మొక్కల జాతులు From Wikipedia, the free encyclopedia
ఆవాలు ముఖ్యమైన మసాలా దినుసులలో ఒకటి.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆవాలు | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | బ్రా. నైగ్రా |
Binomial name | |
బ్రాసికా నైగ్రా | |
Brassica spp . పోపు దినుసుగా ప్రతి ఇంట్లో ఉండే ఆవాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో మెగ్నీషియం, కాల్సియం, మాగనీస్, జింక్, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్దము ఉంటాయి . ఘాటైన వాసనను కలిగి ఉండే ఆవాలు ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. పైథోన్యూట్రియంట్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి. * ప్రతి వందగ్రాముల ఆవాలలో 9-82గ్రా టోకోఫెనాల్ అనే పదార్థం (విటమిన్ 'ఇ'కి సమానం) శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా సహాయపడుతుంటాయి. అందుకనే కొంచెంగా ఆవనూనెను కూరల్లో వాడుకోమని వైద్యులు సూచిస్తారు. * ఆవాల్లోని సెలీనియం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఊపిరితిత్తుల సమస్యలను, వాపులను తగ్గిస్తుంది. పోపుల్లో వాడినప్పుడు ఆకలిని పెంచి.. ఆహారాన్ని అరిగేటట్లు చేస్తుంటాయి. * గొంతునొప్పి, దగ్గు జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవపోడి, తగినంత తేనె వేసి ఇస్తే సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఘాటైన నూనెలు క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇవి రక్తప్రసరణను వేగవంతం చేస్తుంటాయి. ఆవాలను దంచి వాపుగల ప్రదేశం, గౌట్ నొప్పిపైన పట్టుగా పెడితే ఉపశమనం ఉంటుంది. అరబకెట్ వేడినీళ్లలో చెంచా ఆవాల పొడి వేసి కాళ్లను కొద్దిసేపు ఉంచితే పాదాల నొప్పులు త్వరగా తగ్గుతాయి. * తెల్ల ఆవనూనె చర్మ రంగును మెరుగు పరుస్తుంది. దీన్ని శరీరానికి రాసుకొని, నలుగుపెట్టి స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గి రంగు తేలుతుంది. అలానే కొబ్బరినూనెలో ఆవనూనెను కలిపి శిరోజాలకు రాస్తుంటే ఫలితం ఉంటుంది.
ఆవాల గింజల నుంచి మూడు రకాలుగా తయారయిన నూనె లకి ఆవాల నూనె లేదా ఆవ నూనె (ఆంగ్లం: Mustard oil) అనే పదాన్ని ఉపయోగిస్తారు:
Nutritional value per 100 గ్రా. (3.5 oz) | |
---|---|
శక్తి | 1,964 కి.J (469 kcal) |
34.94 g | |
చక్కెరలు | 6.89 g |
పీచు పదార్థం | 14.7 g |
28.76 g | |
సంతృప్త క్రొవ్వు | 1.46 g |
మోనోశాచురేటెడ్ కొవ్వు | 19.83 g |
బహుళఅసంతృప్త కొవ్వు ఆమ్లాలు | 5.39 g |
24.94 g | |
విటమిన్లు | Quantity %DV† |
విటమిన్ - ఎ | 0% 3 μg |
థయామిన్ (B1) | 47% 0.543 mg |
రైబోఫ్లావిన్ (B2) | 32% 0.381 mg |
నియాసిన్ (B3) | 53% 7.890 mg |
విటమిన్ బి6 | 33% 0.43 mg |
ఫోలేట్ (B9) | 19% 76 μg |
విటమిన్ బి12 | 0% 0 μg |
విటమిన్ సి | 4% 3 mg |
Vitamin E | 19% 2.89 mg |
విటమిన్ కె | 5% 5.4 μg |
ఖనిజములు | Quantity %DV† |
కాల్షియం | 52% 521 mg |
ఇనుము | 77% 9.98 mg |
మెగ్నీషియం | 84% 298 mg |
ఫాస్ఫరస్ | 120% 841 mg |
పొటాషియం | 15% 682 mg |
సోడియం | 0% 5 mg |
జింక్ | 60% 5.7 mg |
ఇతర భాగాలు | పరిమాణం |
నీరు | 6.86 g |
| |
†Percentages are roughly approximated using US recommendations for adults. Source: USDA Nutrient Database |
ఆవ గింజలు (Mustard seeds) ఆవ మొక్కల నుండి లభించే చిన్న గుండ్రని విత్తనాలు. ఇది సాధారణంగా 1 or 2 మి.మీ. పరిమాణంలో ఉంటాయి. ఇవి పసుపు పచ్చని తెలుపు నుండి నలుపు మధ్య రంగులలో ఉంటాయి. ఇది మూడు రకాల మొక్కలనుండి లభిస్తాయి: నల్లని ఆవాలు (Brassica nigra) నుండి, బ్రౌన్ ఆవాలు (Indian mustard) (Brassica juncea) నుండి, తెల్లని ఆవాలు (Brassica. hirta/Sinapis alba) నుండి తీస్తారు.* ఆవాలను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. కారణం వీటిలోని ఘాటైన ద్రవ్యాలు పైత్యాన్ని పెంచుతాయి. కడుపు మంట, చర్మ సమస్యలు ఉన్నవారు పోపులకే పరిమితమైతే మంచిది. * మరీ అధికంగా తీసుకొంటే పైత్యం చేసి శరీర వేడిని పెంచుతాయి. దురదలు మంటలు పెరుగుతాయి, కొన్నిసార్లు కడుపులో రక్తం విరుగుతుంది. ముఖ్యంగా ఎండాకాలం, వేడి శరీరం కలవారు మితంగా తీసుకుంటే మంచిది. విరుగుడు మజ్జిగ, పెరుగు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.