ఇనవాషిరో సరస్సు
From Wikipedia, the free encyclopedia
ఇనవాషిరో సరస్సు (猪苗代湖 Inawashiro-ko) జపాన్ లోని నాలుగవ అతి పెద్ద సరస్సు.[1] మూడవ అతి పెద్ద మంచినీటి సరస్సు.[2] 105 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించివున్న ఈ సరస్సు హోన్షు దీవిలోని ఫుకుషిమా ప్రాదేశిక భూభాగం మధ్యభాగంలో బందాయ్ అగ్నిపర్వతానికి దక్షిణంగా ఉంది. స్వచ్ఛమైన దీని జలాల పారదర్శకత కారణంగా ఈ సరస్సును దివ్య అద్దం (Heavenly Mirror Lake) గా పిలుస్తారు. ఈ సరస్సు జలాలు కొద్దిగా ఆమ్ల (acidic) ధర్మాన్ని కలిగివుంటాయి. ప్రముఖ విహార పర్యాటక ప్రదేశమైన ఈ సరస్సు సంవత్సరం పొడుగునా సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది.
త్వరిత వాస్తవాలు ఇనవాషిరో సరస్సు 猪苗代湖, ప్రదేశం ...
ఇనవాషిరో సరస్సు 猪苗代湖 | |
---|---|
ప్రదేశం | ఫుకుషిమా ప్రాదేశిక భూభాగం |
అక్షాంశ,రేఖాంశాలు | 37°28′29″N 140°05′37″E |
రకం | టెక్టోనిక్ సరస్సు |
సరస్సులోకి ప్రవాహం | నగాసె నది |
వెలుపలికి ప్రవాహం | నిప్పాషి నది |
పరీవాహక విస్తీర్ణం | 711 కి.మీ2 (275 చ. మై.) |
ప్రవహించే దేశాలు | జపాన్ |
ఉపరితల వైశాల్యం | 103.3 కి.మీ2 (39.9 చ. మై.) |
సరాసరి లోతు | 51.5 మీ. (169 అ.) |
గరిష్ట లోతు | 94.6 మీ. (310 అ.) |
5.40 కి.మీ3 (4,380,000 acre⋅ft) | |
తీరంపొడవు1 | 49 కి.మీ. (30 మై.) |
ఉపరితల ఎత్తు | 514 మీ. (1,686 అ.) |
ద్వీపములు | Okinajima |
1 Shore length is not a well-defined measure. |
మూసివేయి