From Wikipedia, the free encyclopedia
ఆనందమయి మాత లేదా నిర్మల సుందరి (30 ఏప్రిల్ 1896 - 27 ఆగస్టు 1982) ఒక భారతీయ సన్యాసి, యోగా గురువు. పరమహంస యోగానంద సంస్కృత నామధేయమైన ఆనందమయిని ఆంగ్లంలో "Joy-permeated" అని అనువదించారు. ఈ పేరు ఆమెకు 1920వ దశకంలో దైవిక ఆనందం శాశ్వత స్థితిని తెలిజేయడానికి ఆమె భక్తులు ఆమెకు పెట్టారు.[1][2]
శ్రీ ఆనందమయి మా | |
---|---|
జననం | నిర్మల సుందరి 1896 ఏప్రిల్ 30 ఖేజ్రా, బ్రహ్మంబారియా, బెంగాల్, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం బంగ్లాదేశ్) |
నిర్యాణము | 1982 ఆగస్టు 27 86) కిషన్పూర్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్, భారతదేశం | (వయసు
భాగస్వా(ములు)మి | రమణి మోహన్ చక్రవర్తి |
క్రమము | ఆత్మసాక్షాత్కారం |
తత్వం | తంత్రం, భక్తి యోగ |
నిర్మల 1924లో తన భర్తతో కలిసి షాబాగ్‌కు వెళ్లింది, అక్కడ అతను ఢాకా నవాబ్ తోటలకు సంరక్షకునిగా నియమించబడ్డాడు. ఈ కాలంలో నిర్మల, కీర్తనలలో పారవశ్యంలో మునిగిపోయింది. "భాయిజీ" అని పిలువబడే జ్యోతిశ్చంద్ర రే ప్రారంభ, సన్నిహిత శిష్యుడు. నిర్మలను ఆనందమయి మా అని పిలవాలని, అంటే "ఆనందం వెల్లివిరిసిన తల్లి" లేదా "బ్లిస్ పెర్మిటెడ్ mother" అని పిలవాలని సూచించిన మొదటి వ్యక్తి. ఆనందమయి మా కోసం 1929లో రామనా కాళీ మందిర్ ఆవరణలో రామనా వద్ద నిర్మించిన మొదటి ఆశ్రమానికి అతను ప్రధాన బాధ్యత వహించాడు. 1926లో, ఆమె సిద్ధేశ్వరి ప్రాంతంలో గతంలో పాడుబడిన పురాతన కాళీ ఆలయాన్ని పునరుద్ధరించింది. షాబాగ్‌లో ఉన్న సమయంలో, ఎక్కువ మంది ప్రజలు దైవిక స్వరూపంగా భావించే వాటివైపు ఆకర్షితులయ్యారు.[3]
ఈమె 27 ఆగస్టు 1982న డెహ్రాడూన్‌లో మరణించారు, తర్వాత 29 ఆగస్టు 1982న ఉత్తర భారతదేశంలోని హరిద్వార్‌లో ఆమె కంఖాల్ ఆశ్రమం ప్రాంగణంలో సమాధి నిర్మించబడింది.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.