ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నేమ్ ఐడెంటిఫయర్
From Wikipedia, the free encyclopedia
ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నేమ్ ఐడెంటిఫైయర్ ( ISNI ) అనేది పుస్తకాలు, టెలివిజన్ ప్రోగ్రామ్‌లు, వార్తాపత్రిక కథనాల వంటి మీడియా సమాచారాన్ని సమర్పించే పబ్లిక్ ఐడెంటిటీలను ప్రత్యేకంగా గుర్తించడానికి ఏర్పాటు చేసిన ఐడెంటిఫైయర్ వ్యవస్థ. ఈ ఐడెంటిఫైయరులో 16 అంకెలుంటాయి. నాలుగు నాలుగు అంకెల చొప్పున ఒక బ్లాకుగా చేసి, నాలుగు బ్లాకులుగా ప్రదర్శిస్తారు. అయితే ఈ పద్ధతి ఐచ్ఛికమే, ఖాళీలు లేకుండా కూడా చూపవచ్చు.
పొడి పేరు | ISNI |
---|---|
ప్రవేశపెట్టిన తేదీ | మార్చి 15, 2012 (2012-03-15) |
నిర్వహించే సంస్థ | ISNI-IA |
అంకెల సంఖ్య | 16 |
చెక్ డిజిట్ | MOD 11-2 |
ఉదాహరణ | 000000012146438X |
అయోమయానికి గురిచేసేలా ఒకేలాంటి పేరున్న అంశాలను స్పష్టపరచడానికి ISNIని ఉపయోగించవచ్చు. మీడియా పరిశ్రమలలోని అన్ని రంగాలలో సేకరించిన, ఉపయోగించిన పేర్లకు సంబంధించిన డేటాను అనుసంధానం చేస్తుంది.
దీన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ISO) ఆధ్వర్యంలో డ్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ 27729 గా అభివృద్ధి చేసారు; ఈ ప్రమాణాన్ని 2012 మార్చి 15 న ప్రచురించారు. ISO సాంకేతిక కమిటీ 46, సబ్‌కమిటీ 9 ( TC 46/SC 9 ) ఈ ప్రమాణం అభివృద్ధికి బాధ్యత వహిస్తోంది.