ఇత్తడి (Brass) ఒక మిశ్రమ లోహము. దీనిలో ముఖ్యంగా రాగి, జింకు ఉంటాయి. ఇత్తడి లోహమును ముద్దలుగా మార్చి దానినుండి పలుచటి రేకులుగా మార్చి తదుపరి వస్తువుల తయారీ కొరకు ఉపయోగిస్తారు. ఇత్తడి వాడుకలో భారతదేశము, ఆసియా దేశాలు ముందున్నాయి. ఈ దేశాలలో నిత్యము వాడు వస్తువులతో పాటుగా దేవాలయాలలో దీని వినియోగం అధికం
రాగి, జింకు/యశదం లోహాలను మిశ్రం చేసి బట్టి పెట్టి రెండింటిని ద్రవీకరించి సమ్మేళనము చెయ్యడం వలన ఈరెండింటి మిశ్రమ ధాతువు ఇత్తడి ఏర్పడుతుంది. ఇత్తడిలో జింకు శాతం 37 నుండి 45 % వరకు ఉంటుంది[1].ఇత్తడికి కొంచెం దృఢత్వం, సులభంగా తరణి పట్టునట్టు చేయుటకై సీసాన్ని స్వల్ప ప్రమాణంలో కలుపుతారు.రాగిలో 37 % వరకు జింకును కలిపినప్పుడు ఒకేదశలో చేత/దుక్క విధానంలో చేయుదురు. ఒకేదశలో పోత పోసిన లోహానికి పలకలుగా సాగేగుణం అధికంగా ఉంటుంది.రాగిలో 37 % కన్న ఎక్కువ ప్రమాణంలో జింకును కలిపి తయారుచేయవలసిన దానిని రెండంచల పద్ధతిలోచేయుదురు.రెండంచల విధానంలో ఉత్పత్తి చేసిన ఇత్తడికి దృఢత్వం ఎక్కువ ఉంటుంది, కాని సాగే గుణం తక్కువ. రెండంచల పద్ధతిలో ఇత్తడిని పోత విధానము (cast ing) పద్ధతిలో తయారు చేయుదురు.
ఇత్తడినిగృహ నిర్మాణ అవసరాలకు వాడెదరు..పాత్రలను పాత్ర భాగాలను తయారు చేయుటకు వాడెదరు.తలుపు గడియలు, ప్లగ్గులు, విద్యుత్ ఉపకరణాలు, తాళాలు, పంపులకు లోపలి భాగాలు, బోల్టులు, నట్టులు, ల్యాంప్ ఫిట్టింగులు, రేడియేటర్ అంతర్భాగాలు చేయుటకు ఉపయోగిస్తారు.సాధారణంగా ఇత్తడిని రెండు రకాలుగా విభజింప/వర్గికరించ వచ్చును.[2]
రాట్ (దుక్క) పద్ధతిలో చేసిన ఇత్తడిని 3 వర్గాలుగా వర్గించవచ్చును.
పోత విధానం (casting ) లో ఉత్పత్తి చేసిన ఇత్తడిని స్తూలంగా 4 రకాలుగా వర్గీకరించవచ్చును.
రాగిలో జింకులో వివిధ నిష్పత్తిలో కలుపగా ఏర్పడిన ఇత్తడిమిశ్రమ ధాతువుకు వాడుకలో వివిధ పేర్లుకలవు.అలా వివిధ వాడుక పేర్లు ఉన్న కొన్ని ఇత్తడి మిశ్రమ ధాతువులు వాటిలో కలుపబడిన జింకు లేదా ఇతర లోహాల నిష్పత్తి పట్టికను దిగువన ఇవ్వడమైనది[3]
వాడుకపేరు | మిశ్రమ నిష్పత్తి |
పసుపురంగు ఇత్తడి | 33 %జింకు ఉన్నమిశ్రమ ధాతువు (అమెరికాలో ) |
తెల్ల ఇత్తడి | 50 % మించి జింకు కలుపబడింది.పెళుసుగా వుండును. రాగి +జింకు+తగరం, రాగి+నికెల్ మిశ్రమ ధాతువును కూడా తెల్ల ఇత్తడి అంటారు |
ఎర్ర ఇత్తడి | ఇందులో రాగి 8 5 %, తగరం 5 %, సీసం 5 %, జింకు 5% కలుపబడి ఉండును |
నికెల్ ఇత్తడి | రాగి 70 %, +జింకు 24 .5 %+5.5%నికెల్, నాణెములతయారిలో వాడెదరు. |
TOM BAC ఇత్తడి | 15 % జింకు కలుపబడి ఉండును .ఆభరణాల తయారీలో వాడెదరు . |
నోర్డిక్ గోల్డ్ | రాగి 8 9%, జింకు 5 %, అల్యూమినియం 5%, తగరం 1%, యూరో నాణేల తయారీలో ఉపయోగిస్తారు. |
నావల్ ఇత్తడి | ఇందులో 40 % జింకు, 1 % తగరం, మిగిలినది రాగి |
మాంగనీస్ ఇత్తడి | రాగి 70, జింకు 29 % వరకు, మాంగనీస్ 1.3 % వరకు మిశ్రమం చెయ్యబడి ఉండును. |
అల్ఫా ఇత్తడి | 35 % కన్న తక్కువ నిష్పత్తిలో జింకు కలుపబడి ఉండును. |
సాధారణ ఇత్తడి | 37 % జింకు కలుపబడి ఉండును, దీనిని రివెట్ ఇత్తడి అనికూడా అంటారు . |
గిల్దింగు లోహం | 95 % రాగి, 5 % జింకు కలిగిన మిశ్రమ ధాతువు మందు గుండుల వెలుపలి కవచాలు తయారు చేయుదురు. |
cartrige ఇత్తడి | 30% జింకు కలుపబడి ఉంది. |
వస్తువుల తయారీ కొరకు ఇత్తడి రేకులను కాల్చి సుత్తులతో మోదుతూ వెదలుచేసుకుంటూ కావలసిన ఆకారానికి మార్చి వాటిని అతికించి ఫాలీష్ చేసి అమ్ముతారు.
నిత్యావసర వస్తువులు, తయారీ
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.