ఆర్ఎల్వి-టిడి
From Wikipedia, the free encyclopedia
ఆర్ఎల్వి-టిడి అంటే పునర్వినియోగ వాహక నౌక-సాంకేతికత ప్రదర్శకం ("Reusable Launch Vehicle-Technology Demonstration Program, RLV-TD") అని అర్ధం. ఇది ఒక ప్రయోగాత్మక పరీక్ష.
HS9 బూస్టరుకు అమర్చిన ఆర్ఎల్వి-టిడి (స్థాయి ప్రతిరూపము) | |
విధి | సాంకేతిక ప్రదర్శన వాహనం |
---|---|
తయారీదారు | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ |
దేశము | ![]() |
పరిమాణము | |
ఎత్తు | ~16 మీ[1] |
వ్యాసము | 1 మీ [1] |
ద్రవ్యరాశి | 12 టన్నులు [2] |
దశలు | 2[1] |
ప్రయోగ చరిత్ర | |
స్థితి | ప్రోటోటైపుల పరీక్ష జరుగుతోంది[3] |
ప్రయోగ స్థలాలు | సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం |
తొలి ప్రయోగం | 2016 మే 23, 0400 UTC[4][5][6][7] |
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాను తయారు చేసిన ఉపగ్రహాలను, లేదా ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టేందుకు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి వాహక నౌకలను ఉపయోగిస్తోంది. ఈ నౌకలు పునర్వినియోగానికి ఉపయోగపడేవి కావు. అనగా ఒకసారి ప్రయోగించిన అదే వాహక నౌకను తిరిగి ఉపయోగించలేరు. తదుపరి ప్రయోగం కోసం నౌకను పూర్తిగా కొత్తగా తయారు చెయ్యాలి. వాహక నౌకను మళ్ళీ మళ్ళీ ప్రయోగించే విధంగా రూపొందిస్తే, ఉపగ్రహ ప్రయోగ ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు.
ఈ ఉద్దేశంతో ఇస్రో పునర్వినియోగ వాహక నౌక రూపకల్పన, తయారీ, ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇస్రో రెండు దశల వాహక నౌక ప్రోటోటైప్‌ను రూపొందించి, 2016 మే 23 న ప్రయోగించింది. ఈ ప్రయోగం ద్వారా తలపెట్టిన పరీక్ష విజయవంతమైంది.