ఎన్‌.ఆర్‌. నంది (నంది నూకరాజు) ప్రముఖ సాహితీవేత్త, కథ, నవల, నాటక రచయిత. ప్రవాసాంధ్ర నాటక కళాపరిషత్తు వ్యవస్థాపకుడు.[1]

త్వరిత వాస్తవాలు ఎన్.ఆర్.నంది, జననం ...
ఎన్.ఆర్.నంది
Thumb
ఎన్.ఆర్.నంది
జననంఎన్.ఆర్.నంది
1933
రాజమండ్రి
మరణంఆగష్టు 4, 2002
హైదరాబాదు, తెలంగాణ
ప్రసిద్ధికథ, నవల, నాటక రచయిత, సినిమా రచయిత
మతంహిందూ మతము
మూసివేయి

బాల్యం

ఎన్.ఆర్.నంది 1933లో రాజమండ్రిలో జన్మించారు.

రచనలు

1948లో రచయితగా కలం పట్టిన నంది దాదాపు 200 కథలు, 25 నవలలు రాశారు. కొన్ని నాటకాలు, నాటికలు రాశారు. 'పుణ్యస్థలి' నాటిక రచనతో నాటకరచయిత గా శ్రీకారం చుట్టిననంది 'మరోమొహంజోదారో','ఆరణి' నాటకాలను,'వానవెలిసింది', 'మనిషి చావకూడదు'నాటికలను రచించారు.ఔత్సాహిక నాటకరంగంలోలబ్దప్రతిష్ఠుడైన నాటకరచయితగా, పేరు తెచ్చుకున్నారు. దాదాపు 20 సినిమాలకు రచయితగా పనిచేశారు. సుడిగుండాలు, తాసిల్దారుగారి అమ్మాయి, నోము, పున్నమినాగు వంటి సినిమాలకు ఆయన పనిచేశారు.

'మరోమొహంజోదారో' ఐతిహాసిక (ఎపిక్ థియేటర్), నాటక విధానంతో రాసిన మొదటి నాటకం. మెలోడ్రామాను నియంత్రిస్తూ,రంగస్థల పరికరాలు అవసరంలేకుండాకే వలం నీలి తెరలతోనే ప్రద‍ర్శించగల సౌలభ్యం గల ఈ నాటకం రంగస్థల చరిత్రలో సంచలన కలిగించింది. ప్రదర్శనాపరంగా 'ఫ్రీజ్' టెక్నిక్ (బొమ్మల్లా నిశ్చేష్ఠులై నిలబడి పోవడం) అనే నూతన పద్ధతి ఈ నాటకంతోనే ప్రారంభమైంది. వందల సార్లు, పలుచోట్ల ప్రదర్శింపబడి,వివిధ భాషల్లోకి అనువదింపబడింది. ఈ నాటకం తెలుగు నాటకరంగ కీర్తినినేల నాలుగు చెరగులా విస్తరింపజేసింది.

పుస్తకాలు

  • బ్రహ్మముడి
  • నైమిశారణ్యం
  • దృష్టి
  • సిగ్గు సిగ్గు
  • గుడ్‌బై భూదేవి గుడ్‌బై
  • కాంచనగంగ
  • సినీ జనారణ్యం
  • మేడం సీతాదేవి
  • విశ్వచైతన్య
  • సీత
  • హలోడాక్టర్
  • స్మృతులు
  • ఛార్లెస్ ఛార్లెస్
  • తిరపతి
  • అరణి (నాటకం)
  • పుణ్యస్థలి (నాటిక)
  • దిగిరండి దిగిరండి ధృతరాష్ట్రభువికి
  • మరోమొహంజదారో (నాటకం)[2]
  • ఎలకలోస్తున్నాయ్ జాగ్రత్త
  • కీలుబొమ్మలు
  • ఎన్.ఆర్.నంది నాటకాలు, నాటికలు

కథల జాబితా

కథానిలయం[3]లో లభ్యమౌతున్న ఎన్.ఆర్.నంది కథల జాబితా:

  • అంతరం
  • అంతరాంతరాలు
  • అంతర్లీనం
  • అందని లోతులు
  • అక్కయ్య
  • అగుపించని అంకుశాలు
  • అగ్యానం తిరగబడింది
  • అనామకుడు
  • అన్నాచెల్లెలు
  • అపశృతులు
  • అభిమానం
  • అభిహారం
  • అమావేశ్య
  • ఆరాధన
  • ఇండియా దటీజ్ భారత్
  • ఉన్నతేడా
  • ఎక్-స్ట్రా
  • ఎమిలీ
  • ఎవరికోసం
  • ఏకోదరుడు
  • ఏవిఁటయ్యా నీ గొడవ
  • ఒరే దేవుడూ! నువ్వు యెదవన్నర యెదవ్విరా?
  • కన్నీరువిడువడానికి ఒకథ
  • కూలిన గాలిమేడలు
  • కృతజ్ఞత
  • కౌటిల్యం
  • గంగ కోరిన కోర్కె
  • గజదొంగ వీరన్న
  • గాంధీలు ఇక మరణించరు
  • గాలిలోదీపం
  • చిట్టిబాబు చిల్లిబుగ్గలు
  • చిరునామా నీ చరిత విలువెంత ?
  • చెంచాగిరి
  • జండా ఊంఛా రహేహమారా
  • డబ్బుయిచ్చే సంస్కారం
  • తప్పు
  • తిండి
  • తిప్పలు
  • తెల్లవారని...
  • థేంక్యూ డియర్ థేంక్యూ
  • దటీజ్ భారత్
  • దిగిరండి...
  • దీన బంధు
  • దేశానికి యాక్సిడెంట్
  • ద్వేషం
  • నిజాయితీ! ఎక్కడ ఇమిడిపోయావ్ తల్లీ!
  • నిరుద్యోగం
  • పంచుకోలేని ప్రేమలు
  • పగటికలల్లో సాహచర్యం
  • పత్రికిచ్చిన పారితోషికం (నాటిక)
  • పలకరించని ప్రకృతి
  • పవిత్ర భారతం
  • పూజ్యబ్రాందీజీ
  • పెరిస్త్రోయికా
  • పెళ్ళిచూపులు
  • పోయిన మర్యాద
  • బదనిక
  • బెల్స్ రిబెల్స్
  • బోలు మనుషులు
  • మంజిష్ఠ
  • మనసుకు తిండి
  • మరచిన జ్ఞాపకాలు
  • మానినీ మానసం
  • ముఖ్యమంత్రి కనబడుటలేదు
  • ముసలమ్మ మరణం
  • మూగజీవి
  • మూగవోయిన...
  • మైలురాళ్లు
  • రక్తబిందువులు
  • రాగిణి దీదీ
  • విక్రమూర్ఖుడు
  • విలువలేని అనుభవాలు
  • విశ్వామిత్రులు
  • వేట్ సిక్స్టీ నైన్
  • వేణి కిల్లర్
  • వ్యోమగానయానం
  • వ్వాట్!వాలి సుగ్రీవులు తెలుగువారా?
  • శిలాద్రవం
  • సంతాప'సందేశం'
  • సాంప్రదాయం
  • సినీ వైకుంటపాళీ
  • సివిల్వార్
  • సెక్యులర్ అడవి

సత్కారాలు, అవార్డులు

  • ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు, నంది పురస్కారాలు ఆయనను వరించాయి.
  • ఎన్‌.ఆర్‌. నంది రాసిన మరో మొహెంజొదారో నాటకానిది విశిష్టమైన స్థానం. ఈ నాటకం 19 భాషల్లోకి అనువాదమైంది. దేశంలో దాదాపు పదివేల ప్రదర్శనలకు నోచుకుంది.

మరణం

2002, ఆగస్టు 4 ఆదివారం హైదరాబాదు లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.[4]

బయటి లంకెలు

మూలాలు

ఇతర లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.