగి సమైక్యం చేసింది. [33]
అక్సం రాజ్యం ఎరిత్రియా, ఉత్తర ఇథియోపియాలో కేంద్రీకృతమైన వర్తక సామ్రాజ్యం.[34] సుమారుగా సా.శ.. 100-940 వరకు ఉనికిలో ఉంది. క్రీ.పూ 4 వ శతాబ్దంలో ప్రోటో-అక్యులైటు ఇనుము యుగం కాలంతో ప్రారంభించి సా.శ.. మొదటి శతాబ్ధానికి ప్రాముఖ్యత సంతరించికుంది.
మధ్యయుయుగంలో " లిబెర్ ఆక్సమే " (బుక్ ఆఫ్ అక్సం) ఆధారంగా అక్సం మొట్టమొదటి రాజధాని మజాబెరు. దీనిని కుషు కుమారుడైన ఐటియోపిసు నిర్మించాడు.[35] ఈ రాజధాని తరువాత ఉత్తర ఇథియోపియాలో అక్సానికి తరలించబడింది. ఈ రాజ్యం "ఇథియోపియా" అనే పేరును 4 వ శతాబ్దం ప్రారంభంలో ఉపయోగించింది.[4][5]
అక్సూమిట్సు అనేక పెద్ద స్టలేలను స్థాపించారు. ఇది క్రైస్తవ పూర్వకాలంలో ఒక మతపరమైన ప్రయోజనాన్ని అందించింది. ఈ గ్రానైటు స్తంభాలలో ఒకటైన ఆస్కం ఒబ్లిస్కు ప్రపంచంలోని అతిపెద్ద నిర్మాణంగా ఉంది. ఇది 90 అడుగుల (27 మీటర్లు) ఎత్తు ఉంది. [36] ఎజనా పాలనలో (320-360) తరువాత అక్సం క్రైస్తవ మతాన్ని స్వీకరించింది.[37]
7 వ శతాబ్దంలో మక్కా నుండి ప్రారంభ ముస్లింలు ఇస్లామీయ నబీ సహచరులు (అరబ్బీ: نبي, ప్రవక్త) ముహమ్మదు ఖురేషి హింస నుండి ఆశ్రయం పొందడానికి ఈ రాజ్యంలో ప్రయాణించడాని మొదటి హిజ్రాగా ఇస్లామిక్ చరిత్రలో తెలిసిన ఒక ప్రయాణ కథనం సూచిద్తుంది. వారు ఇక్కడ మొట్టమొదటి ఆఫ్రికా మసీదును నిర్మించారు. ఇది కపానియను మసీదు పేరుతో మస్సావాలో నిర్మించబడింది.[38]
ఎరిత్రియా సముద్రం పెరీప్లసులో ఈ సామ్రాజ్యం ఒక ముఖ్యమైన దంతం మార్కెటు ప్రదేశంగా పేర్కొనబడింది. ఇది ప్రాచీన ప్రపంచం అంతటా దంతాన్ని ఎగుమతి చేయసింది. ఆ సమయంలో జుడోస్లేసు అక్సాన్ని పాలించాడు. ఆయన అడులిసు ఓడరేవును కూడా పాలించాడు.[39] అక్సమైటు పాలకులు వారి సొంత అక్సమైటు కరెన్సీ ముద్రించడం ద్వారా వాణిజ్య సులభతరం చేసారు. కుషు రాజ్యం క్షీణతను ఆధారం చేసుకుని అక్సం దానిని సామతరాజ్యం చేసుకుంది. తరువాత క్రమంగా అరేబియా ద్వీపకల్పంలోని రాజ్యాల రాజకీయాలలో ప్రవేశించింది. చివరకు హిమ్యరైటు సామ్రాజ్యాన్ని జయించి ఆ ప్రాంతం మీద తన పాలనను విస్తరించింది.[40]
అక్సం క్షీణత తరువాత, ఎరిత్రియా పర్వతప్రాంతాలను బహరు నెగసు పాలించాడు. ఈ ప్రాంతం అప్పుడు మాకేలే బహరు ("సముద్రాలు, నదుల మధ్య" అంటే ఎర్ర సముద్రం, మెరెబు నది మధ్య ఉన్న ప్రాంతం) గా పిలువబడింది.[41] ఇది తర్వాత చక్రవర్తి జరా యాకోబు పేరుతో బహరు నెగషు, మెదీరీ బహ్రీ (టిన్గ్రిన్యాలో "సముద్ర భూమి") గా పేరు మార్చబడింది. అయినప్పటికీ ఇందులో ఇథిపియాలోని మరేబు, షైరు వంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.[42] మెదీరీ బహ్రీ రాజధానిగా డిబెర్వాలో ఉంది.[43] రాజ్య ప్రధాన ప్రావిన్సులు హామాసీను, సెర, అకేలే గుజాయి ఉన్నాయి.
1559 లో తుర్కులు బహర్నాగాషు పర్వత ప్రాంతాలను ఆక్రమించి, ప్రతిఘటనను ఎదుర్కొన్న తరువాత బహ్రెనెగాషు, హైలాండు దళాలు తిరిగి వెనక్కి తీసుకున్నారు. 1578 లో బహరు నెగషు యిషెకు సహాయంతో హైలాండ్సులోకి విస్తరించేందుకు ప్రయత్నించారు. అధికార పోరాటాల తరువాత పొత్తులు మారిపోయాయి. 1589 నాటికి వారి దళాలను తీరం నుండి ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. ఆ తరువాత ఒట్టోమన్లు పర్వత ప్రాంతాలలో తమను తాము స్థాపించటానికి తమ ఆశయాలను వదలివేశారు. 1872 నాటికి వారు ఆ ప్రాంతమును విడిచి వెళ్ళే వరకు దిగువ ప్రాంతాలకు వెళ్ళారు.[44][45]
స్కాటిషు ప్రయాణికుడు జేముసు బ్రూసు 1770 లో మెదీరి బాహ్రి అబిస్సినియా కంటే వైవిధ్యమైన రాజకీయ సంస్థ అని నివేదించాడు. ఈ రెండు భూభాగాలు తరచుగా పోరాటంలో ఉన్నాయని పేర్కొన్నాడు. బహ్రే-నాగసీ ("కింగ్స్ అఫ్ ది సీ") ప్రత్యామ్నాయంగా అబిస్సినియన్లతో, పొరుగున ఉన్న ముస్లిం అడాలు సుల్తానేటుతో భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా పోరాడారు. అడాలు దళాలు ఇమాం అహ్మదు ఇబ్ను ఇబ్రహీం అలు-ఘాజీ క్రిస్టియను వ్యతిరేకత నిరోధకతలో భాగంగా అబిస్సినియాకు వ్యతిరేకంగా 1572 లో మెదీరీ బహ్రీ, అడాల్టే రాజ్యాలు, ఒట్టోమన్ సామ్రాజ్యంతో చేరారు. 16 వ శతాబ్దంలో ఒట్టోమన్ల ఎర్ర సముద్రం ప్రాంతంలో ప్రవేశంతో ఈ ప్రాంతంలో ఓట్టమన్ల రాక ప్రారంభం అయింది.[46]
1805 లో ప్రచురించబడిన తన పుస్తకంలో జేమ్సు బ్రూసు, బరాకరగాషు స్థానమైన హడావిని గురించి ప్రస్తావించాడు. అతని ప్రయాణ సమయంలో రాసు మైకేలు సెహులు చేత పరిపాలించబడిన టైగ్రే ప్రావిన్సు ఆఫ్ అబిస్సినియాలో భాగంగా ఉందని పేర్కొన్నాడు. హడావిలోని అధికారి మసావా నైబు (టర్కు హబీషు ఐలెటు ప్రావిన్సు) అధికార బాధ్యతలు వహించాడు. ఆయన నియమాలను అడ్డుకోవడానికి హడావిలో ఉన్న అధికారి, టిగ్రే గవర్నరు పట్ల అవసరమైనప్పుడు విధేయతను ఉపయోగించడం అవసరమని గుర్తించాడు. బ్రూసు ఎర్ర సముద్రం టెకెజు మధ్య ఉన్న టిగ్రేనులో చేరుకుని ఎండెర్టా, అంటలో వంటి అనేక పెద్ద ప్రభుత్వాల గురించి పేర్కొన్నాడు. బహర్గగాషు అధిక భాగం టిగ్రే ప్రావిన్సు తూర్పు వైపున ఉన్నాయి.[47][48][49]
16 వ శతాబ్దం చివరలో డెంకెలు లోతట్టు ప్రాంతాలలో అయుస్సా సుల్తానేటు ఎరిత్రియాలోని స్థాపించబడింది.[50] 1577 లో అడాలు సుల్తానేటు అయుస్సా, హరారు సుల్తానేటులుగా మార్చబడిన తరువాత ముహమ్మదు జస తన రాజధాని హరారు నుండి అయుస్సా (అశైతా) కు మార్చుకున్నాడు. 1672 తర్వాత కొంతకాలం అయుస్సా క్షీణదశ మొదలైంది.[51] 1734 లో ముడైటో వంశాధిపతి అఫెరు నాయకుడు కెడఫూ, అధికారాన్ని స్వాధీనం చేసుకుని ముడిటో రాజవంశంని స్థాపించాడు.[52][53] దీనితో నూతన, మరింత అధునాతనమైన విధానం ప్రారంభమైంది. ఇది కాలనీల కాలం వరకు కొనసాగింది.[53]
1517 లో మెదీరి బహ్రీని ఓడించి ఓట్టమన్లు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాతి రెండు దశాబ్దాలలో వారు ప్రస్తుత ఈశాన్య ఎరిత్రియాను ( మస్సావా నుండి స్వాకిను వరకు విస్తరించిన సుడాను ప్రాంతం) స్వాధీనం చేసుకున్నారు.[46]
ఈ ప్రాంతం హేబేష్ ఐలెటు పేరుతో ఒక ఒట్టోమను గవర్నరేటు (ఇయాలెటు) అయింది. కొత్త ప్రావిన్సు మొదటి రాజధానిగా మస్సా ఉంది. నగరం రెండవ ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన కేంద్రం అయిన తరువాత ఎగ్జిక్యూటివు రాజధాని త్వరలో ఎర్ర సముద్రం దాటి జెడ్డాకు తరలించబడింది. 16 వ శతాబ్దం చివరి నుండి 19 వ శతాబ్దం వరకు ప్రధాన కార్యాలయం కొనసాగింది. 18 వ శతాబ్దంలో మెదీనా తాత్కాలికంగా రాజధానిగా పనిచేసింది.[54]
ఒట్టోమన్లు చివరికి 16 వ శతాబ్దం చివరిలో బయటకు పంపబడ్డారు. అయితే వారు 1800 చివరిలో ఇటాలియన్ ఎరిత్రియా స్థాపన వరకు సముద్రతీరం మీద నియంత్రణను కొనసాగించారు.[46]
ఆఫ్రికా సంఘర్షణల సమయంలో ప్రస్తుత ఎరిత్రియా దేశ సరిహద్దులు స్థాపించబడ్డాయి. 1869 లో [55] - 1870 లో రహీత సుల్తాను అస్సాబు బే పరిసర ప్రాంతాలను రుబటినో షిప్పింగు కంపెనీకి విక్రయించారు.[56] ఈ ప్రాంతం ఇటీవలే నిర్మాణపనులు పూర్తిచేసుకున్న సూయజు కాలువ ద్వారా ప్రవేశపెట్టిన షిప్పింగు మార్గాల వెంట ఒక కోలింగు స్టేషనుగా పనిచేసింది. ఈజిప్టులో కేంద్రీకృతమై ఉన్న ఒట్టోమను హేబేషు ఐలెటులో ఇది దీర్ఘకాలం ఉండేది.[57] 1880 లో మొట్టమొదటి ఇటాలియను సెటిలర్లు వచ్చారు.[56]
1889 లో చక్రవర్తి ఐదవ యోహన్నెసు మరణం తరువాత జనరల్ ఓరెస్టీ బార్టైరి ఎరిత్రియా తీరం వెంట ఉన్న పర్వతప్రాంతాలను ఆక్రమించి ఇటలీ రాజ్యంలో ఒక కాలనీ అయిన ఇటలీ ఎరిత్రియా పేరుతో నూతన కాలనీ స్థాపనను ప్రకటించింది. అదే సంవత్సరం వూచిలు ఒప్పందం (ఇది ఉచియల్లి) సంతకం చేశాడు. దక్షిణ ఇథియోపియా రాజ్యమైన షెవా రాజు మెనెలికు తన ప్రత్యర్థి రాజ్యాలైన బోగోసు, హామిసీను, అకేలేలే గుజయి, సెరేల ఇటాలీ ఆక్రమణను గుర్తించి బదులుగా ఐరోపా ఆయుధాలు, మందుగుండు సామగ్రి సహాయం, వంటి సౌకర్యాలను స్వీకరించాడు అతని ప్రత్యర్థి రాజులపై అతని తరువాతి విజయాన్ని సాధించి చక్రవర్తి రెండవ మెనెలెకు (1889-1913) గా ఆధిపత్యం చేశాడు. ఒప్పందం చేసుకుని మొత్తం భూభాగంపై అధికారికంగా అంగీకరం పొందాడు.[58]
1888 లో ఇటాలీ పరిపాలనలో కొత్త కాలనీలో మొదటి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించింది. 1888 లో సాటిలో ఎరిత్రియా రైల్వే పూర్తయింది.[59] ఇది 1911 లో ఎగువ మైదానంలోని అస్మారాకు చేరుకుంది.[60] ఆసమయంలో అస్మార-మస్సావా కేబులువే ప్రపంచంలోని అతి పొడవైన రైలుమార్గంగా ఉంది. కాని తరువాత రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిషు వారు దీనిని తొలగించారు. ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు, వలస అధికారులు వ్యవసాయ రంగంలో గణనీయంగా పెట్టుబడి పెట్టారు. ఇది అస్మారా, మస్సావాలోని పట్టణ సౌకర్యాల పర్యవేక్షణను పర్యవేక్షింది. ఎరిత్రియన్లను ప్రజా సేవారంగంలో, పోలీసు, ప్రభుత్వ కార్యాలయ విభాగాలలో నియమించింది.[60] లిమియాలో ఇటాలో-టర్కిషు యుద్ధం, అలాగే ఫస్టు అండు సెకండు ఇటాలో-అబిస్సినియా యుద్ధాల సమయంలో ఎరిత్రియన్ల వేలాది మంది సైనికులను సైన్యంలో చేర్చుకున్నారు.
అదనంగా ఇటాలియన్ ఎరిట్రియా పరిపాలన బొత్తాములు, వంట నూనె, పాస్తా, నిర్మాణ పదార్థాలు, మాంసం, పొగాకు, ఇతర గృహోపకరణాలను ఉత్పత్తి చేసే అనేక నూతన కర్మాగారాలు ప్రారంభించాయి. 1939 లో సుమారు 2,198 కర్మాగారాలు ఉన్నాయి. వీటిలో చాలామంది ఉద్యోగులు ఎరిత్రియా పౌరులు ఉన్నారు. పరిశ్రమ స్థాపనతో ఇటలీ, ఎరిత్రియను నగరప్రాంతాలలో నివసించసాగారు. ఈ భూభాగంలో నివసిస్తున్న ఇటాలియన్లు ఐదు సంవత్సరాలలో 4,600 నుండి 75,000 వరకు పెరిగింది; ఎరిత్రియన్ల ప్రమేయంతో పరిశ్రమలు, వాణిజ్యం, పండ్ల పెంపకం దేశవ్యాప్తంగా వ్యాపించాయి. కొన్ని తోటలు ఎరిట్రియన్ల యాజమాన్యంలో ఉన్నాయి.[61]
1922 లో బెనిటో ముస్సోలినీ ఇటలీలో అధికారంలోకి వచ్చినప్పుడు ఇటలీ ఎరిత్రియాలో వలసరాజ్య ప్రభుత్వానికి తీవ్ర మార్పులు చేశారు. 1936 మేలో ఇటలీ సామ్రాజ్యం జననాన్ని ఇల్ డ్యుస్ ప్రకటించిన తరువాత ఇటలీ ఎరిత్రియా (ఉత్తర ఇథియోపియా ప్రాంతాలతో విస్తరించింది), ఇటాలీ సొమాలియాండు కొత్తగా రూపొందించబడిన ఇటాలియన్ తూర్పు ఆఫ్రికా (ఆఫ్రికా ఒరిఎంటలే ఇటాలియా) పరిపాలనా భూభాగంలో కేవలం ఇథియోపియాతో విలీనం చేయబడ్డాయి. ఈ ఫాసిస్టు కాలం "నూతన రోమను సామ్రాజ్యం" పేరుతో సామ్రాజ్యం వర్గీకరించబడింది. ఇటాలియన్ తూర్పు ఆఫ్రికా పారిశ్రామిక కేంద్రంగా ఇటలీ ప్రభుత్వం ఎరిత్రియాను ఎంపిక చేసింది.[62]
1941 " కెరాను యుద్ధం "లో విజయం సాధించి బ్రిటిషు వారు ఇటాలియన్లు తరిమివేసారు.[63] దేశ పరిపాలనను స్వీకరించారు.
మిత్రరాజ్యాల దళాలు దాని విధిని నిర్ణయించే వరకు బ్రిటీషు ఎరిత్రియాను సైనిక పాలనలో ఉంచింది.
ఎరిత్రియా స్థితికి సంబంధించి మిత్రరాజ్యాల మధ్య ఒప్పందం లేకపోవటంతో, బ్రిటీషు పరిపాలన రెండవ ప్రపంచ యుద్ధం, 1950 వరకు కొనసాగింది. తరువాత యుద్ధాలలో బ్రిటిషు ఎరిత్రియా మతపరంగా విభజించి సుడాను, ఇథియోపియాలతో విలీనం చేయాలని ప్రతిపాదించింది.[ఆధారం చూపాలి] ఇటలీ ఎన్నికలలో కమ్యూనిస్టు విజయాన్ని ఊహించిన సోవియటు యూనియను ప్రారంభంలో ఎరిత్రియా ఇటలీకి ట్రస్టీ షిప్పు లేదా ఒక కాలనీగా తిరిగి రావడానికి మద్దతు ఇచ్చింది.
1950 వ దశకంలో చక్రవర్తి హైలే సెలాస్సీ పాలించిన ఇథియోపియా భూస్వామ్య పరిపాలనలో ఎరిత్రియా, ఇటాలియన్ సోమాలియాండ్లను అనంతం చేయడానికి ప్రయత్నించింది. పారిసు పీసు కాన్ఫరెంసులో, ఐక్యరాజ్యసమితి తొలి సమావేశంలో ఫ్రాంక్లిను డి. రూజ్వెల్టుకు ఒక లేఖలో అతను రెండు భూభాగాలను ప్రకటించాడు.[64] ఐక్యరాజ్యసమితిలో మాజీ ఇటాలియన్ కాలనీల విధిపై చర్చ కొనసాగింది. బ్రిటీషు, అమెరికన్లు రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా పశ్చిమ దేశానికి మినహాయించి ఎరిత్రియాను ఇథియోపియన్లకు అందజేశారు.[65] ఎరిత్రియన్ పార్టీల స్వాతంత్ర్య కూటమి ఐక్యరాజ్య సమితి జనరలు అసెంబ్లీ నుండి నిరంతరాయంగా చేయబడిన అభ్యర్ధన ఫలితంగా ఎరిత్రియా సమస్యకు పరిష్కారం కోసం వెంటనే ఒక ప్రజాభిప్రాయ సేకరణ జరిగాలని యు.ఎన్.జనరలు అసెంబ్లీ అభిప్రాయం వెలువడింది.
1950 డిసెంబరులో యు.ఎన్ రిజల్యూషను స్వీకరించిన తరువాత, ఎరిత్రియా యునైటెడ్ స్టేట్సు ప్రేరణతో ఇథియోపియాతో సమాఖ్య చేయబడింది.[66] ఎరిత్రియా, ఇథియోపియా చక్రవర్తి సార్వభౌమాధికారం కింద ఫెడరలు నిర్మాణం ద్వారా అనుసంధానం చేయాలని పిలుపునిచ్చింది. ఎరిత్రియాయా తన సొంత పాలనాపరమైన, న్యాయ వ్యవస్థను కలిగి ఉంది. దాని స్వంత జెండా, దేశీయ వ్యవహారాలపై నియంత్రణ, పోలీసు, స్థానిక పరిపాలన, పన్నుల నియంత్రణ వ్యవస్థను కలిగి ఉంది.[64] విదేశీ వ్యవహారాల (వాణిజ్యంతో సహా), రక్షణ, ఫైనానౌ, రవాణా వంటివి ప్రస్తుతమున్న ఇంపీరియలు ప్రభుత్వం నిర్వహిస్తుంది.
1958 లో ఎరిత్రియన్ల బృందం ఎరిత్రియా లిబరేషను మూవ్మెంటు (ఇ.ఎల్.ఎమ్) ను స్థాపించింది. సంస్థలో ప్రధానంగా ఎరిత్రియా విద్యార్థులు, వృత్తి నిపుణులు, మేధావులు ఉన్నారు. ఇది సామ్రాజ్య ఇథియోపియా ప్రభుత్వ కేంద్రీకరణ విధానాలకు నిరోధకత పెంపొందించడానికి ఉద్దేశించిన రహస్య రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నమైంది.[67] 1961 సెప్టెంబరు 1 న హమీదు ఇడిసు ఆలేటు నాయకత్వంలో ఎరిత్రియా లిబరేషను ఫ్రంటు (ఎల్ఎఫ్) స్వాతంత్ర్యం కోసం సాయుధ పోరాటం సాగించింది. 1962 లో చక్రవర్తి హైలే సెలాస్సి ఏకపక్షంగా ఎరిత్రియా పార్లమెంటును రద్దు చేసి భూభాగాన్ని ఆక్రమించుకున్నాడు. ఎరిత్రియా పీపుల్సు లిబరేషను ఫ్రంటు (ఎపిఎఫ్ఎఫ్), ఎల్ ఎఫ్ వారసుడిగా ఎరిత్రియాలో ఇథియోపియా దళాలను ఓడించి ఇథియోపియా తిరుగుబాటు దళాల సంకీర్ణాన్ని నియంత్రణలోకి తీసుకునేందుకు సహాయపడింది. 1991 వరకు స్వాతంత్ర్యం కోసం ఏర్పడిన ఎరిత్రియా యుద్ధం 1991 వరకు వరుస ఇథియోపియా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కొనసాగుతూ ఇథియోపియా రాజధాని అడిసు అబాబా మీద నియంత్రణ సాధించడానికి ఎథియోపియా రెబలు ఫోర్సెసుకు సహకరించింది.
ఎరిత్రియా ప్రజలు ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో నిర్వహించబడిన ప్రజాభిప్రాయసేకరణలో ఎరిత్రియా స్వతంత్రం కొరకు మద్దతుగా అత్యంత ఉత్సాహంగా ఓటువేసారు. ఎరిత్రియా స్వాతంత్ర్యాన్ని ప్రకటించి 1993 లో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఇ.పి.ఎల్.ఎఫ్. అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. జాతీయవాద మార్గాలతో ఏక-పార్టీ రాష్ట్రాన్ని స్థాపించి ఇతర రాజకీయ కార్యకలాపాలను నిషేధించింది. స్వతంత్రం సాధించిన తరువాత ఎరిత్రియాలో ఎటువంటి ఎన్నికలు నిర్వహించబడలేదు.
ఎరిత్రియా తూర్పు ఆఫ్రికాలోని హార్ను ఆఫ్ ఆఫ్రికాలో ఉంది. దేశ ఈశాన్య, తూర్పు సరిహద్దులలో ఎర్ర సముద్రం, పశ్చిమసరిహద్దులలో సూడాన్, దక్షిణసరిహద్దులలో ఇథియోపియా, ఆగ్నేయసరిహద్దులలో జిబౌటి ఉన్నాయి. ఎరిత్రియా 12 ° నుండి 18 ° డిగ్రీల ఉత్తర అక్షాంశం 36 ° నుండి 44 ° తూర్పు రేఖాంశం మద్య ఉంటుంది.
దేశం తూర్పు ఆఫ్రికా రిఫ్టు శాఖలో ఉపస్థితమై ఉంది. దేశ పశ్చిమప్రాంతంలో సారవంతమైన భూములు, తూర్పుప్రాంతంలో ఎడారికి ఉంటుంది. ఎరిత్రియా ఎర్ర సముద్రం దక్షిణ భాగంలో పపర్వత చీలికలో ఫోర్కువంటి భూభాగానికి నిలయంగా ఉంటుంది. దల్లాకు ద్వీపసమూహంలో ఫిషింగు మైదానాలు, శుష్కమైన తీరప్రాంతం, ఇసుక ఉన్నాయి.
ఎరిత్రియాను మూడు పర్యావరణ ప్రాంతాలుగా విభజించవచ్చు. పర్వతాల తూర్పున దేశంలోని ఆగ్నేయ దిశగా వ్యాపించిన వేడి, శుష్క తీరప్రాంత మైదానాలు ఉన్నాయి. చల్లని, మరింత సారవంతమైన పర్వతాలను, 3000 మీ వరకు వ్యత్యాసమైన నివాసితప్రాంతంగా ఉంటుంది. ఇక్కడ నివాసప్రాంతాలు ఫిలిఫిలు సోలోమోనాలోని ఉప ఉష్ణమండల వర్షారణ్యం, దక్షిణ పర్వత ప్రాంతాలలోని ఎత్తైన శిఖరాలు, కాన్యానులకు మారుతుంటాయి.[68] ఎరిత్రియా అఫారు ట్రైయాంగిలు (డానాకిలు డిప్రెషను) ట్రిపులు జంక్షనుగా మూడింటి స్థానంగా ఉంది, ఇక్కడ మూడు టెక్టోనికు ప్లేట్లు ఒకదానిని మరొకటి ఢీకొనడం జరుగుతుంది. దేశం ఎత్తైన శిఖరం " ఎమ్బా సోయిరా " సముద్ర మట్టానికి 3,018 మీటర్లు (9,902 అడుగులు) ఎత్తులో ఎరిత్రియా కేంద్రంలో ఉంది.
దేశంలోని ప్రధాన నగరాలలో రాజధాని నగరం అస్మారా, ఆగ్నేయంలో ఆస్పెబు పోర్టు టౌను, అలాగే తూర్పున మస్సావా, ఉత్తర పట్టణం కెరెను, మధ్య పట్టణం మెన్దేఫెరా ఉన్నాయి.
ఎరిత్రియా గ్లోబలు ఎన్విరాన్మెంటు ఫెసిలిటీలో 14 దేశాలలో ఒకటిగా భాగస్వామ్యం వహిస్తుంది. ఇది అంతర్జాతీయ పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి అంతర్జాతీయ సంస్థలతో, పౌర సమాజ సంస్థలు, ప్రైవేటు రంగాలతో భాగస్వాములుగా ఉంటూ జాతీయ అభివృద్ధి కార్యక్రమాలు మద్దతునిస్తున్నప్పుడు.[69] స్థానికంగా వర్షపాతంలో వైవిధ్యం (తక్కువ వర్షపాతం) ఇది నేల క్రమక్షయం, వరదలు, కరువులు, భూసారం క్షీణించడం, ఎడారీకరణకు కారణమవుతుంది.[70] 2006 లో ఎరిత్రియా మొత్తం తీరాన్ని పర్యావరణ రక్షణా మండలంగా మార్చిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా ప్రకటించబడింది. 1,347 కి.మీ (837 మై) తీరప్రాంతం ఉంది. దానిలో 350 కంటే ఎక్కువ ద్వీపాలు సుమారు 1,946 కి.మీ (1,209 మైళ్ళు) తీరాన్ని కలిగి ఉన్నాయి. ఇవి మొత్తం ప్రభుత్వ రక్షణలో ఉంటాయి.
ఎరిత్రియాలో అనేక రకాల క్షీరదాలు ఉన్నాయి. 560 రకాల పక్షుల గొప్ప స్థానికపక్షిజాతుల సంపద కలిగి ఉంది.[71]
ఎరిత్రియా పెద్ద వేట జాతులు జంతువుల సమృద్ధికి నిలయం. ఎరిత్రియా అంతటా వాటి సంఖ్యను క్రమంగా అభివృద్ధిచేయడానికి అమలులో ఉన్న నిబంధనలు సహాయపడ్డాయి.[72] ఎరిత్రియాలో అబిస్సినియా కుందేలు, ఆఫ్రికా అటవీ పిల్లి, నల్లజాతి జాకెలు, ఆఫ్రికా గోల్డెను తోడేలు, జెనెటు, గ్రౌండు ఉడుత, పేల్ నక్క, సోమెమెరింగ్ గజెల్లె, వర్తొగు మొదలైన క్షీరదాలు ఉన్నాయి. తీర మైదానాలు, గాషు-బార్కాలో దొర్కాసు గజెల్లే సాధారణం.
గషు-బార్కా రీజియను పర్వతాలలో సింహాలు నివసిస్తాయి. దేశంలోని కొన్ని ప్రాంతాలలో తిరుగుతున్న ఆఫ్రికా బుషు ఏనుగుల కూడా ఉన్నాయి. డికు-డిక్లు కూడా అనేక ప్రాంతాల్లో కనిపిస్తాయి. డెనకాలియా ప్రాంతంలో అంతరించిపోతున్న ఆఫ్రికా అడవి గాడిదను చూడవచ్చు. ఇతర స్థానిక వన్యప్రాణులలో బుష్బకు, డుయికర్లు, గ్రేటరు కుడు, క్లిపుస్ప్రింగరు,, ఆఫ్రికా చిరుతలు, ఒరిక్సు, మొసళ్ళు ఉన్నాయి.[73][74] మచ్చల హైనా విస్తృతంగా, చాలా సాధారణంగా కనిపిస్తాయి.
1955 - 2001 మధ్య ఏనుగు మందలు ఏమాత్రం నివేదించబడలేదు. స్వాతంత్ర్య పోరాటంలో అవి బాధించబడినట్లు భావిస్తున్నారు. 2001 డిసెంబరులో 10 గష్ నది సమీపంలో జ్యువెనిలెసుతో సహా 30 మంది మందలు గమనించారు. ఏనుగులు ఆలివు బాబూన్సుతో సహజీవ సంబంధాన్ని ఏర్పరుస్తాయి. ఏనుగులు తవ్విన నీటి రంధ్రాలను ఉపయోగించిన బబూన్లు, ఏనుగులు చెట్లమీద ఉన్న బబూన్లను ఒక ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా ఉపయోగిస్తున్నాయి.
ఎరిత్రియాలో దాదాపు 100 ఆఫ్రికన్ బుష్ ఏనుగు మిగిలిందని అంచనా.[75] గతంలో ఎరిత్రియాలో కనుగొనబడిన అంతరించిపోతున్న ఆఫ్రికా అడవి కుక్క (లైకాను పిక్టసు) ఇప్పుడు మొత్తం దేశం నుంచి తొలగించబడిందని భావిస్తున్నారు.[76] గషు-బార్కాలో సాల్టెడు స్కేలు వైపరు లాంటి ఘోరమైన పాములు సాధారణం. పఫ్ కట్లపాము, ఎర్రటి ఉమ్మివేసే త్రాచుపాము విస్తారంగా ఉంటాయి. వీటిని పర్వత ప్రాంతాలలో కూడా చూడవచ్చు. తీరప్రాంత సముద్ర తీరాలలో డాల్ఫిను, దుగోంగు, వేలు షార్కు, తాబేళ్లు, మెర్లిను, కర్డు ఫిషు, మాంటా రే ఉన్నాయి. [74]
ఎరిత్రియా ఆర్థికవ్యవస్థ ఇటీవల సంవత్సరాలలో గణనీయమైన వృద్ధిని సాధించింది. 2011 నాటికి స్థూల దేశీయోత్పత్తి (జి.డి.పి) లో మెరుగుదల సాధించడం ద్వారా వృద్ధిరేటు గణనీయంగా 2012 నాటికి 7.5% అధికరించింది.[77] ఎరిత్రియను ఆర్థికవ్యవస్థ ఇటీవలి వృద్ధికి " బంగారం, వెండి బిషా గని "లో పూర్తిస్థాయి కార్యకలాపాలను ప్రారంభించడం, మస్సావలో సిమెంటు ఫ్యాక్టరీ నుండి సిమెంటు ఉత్పత్తి చేయడం ప్రధానకారణంగా ఉంది.[78]
నిజమైన జి.డి.పి. (2009 అంచనా) : $ 4.4 బిలియన్ల అమెరికా డాలర్లు, వార్షిక వృద్ధి రేటు (2011 ఇ.ఎస్.టి) : 14%.[79][80]
విదేశాల నుంచి వచ్చిన ఉద్యోగుల వేతనానికి నికర స్థూల దేశీయ ఉత్పత్తిలో 32% వాటా ఉన్నట్లు అంచనా వేయబడింది.[1] ఎరిత్రియా రాగి, బంగారం, గ్రానైటు, పాలరాయి, పోటాషు వంటి వనరులను విస్తారంగా కలిగి ఉంది. ఎరిత్రియా ఆర్థిక వ్యవస్థ స్వాతంత్ర్య యుద్ధం కారణంగా తీవ్రమైన మార్పులకు గురైంది. 2011 లో ఎరిత్రియా జి.డి.పి. 8.7% వృద్ధి చెందింది. ఇది ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలలో ఒకటిగా ఉంది.[81]
ఎరిత్రియా శ్రామిక శక్తిలో 80% వ్యవసాయంలో పనిచేస్తున్నారు.[82] ఎరిత్రియా ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులలో జొన్న, చిరుధాన్యాలు, బార్లీ, గోధుమ, అపరాలు, కూరగాయలు, పండ్లు, నువ్వులు, లిన్సీడు, పశువులు, గొర్రెలు, మేకలు, ఒంటెలు ఉన్నాయి. [83]
ఎరిత్రియా-ఇథియోపియా యుద్ధం ఎరిత్రియా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. 1999 లో జి.డి.పి. పెరుగుదల 1% కన్నా తక్కువకు పడిపోయింది. 2000 లో జి.డి.పి. తగ్గింది. 2000 లో 8.2%. తగ్గింది. 2000 మేలో యుద్ధం ఫలితంగా $ 600 మిలియన్ల అమెరికా డాలర్లు ఆస్తి నష్టం జరిగింది. ఫలితంగా పశువుల కారణంగా 225 మిలియన్ల అమెరికా డాలర్ల నష్టం (55,000 గృహాలలో) సంభవించింది.
యుద్ధం ఎరిత్రియా రవాణా మౌలికనిర్మాణాలను అభివృద్ధి చేసింది. అభివృద్ధిలో భాగంగా నూతన రహదారులు నిర్మించబడ్డాయి. ఓడరేవులు అభివృద్ధి చేయబడ్డాయి. " వెఫ్రీ వార్సే యికా అలో " కార్యక్రమంలో భాగంగా యుద్ధం-దెబ్బతిన్న రహదారులు, వంతెనలను మరమత్తు చేయడం ద్వారా దాని రవాణా మౌలికవ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్టులలో అత్యంత ముఖ్యమైనవి కస్సాంతో మస్సావాను అనుసంధానిస్తూ 500 కిమీ కంటే ఎక్కువ తీరప్రాంత రహదారిని నిర్మించాయి. అలాగే ఎరిత్రియా రైల్వే పునర్నిర్మించబడింది. మస్సావా, రాజధాని అస్మారా నౌకాశ్రయాల మధ్య ఈ రైలు మార్గం పునరుద్ధరించబడింది. అయితే నిరంతర సేవలు లేవు. ఆవిరి వాహనాలను కొన్నిసార్లు ఔత్సాహికుల సమూహాలు ఉపయోగిస్తారు.
ఎరిత్రియాలో జాతీయ రవాణా సంస్థ ఎరిత్రియన్ ఎయిర్లైంసును ఉన్నాయి. అయినప్పటికీ సేవలలో అంతరాయం ఉంది.
ఎరిత్రియాలో రవాణా వ్యవస్థలో రహదారులు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, వివిధ రకాల ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు, సముద్ర, వైమానిక రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఒక రైల్వే గతంలో మాస్సా నుండి బిషీయా అస్మార వరకు ఒక రైవే వ్యవస్థ నిర్వహించబడింది. అది ప్రస్తుతం పునర్నిర్మాణంలో ఉంది.
1999 నాటికి ఎరిత్రియాలో 950 మి.మీ (నేరో గేజు) రైలు మార్గం మొత్తం పొడవు 317 కిలోమీటర్లు ఉంది. మస్సావ నౌకాశ్రయంతో అగర్దాతు, అస్మార రైల్వే లింకులు ఉన్నాయి. అయినప్పటికీ ఇది 1978 నుండి నిలిపివేయబడింది 1994 లో మసావాలో తిరిగి 5 కి.మీ మార్గం ప్రారంభించబడింది. 2003 నాటికి మస్సావ నుండి అస్మారా వరకు ఈ మార్గం పునరుద్ధరించబడింది.
ఎరిత్రియా రహదారి వ్యవస్థలో రహదార్లు వర్గీకరణ ప్రకారం ప్రత్యేకపేర్లతో పిలువబటాయి. వర్గీకరణ మూడు స్థాయిలు: ప్రాథమిక (పి), సెకండరీ (ఎస్), తృతీయ (టి). అత్యల్ప స్థాయి రహదారి తృతీయ, స్థానిక ప్రయోజనాలను అందిస్తుంది. అవి అప్పుడప్పుడు భూమిని చదును చేసి రహదారులను మెరుగుపరుస్తాయి. తడి సీజన్లలో ఈ రహదారులు సాధారణంగా అగమ్యమవుతాయి.
తదుపరి ఉన్నత స్థాయి రహదారి ద్వితీయ రహదారి, సాధారణంగా ఒకే-లేయర్డు తారు రహదారిగా ఉంటుంది. ఇది జిల్లా రాజధానులను కలిపి, ప్రాంతీయ రాజధానులకు కలుపుతుంది. ప్రాథమిక రహదారులుగా పరిగణించబడుతున్న రహదారులు పూర్తిగా మట్టిరోడ్లు. సాధారణంగా అవి ఎరిత్రియాలోని అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల మధ్య ట్రాఫికును రవాణా చేస్తాయి.
ఎరిత్రియా రైల్వేను 1887 - 1932 మధ్య నిర్మించారు. గతంలో అస్మార, మాసావా నుండి బిషియా వరకు నడిచింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, తరువాత పోరాటంలో ఇది తీవ్రంగా దెబ్బతిని చివరికి 1978 లో మూసివేయబడింది. స్వాతంత్ర్యం తరువాత పునర్నిర్మాణ ప్రయత్నం ప్రారంభమైంది. 2003 లో మొదటి పునఃనిర్మించిన విభాగం మళ్లీ తెరవబడింది. 2009 నాటికి మాసావా అస్మారా పూర్తిగా పునర్నిర్మించబడి సేవ కోసం అందుబాటులో ఉంది. చాలా రైల్వే సామగ్రి పరిమిత లభ్యత, పాతబడిన వ్యవస్థ కారణంగా ప్రస్తుత సేవ చాలా పరిమితమైంది కనుక మరింత పునర్నిర్మాణం ప్రణాళిక చేయబడింది.
ఎరిత్రియా జనసంఖ్య 3.2 మిలియన్లకు అభివృద్ధి చెందింది.5 మిలియను 1990 - 2016.[84] సరాసరి సంతానోత్పత్తి 4.7 [85]
ఎరిత్రియా ప్రభుత్వం ప్రకారం తొమ్మిది గుర్తింపు పొందిన జాతి సమూహాలు ఉన్నాయి.[3][86] ఎరిత్రియా సమాజం జాతిపరంగా వైవిధ్యమైనది. అయితే టిగ్రిన్యా ప్రజలు 55%, టైగ్రే ప్రజలు జనాభాలో 30% ఉన్నారు. మిగిలిన జాతి సమూహాలు సహోయి, హేడరేబు, అఫారు, బిలెను వంటి కుషిటికు శాఖకు చెందినప్రజలకు ఆఫ్రోయాసియాటికు-భాషావాడుకరుల కమ్యూనిటీలకు చెందినవి. ఎన్నో నియోటికు జాతి అల్పసఖ్యాకులు కూడా ఉన్నాయి. ఎరిత్రియాలో వీరికి కునామా, నారా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ప్రతి జాతికి వైవిధ్యమైన మాతృభాష ఉంది. చాలామంది మైనారిటీలు ఒకటి కంటే ఎక్కువ భాషలను మాట్లాడతారు. రషీదా ఎరిత్రియా జనాభాలో సుమారు 2% మంది ఉన్నారు.[87] వారు ఉత్తర తీరప్రాంత ఎరిత్రియాలో అలాగే సూడాన్ తూర్పు తీరాలలో నివసిస్తారు. 19 వ శతాబ్దంలో హజజు ప్రాంతం నుండి రషీదా ప్రజలు మొదటిసారి ఎరిత్రియాకు వచ్చారు.[88]
అదనంగా ఇటాలియన్ ఎరిత్రియన్ (అస్మారాలో కేంద్రీకృతమై ఉంది), ఇథియోపియన్ టిగ్రయేయన్ కమ్యూనిటీలు ఉన్నాయి. సాధారణంగా ప్రభుత్వం పౌర్రసత్వం ఇవ్వదు. వివాహం ద్వారా, లేదా చాలా అరుదుగా మాత్రమే పౌరసత్వం ఇస్తుంది. 1941 లో ఎరిత్రియాలోని 7,60,000 మంది నివాసితులలో 70,000 ఇటాలియన్లు ఉన్నారు.[89] ఎరిత్రియా ఇటలీ స్వతంత్రం పొందిన తరువాత చాలామంది ఇటాలియన్లు ఎరిత్రియాను విడిచిపెట్టారు. ప్రస్తుతం ఎరిత్రియాలో ఇటాలీ సంతతివారు 1,00,000 ఎరిత్రియన్లు వరకు ఉన్నారని అంచనా వేయబడింది.[90][91]
ఎరిత్రియా ఒక బహుభాషా దేశం. రాజ్యాంగం "అన్ని ఎరిత్రియ భాషల సమానత్వం"ను స్థాపించినందున దేశానికి అధికారిక భాష లేదు. [92] టిగ్రిన్యా జాతీయ గుర్తింపు భాషలా పనిచేస్తుంది. 2006 లో 52,54,000 ప్రజలు ఉన్న ఎరిత్రియాలో టిగ్రిన్యా భాష 2,540,000 ప్రజలకు వాడుకభాషగా ఉంది. ఇది చాలా విస్తారంగా మాట్లాడే భాషగా ఉంది. ముఖ్యంగా ఎరిట్రియా దక్షిణ, మధ్య భాగాలలో వాడుకలో ఉంది. అఫారు, అరబిక్, బీజా, బిలెను, కునామా, నారా, సాహో, టైగ్రే ఇతర ప్రధాన జాతీయ భాషలు ఉన్నాయి. టిగ్రిన్యా, ఆంగ్ల భాషతో కార్యాలయ భాషగా పనిచేస్తూ తరువాత విద్యాలయాలు, అనేక సాంకేతిక రంగాలలో ఉపయోగించబడుతుంది. మాజీ వలసవాద భాష ఇటలియను భాషకు ఎరిత్రియాలో ఎటువంటి ప్రభుత్వ గుర్తింపు లేదు. అది కొన్ని మోనోలింగ్యుయలుకు (ఒక భాషను మాత్రమే మాట్లాడగలిగిన ప్రజలు) ఇటాలియను మాత్రమే వాడుకభాషగా ఉంది. అస్మారాలో " సుకుమా ఇటలీనా డి అస్మారా " అనే ఇటాలియను పాఠశాల సుదీర్ఘంగా నడుపుతుంది.[93] అంతేకాకుండా స్థానిక ఎరిత్రియన్లకు ఇటాలియన్ ఎరిట్రియను భాష వాడుకలో ఉంది. ఇటలీ ఎరిత్రియను ఇటాలియన్ అనేక పదాలతో మిళితం చేసిన ఇటాలియన్ వెర్షనును మాట్లాడారు.[94]
ఎరిత్రియా కుటుంబానికి చెందిన ఇథియోపియా సెమిటిక్ విభాగానికి చెందిన ఎరిత్రియా భాషలలో చాలాభాగం భాషలు.
ఆఫ్రోయాసిటికు కుటుంబానికి చెందిన పలి ఎథియోపియను సెమెటికు భాషలను ఎరిత్రియాలో వాడుకలో ఉన్నాయి.[95] కుషిటికు శాఖకు చెందిన ఇతర ఆఫ్రోయాసియాటిక్ భాషలు కూడా దేశంలో విస్తారంగా వాడుకలో ఉన్నాయి.[95] వీటిలో అఫారు, బీజా, బ్లిను, సహో భాషలు ఉన్నాయి. చిన్న సమూహాలు కూడా కొత్తగా గుర్తించబడిన దాలికు, అరబికు (వరుసగా హెజాజీ, హద్రామి మాండలికాలు) వంటి ఇతర ఆఫ్రోయాసియాటికు భాషలు వాడుకలో ఉన్నాయి.
అదనంగా నీలో-సహారా భాషలు (కునామా, నారా) దేశంలోని ఉత్తర, వాయువ్య భాగంలో నివసించే నిలోటికు కునామా, నారా జాతి అల్పసంఖ్యాక సమూహాలు స్థానిక భాషగా ఉంది.[95]
U.S Department of State 2011[96] | - |
|
|
---|
ప్యూ రీసెర్చి సెంటరు ఆధారంగా 2010 నాటికి ఎరిత్రియాలో 62.9% క్రైస్తవులు, 36.6% మంది ఇస్లామీయులు, 0.4% జానపద మతాన్ని అనుసరిస్తున్నారు. మిగిలినవి జుడాయిజం, హిందూయిజం, బౌద్ధమతం, ఇతర విశ్వాసాలు (<0.1% ప్రతి), నాత్షికులు (0.1%) ఉన్నారు.[97] 2011 నాటికి ఎరిత్రియా జనాభాలో 50% క్రైస్తవులు, 48% ఇస్లామీయులు, 2% ఇతర సంప్రదాయాలకు చెందిన ప్రజలు సంప్రదాయ ఉన్నారని యు.ఎస్. డిపార్ట్మెంటు అఫ్ స్టేటు అంచనా వేసింది.[96]
2002 మే నుండి ఎరిత్రియా ప్రభుత్వం అధికారికంగా ఎరిత్రియన్ ఆర్థోడాక్సు త్వీహెడో చర్చి (ఓరియంటలు ఆర్థోడాక్సు), సున్నీ ఇస్లాం, ఎరిట్రియను క్యాథలికు చర్చి (మెట్రోపాలిటన్టేటు సుయి జురిసు), ఎవాంజెలికలు లూథరను చర్చిలను గుర్తించింది. అన్ని ఇతర విశ్వాసాలు, తెగల నమోదు ప్రక్రియను చేయవలసి ఉంటుంది.[98] ఇతర విషయాలతో, ప్రభుత్వం రిజిస్ట్రేషను వ్యవస్థ మతపరమైన గ్రూపులు తమ సభ్యత్వానికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని నమోదుచేసుకుని పూజించే అనుమతి పొందాలని కోరుతుంది.[98]
ఎరిత్రియా ప్రభుత్వం మతాలు "సంస్కరించబడడం", "రాడికల్" సంస్కరణలు చేయడానికి వ్యతిరేకంగా ఉంది. అందువలన విప్లవాత్మకమని భావించబడుతున్న ఇస్లాం శాఖలు, క్రైస్తవ మతం, యెహోవాసాక్షులు, బహాయి విశ్వాసం (బహాయీ విశ్వాసం ఇస్లామికు కాని క్రైస్తవంకాని కాదు), సెవెంత్-డే అడ్వెంటిస్టు చర్చి అనేక ఇతర ప్రొటెస్టెంటు ఎవాంజెలికలు నమోదుకాలేదు కనుక ప్రజలు స్వేచ్ఛగా పూజించలేరు. 1994 నాటికి 51 మందితో ముగ్గురు యెహోవాసాక్షులు ఖైదు చేయబడ్డారు.[99][100][101]
2017 మత స్వేచ్ఛా నివేదికలో యు.ఎస్. స్టేట్ డిపార్టుమెంటు ఎరిత్రియా ప్రత్యేక ఆందోళన (సి.పి.సి) కలిగిన దేశం అని ఎరిత్రియాను పేర్కొన్నది.[102]
ఎరిత్రియా జాతీయ పార్టీ శాసన ఎన్నికలు పదేపదే వాయిదా వేయబడ్డాయి.[7] హ్యూమను రైట్సు వాచు ఆధారంగా ప్రపంచంలోని మానవ హక్కుల రికార్డు ప్రపంచంలోనే అత్యంత తక్కువస్థాయిలో ఉన్నట్లు పరిగణించబడుతుంది.[8] చాలా పాశ్చాత్య దేశాలు ఎరిత్రియా అధికారులను ఏకపక్ష ధోరిణిలో నిర్బంధాలను అమలుచేస్తుందని ఆరోపణలు చేశాయి. ప్రజలు రాజకీయ క్రియాశీలకంగా పనిచేయకుండా అఙాత వ్యక్తులు నిర్బంధిస్తున్నారని భావించబడుతుంది. అయినప్పటికీ ఎరిత్రియా ప్రభుత్వం నిరంతరాయంగా ఆరోపణలను రాజకీయకారణాలను లక్ష్యం చేసుకుని చేయబడుతున్నాయని త్రోసిపుచ్చుతుంది.[9]
ప్రభుత్వం, అధ్యక్షుడు ఇసాయాస్ అఫ్యూర్కీ ప్రజాస్వామ్య చర్చల కొరకు పిలుపునిచ్చిన తరువాత బహిరంగ లేఖను ప్రచురించిన తరువాత 2001 సెప్టెంబరులో మూడు కేబిను సభ్యులతో సహా జి-15 అని పిలిచే ఒక 15 మంది ఎరిత్రియన్ల సమూహం ఖైదు చేయబడ్డారు. ఈ బృందం, వారితో అనుబంధంగా వేలాది మంది ఇతరులు ప్రభుత్వవ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చట్టపరమైన ఆరోపణలు, విచారణ, తీర్పు లేకుండా వీరు ఖైదు చేయబడ్డారు.[103][104]
1998-2001లో ఇథియోపియాతో ఎరిత్రియా వివాదం తరువాత ఐక్యరాజ్యసమితిలో దేశ మానవ హక్కుల రికార్డు విమర్శించబడింది.[105] మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు తరచుగా ప్రభుత్వం లేదా ప్రభుత్వం తరపున జరుగుతున్నాయని ఆరోపించబడుతుంది. ప్రసంగం, ప్రెసు, అసెంబ్లీ, సంఘం స్వేచ్ఛ పరిమితం. "నమోదుకాని" మతాన్ని ఆచరించే వారు దేశం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. లేదా సైనిక విధి నుంచి తప్పించుకుంటారు, ఖైదు చేయబడతారు.[105] ఎరిట్రియా స్వాతంత్ర్య పోరాటంలో, 1998 ఎరిత్రియా- ఇథియోపియా యుద్ధ సమయంలో నిరాయుధ ఎరిత్రియా పౌరులకు వ్యతిరేకంగా ఎథియోపియా అధికారులు అనేక అమానుష్యచర్యలకు పాల్పడ్డారు.[106][107]
2016 జూన్ లో 500 పేజీలు కలిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నివేదిక ఎరిత్రియా అధికార శిక్షలు, హింస, నిర్భంధ సుదీర్ఘమైన జాతీయ సేవ, నిర్బంధిత కార్మికవిధానం వంటి చర్యలకు ప్రభుత్వాన్ని నిందించింది. అధికారుల లైంగిక వేధింపు, అత్యాచారం, లైంగిక సేవాగ్రహణ అత్యధికంగా ఉందని సూచించారు.[108][109] మానవ హక్కులమీద ఐరోపా పార్లమెంటు సబ్ కమిటీ ఆన్ హ్యూమన్ రైట్సు " బార్బరా లోచ్బిహలరు ఈ నివేదికను చాలా తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలుగా వివరించాడు. ఎరిట్రియాలో మార్పు లేకుంటే అభివృద్ధి కోసం ఐరోపాసమాఖ్య నిధులు కొనసాగవని పేర్కొన్నాడు.[110] ఎరిత్రియా విదేశాంగ మంత్రిత్వశాఖ కమిషను నివేదిక వీటిని "క్రూరమైన ఆరోపణలు"గా వర్ణించింది. ఇవి "పూర్తిగా అంబద్ధమైనవని " త్రోసిపుచ్చింది.[111] అనేక దేశాలు నివేదిక భాష, కచ్చితత్వాన్ని గురించి వాదించారు. వీటిలో యు.ఎస్, చైనా కూడా ఉన్నాయి.[112]
18, 40 సంవత్సరాల మధ్య వయస్సున్న ఎరిత్రియన్లు నిర్భంధంగా జాతీయ సేవను పూర్తి చేయాలి. ఇథియోపియా నుండి స్వాతంత్ర్యం పొందిన ఎరిత్రియా సార్వభౌమత్వాన్ని కాపాడటానికి జాతీయ భావాన్ని కలుగజేయడానికి ప్రజలలో క్రమశిక్షణా సృష్టించటానికి ఒక సాధనంగా ఎరిత్రియాలో ఇది అమలుచేయబడింది.[10] ఎరిత్రియా జాతీయ సేవావిభాగం దీర్ఘకాలం నిర్భంధ సైనిక శిక్షణ కోరుతుంది. దీని నుండి తప్పించుకోవడానికి కొంతమంది దేశం వదిలిపోతున్నారు.[10][113][114]
సంస్కరణల ప్రయత్నంలో 2006 లో ఎరిత్రియా ప్రభుత్వ అధికారులు, ఎన్జిఓ ప్రతినిధులు అనేక ప్రజా సమావేశాలు, చర్చలలో పాల్గొన్నారు. ఈ సమావేశాలలో వారు "మానవ హక్కులు ఏమిటి?", "మానవ హక్కులు ఏది నిర్ణయిస్తుంది?", " మానవ, మత హక్కులు ఏవి?" మొదలైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి.[115] 2007 లో ఎరిత్రియా ప్రభుత్వం అలాగే స్త్రీలలో సత్నా ఆచారం నిషేధించారు.[116] ప్రాంతీయ అసెంబ్లీలలో, మతపరమైన వర్గాలలో, ఎరిత్రియన్లు స్త్రీ సున్తీ ఆచారానికి వ్యతిరేకంగా నిరంతరాయంగా వాదించారు. వారు చెప్పేటప్పుడు ఆరోగ్య సమస్యలపట్ల ఆందోళనలు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం, ప్రాథమిక ఆందోళనగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ పురాతన సాంస్కృతిక అభ్యాసాన్ని తొలగించడానికి వారు గ్రామీణ ప్రజలను వేడుకున్నారు.[117] 2009 లో ఎరిత్రియాలో పౌరుల ప్రజాస్వామ్య హక్కుల అనే ఉద్యమం ప్రభుత్వం, రాజకీయ ప్రతిపక్షాల మధ్య వివాదాలను సృష్టించింది. ఈ సమూహం కొంతమంది సాధారణ పౌరులు మద్ధతుగా ఉండగా, కొంతమంది ప్రభుత్వానికి మద్ధతుగా నిలిచారు.[118]
2017 ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్సులో రిపోర్టర్సు వితౌట్ బార్డర్సులో 180 దేశాలలో ఎరిత్రియా మద్యస్థానంలో ఉందని మీడియా వాతావరణాన్ని పేర్కొంది.[119] బి.బి.సి. "ప్రైవేటు యాజమాన్యంలోని న్యూసు మాధ్యమం లేని దేశము ఎరిత్రియా మాత్రమే" అని పేర్కొన్నది.[120] రిపోర్టర్సు వితౌటు బోర్డర్సు ప్రజా ప్రసార మాధ్యమాల గురించి ఇలా చెప్పింది, "వారు ఏమీ చేయరు " [121] ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తా సంస్థ బాహ్య సంఘటనల గురించి సెన్సారు చేసిన వార్తలను ప్రచురించింది.[122] 2001 నుండి ఇండిపెండెంటు మీడియా నిషేధించబడింది.[122] ఎరిత్రియా అధికారులు టర్కీ, చైనా, ఈజిప్టు తరువాత నాల్గవ అత్యధిక సంఖ్యలో పాత్రికేయులను ఖైదు చేశారు. [123]
ఎరిత్రియా ఆరోగ్య సంరక్షణలో గణనీయమైన మెరుగుదలలు సాధించింది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం కోసం మిలీనియం డెవెలప్మెంటు గోల్సు (ఎం.డి.జి) ను సాధించిన కొన్ని దేశాలలో ఇది ఒకటి.[124] 1960 లో ఆయుఃప్రమాణం 39.1 సంవత్సరాల ఉండగా 2008 లో 59.5 సంవత్సరాలు అధికరించింది. ప్రసూతి, పిల్లల మరణాల శాతం నాటకీయంగా పడిపోయింది, ఆరోగ్య సదుపాయాన్ని విస్తరించింది.[124] ఎరిట్రియా ఒంటరితనం కారణంగా సమాచారం, వనరులు చాలా పరిమితంగా ఉన్నాయి. 2008 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆయుఃపరిమితి 63 సంవత్సరాల కంటే కొద్దిగా తక్కువగా ఉందని అంచనా. రోగ నిరోధకత, పిల్లల పోషకాహారం అనేక రంగాల పద్ధతులలో పాఠశాలలతో కలిసి పనిచేయడం ద్వారా పరిష్కరించబడింది. టీకాలు వేయబడిన 7 సంవత్సరాల లోపు పిల్లల సంఖ్య దాదాపు రెండింతలు (40.7% నుండి 78.5%) అయింది. బరువుతక్కువ ఉన్న పిల్లలు 1995 నుంచి 2002 వరకు 12% తగ్గింది. (28% ఉండేది).[124] ఆరోగ్యం మంత్రిత్వశాఖ " నేషనలు మలేరియా ప్రొటెక్షను యూనిటు మలేరియా మరణాల శాతం 85% తగ్గింది. 1998- 2006 మధ్య 92% తగ్గింది.[124] ఎరిత్రియా ప్రభుత్వం మహిళల సత్నాను నిషేధించింది. ఆ అభ్యాసం బాధాకరమైనదిగా ఉందని, మహిళలు ప్రాణహాని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నది.[125]
ఎరిత్రియా ఇప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వైద్యుల సంఖ్య 1993 లో కేవలం 0.2 కి అధికరించింది. 2004 నాటికి 1000 మందికి 0.5 కు అధికరించింది. ఇది ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది.[124] మలేరియా, క్షయవ్యాధి సాధారణంగా ఉంటాయి.[126] 15 నుండి 49 ఏళ్ళ మద్య హెచ్.ఐ.వి. వ్యాప్తి 2% కన్నా అధికం.[126] సంతానోత్పత్తి రేటు మహిళకు 5 జననాలు.[126] తల్లి మరణాలు 1995 నుంచి 2002 వరకు సగానికి పైగా పడిపోయాయి. కానీ ఇప్పటికీ ఎక్కువగా ఉంది.[124] అదేవిధంగా 1995 నుండి 2002 వరకు నైపుణ్యం కలిగిన ఆరోగ్య సిబ్బంది హాజరైన జననాల సంఖ్య రెట్టింపై 28.3% ఉంది.[124] నవజాత శిశువులలో మరణానికి తీవ్రమైన వ్యాధి ప్రధాన కారణంగా ఉంది. [126] ఆరోగ్యంపై తలసరి వ్యయం తక్కువగా ఉంది.[126]
ఎరిత్రియాలో విద్య స్థాయి: ప్రాథమిక, మాధ్యమిక, ద్వితీయ, ద్వితీయ-తరువాత. ప్రాథమిక, మధ్య, ద్వితీయ శ్రేణి విద్యలలో దాదాపు 2,38,000 మంది విద్యార్థులు ఉన్నారు. సుమారు 824 పాఠశాలలు.[127] రెండు విశ్వవిద్యాలయాలు (అస్మారా విశ్వవిద్యాలయం, ఎరిత్రియా ఇన్స్టిట్యూటు ఆఫ్ టెక్నాలజీ), అనేక చిన్న కళాశాలలు, సాంకేతిక పాఠశాలలు ఉన్నాయి.
ఎరిత్రియాలో విద్య 7 నుంచి 13 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు అధికారికంగా నిర్బంధవిద్య అమలులో ఉంది. అయితే ప్రస్తుత అవసరాలకు విద్యా మౌలికసౌకర్యాలు సరిపడినంతగా లేదు. ప్రాథమిక స్థాయిలో గణాంకాలు వేర్వేరుగా ఉంటాయి. పాఠశాల వయస్కులైన పిల్లల్లో 65% నుంచి 70% ప్రాథమిక పాఠశాలకు హాజరవుతుందని సూచిస్తున్నారు. సుమారు 61% సెకండరీ స్కూళ్ళలో చేరారు. విద్యార్థి-గురువు నిష్పత్తులు ఎక్కువగా ఉన్నాయి: ప్రాథమిక స్థాయిలో 45: 1, ద్వితీయ స్థాయిలో 54: 1. ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయిలలో క్లాస్‌కు సగటు పరిమాణాలు 63 - 97 విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో అధ్యయన సమయం రోజుకు 6 గంటల కంటే తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ అక్షరాస్యత శాతం అధికంగా ఉంది: 18 నుంచి 24 ఏళ్ల వరకు పురుషులలో 92.6%, మహిళలలో 87.7% (2008-2012) [128] మొత్తం అక్షరాస్యత 81%.[129] ఎరిత్రియాలో విద్యకాభివృద్ధికి సాంప్రదాయ నిషేధాలు, పాఠశాల ఫీజు (రిజిస్ట్రేషను, సామగ్రి కోసం), తక్కువ-ఆదాయం కలిగిన కుటుంబాల నిత్యావసర ఖర్చులు అడ్డంకులుగా ఉన్నాయని భావిస్తున్నారు.
ఎరిత్రియ సంస్కృతి అత్యంత గుర్తించదగిన భాగాలలో ఒకటి కాఫీ వేడుక.[131]
కాఫీ స్నేహితులను సందర్శించేటప్పుడు, సంబరాలలో, రోజువారీ ప్రాపంచిక జీవితంలో మర్యాదపూర్వకంగా అతిథులకు ఇవ్వబడుతుంది. కాఫీ వేడుకలో ఆచరించే సంప్రదాయాలు ఉన్నాయి. మూడు రౌండ్లలో ఈ కాఫీ సేవలు అందిస్తారు: మొదటి రౌడును టిగ్రిన్య భాషలో అవెలు ("మొదటి" అని అర్ధం) అని పిలుస్తారు. రెండో రౌడును కలే (అంటే "రెండవది") అని పిలుస్తారు, మూడవ రౌండును బేర్కా (అంటే " ఆశీర్వదించబడిన ") అంటారు.
సాంప్రదాయ ఎరిత్రియా వస్త్రధారణ ఎరిత్రియాయా జాతి సమూహాల మధ్య మారుతూ ఉంటుంది. పెద్ద నగరాల్లో ఎక్కువమంది పాశ్చాత్య వస్త్రధారణ చేయడం సాధారణం దుస్తులలో జీన్సు, చొక్కాల దుస్తులు ధరిస్తారు. కార్యాలయాల్లో పురుషులు, మహిళలు తరచుగా సూట్లను ధరించారు. క్రైస్తవ టిగ్రయ్యా పర్వతారోహకులకు ఒక సాధారణ సాంప్రదాయిక దుస్తులలో మహిళలకు జురియాసు అనే తెల్లని గౌన్లు, పురుషుల కోసం తెల్లని ప్యాంటుతో తెల్లని చొక్కాను ధరిస్తారు. ఎరిత్రియా లోతట్టు ప్రాంతాలలో ముస్లిం సమాజాలలో మహిళలు సాంప్రదాయకంగా ముదురు రంగు దుస్తులు ధరిస్తారు. హార్ను ప్రాంతంలో అసంఖ్యాక పాక రుచిలతో, ఎరిత్రియన్లు ఒకే సంగీతం, సాహిత్యం, నగలు, పరిమళాలు, వస్త్రాలు ప్రశంసలను అందుకుంటాయి.[132]
ఒక సంప్రదాయ ఎరిత్రియా వంటకం ఇంజెరా కారమైన మసాలాలతో కూడిన స్ట్యూ కలిపి వడ్డించబడుతూ ఉంటుంది. స్ట్యూ తరచుగా గొడ్డు మాంసం, కోడి, గొర్రె, చేపలతో చేయబడుతూ ఉంటుంది.[133] మొత్తంమీద, ఎరిత్రియా వంటలు పొరుగున ఉన్న ఇథియోపియా[133][134]ను పోలివుంటాయి. ఎరిత్రియా వంట వారి తీర ప్రదేశంలో ఇథియోపియన్ వంటకాల కంటే ఎక్కువ సముద్రపు ఆహారాన్ని కలిగి ఉంటాయి.[133] ఇథియోపియా భోజనాల కంటే ఎరిత్రియా వంటకాలు కూడా "తేలికైనవి"గా ఉంటాయి. వారు కూడా తక్కువగా సీజనింగు చేర్చిన వెన్న, సుగంధ ద్రవ్యాలు, మరిన్ని టమోటోలను ఉపయోగించుకుంటారు.
అదనంగా దాని వలస చరిత్ర కారణంగా ఎరిత్రియాలో వంటలు ఇథియోపియా వంట కంటే అధికంగా ఇటాలియా ప్రభావాలను కలిగి ఉన్నాయి. ఇందులో అధికంగా పాస్తా, కూర పోడులు, జీలకర్ర వాడబడుతుంటాయి. ఇటాలియా ఎరిట్రియా సామ్రాజ్యం కాలనీల కాలంలో ఆడ్ఃఈఖాశాంఖ్యలో ఇటాలియన్లు ఎరిత్రియాకు తరలివెళ్లారు. వారు "పాస్తా"ను ఇటాలియా ఎరిట్రియాకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అస్మారాలో ఇది ప్రధాన ఆహారంగా ఉంది. ఫలితంగా ఇటాలియా ఎరిత్రియా వంటకాలు ఉద్భవించాయి. "పాస్తా అల్ సుగో ఇ బెర్బెర్" వంటకాలు అంటే "టమోటా సాసు, బెర్బెర్తో పాస్తా" (స్పైసు) అంటే "లాసాగ్నా", "కోటోలెట్టా అల్లా మిలనీసు" (మిలనో కట్లెటు).[135] సోవాతో ఎరిత్రియాలోని ప్రజలు కాఫీని కూడా త్రాగుతుంటారు.[133] మియ్సు తేనీరుతో తయారైన మరొక ప్రసిద్ధ స్థానిక మద్య పానీయం ఎరిత్రియా ప్రజలు సేవిస్తుంటారు.[136]
ఎరిత్రియా జాతి సమూహాలలో ఒక్కొక్క జాతికి ఒక్కొక స్వంత సంగీత శైలులతో నృత్యాలు ఉన్నాయి. టిగ్రిన్యాలో గైనాలా అనే అత్యుత్తమ సాంప్రదాయిక సంగీత శైలి ఉంది. ఎరిత్రియా జానపద సంప్రదాయ సంగీత వాయిద్యాలలో స్ట్రింగ్డు క్రారు, కేబెరొ, బిగెనా, మాసెంగో, వాటా (వయోలిను వాయిధ్యానికిసుదూర బంధువు) ప్రాధాన్యత వహిస్తున్నాయి. హెలెను మెలెసు ఒక ప్రముఖ ఎరిత్రియా కళాకారుడు టిగ్రిన్యా గాయకురాలు. ఆమె శక్తివంతమైన గాత్రం, గానం ప్రసిద్ధి చెందింది.[137] ఇతర స్థానిక సంగీత విద్వాంసులు కునామా గాయకుడు డెహబు ఫయింటా, రూతు అబ్రహ, బెరెకేటు మెంగిస్టేబు, గతించిన యమనే ఘెబ్రెమిక ప్రాముఖ్యత సంతరించుకున్నారు.
ఎరిత్రియాలో ఫుట్బాలు, సైక్లింగు అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలుగా ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో ఎరిత్రియా అథ్లెట్లు కూడా అంతర్జాతీయ వేదికపై విజయం సాధించారు. ఎరిత్రియా అథ్లెట్లు జెర్సెను టాడేసు గతంలో సగం మారథానులో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.[138] ఎరిత్రియా టూరు, ఒక మల్టీ-స్టేటు ఇంటర్నేషనలు సైక్లింగు ఈవెంటు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఎరిత్రియా జాతీయ సైక్లింగు బృందం వరుసగా అనేక సంవత్సరాలు ఖండాంతర సైక్లింగు చాంపియనుషిప్పును గెలుచుకుంది. అంతర్జాతీయ సైక్లింగు జట్లకు ఆరు ఎరిత్రియా రైడర్లు సంతకం చేసారు. వారిలో నట్నెలు బెర్హానె, డేనియలు టేక్లీహైమానోటు ఉన్నారు. బెర్హానే 2013 లో ఆఫ్రికా క్రీడాకారుడిగా ఎంపికయ్యాడు. 2012 లో టెలెహైమానాటు వోలెటా ఎ ఎస్పానాను నడిపిన మొట్టమొదటి ఎరిట్రియా క్రీడాకారుడు అయ్యాడు.[139] 2015 లో టెక్టహైమానాటు క్రిట్రీయం డు దూపినులో " కింగ్ ఆఫ్ మౌంటెనియసు క్లాసిఫికేషను " గెలిచాడు. టెక్కీహైమానాటు, సహ ఎరిత్రియా క్రీడాకారుడు మెర్వావి కుడసు టూరు డి ఫ్రాంసులో పోటీపడే మొదటి నల్లజాతి సైక్లిస్టులుగా పేరు గాంచాడు.[140] జూలైలో " టూర్ డి ఫ్రాంసు "లో పోల్కా డాటు జెర్సీను ధరించే ఆఫ్రికా బృందం నుంచి వచ్చిన మొదటి రైడరుగా కూడా టెక్కెహైనానాటు ప్రత్యేకత సంతరించుకున్నాడు.[141] పురుషులు, మహిళల ఎరిత్రియా నేషనలు సైక్లింగు జట్లు ఖండంలో మొదటి స్థానంలో ఉన్నాయి. 2013 లో మహిళల జట్టు మొట్టమొదటిసారిగా " ఆఫ్రికా కాంటినెంటలు సైక్లింగు ఛాంపియషిప్పు "లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. 2015 లో రెండవ సారి గెలుచుకుంది.[142][143][144]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.