From Wikipedia, the free encyclopedia
ఆదార్ పూనావాలా వ్యాక్సీన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.[1]
ఆదార్ పూనావాలా | |
---|---|
జననం | 1981 జనవరి 14 |
జాతీయత | భారతదేశం |
విద్య | ది బిషప్స్ స్కూల్, పూణే సెయింట్ ఎడ్మండ్స్ స్కూల్, కాంట్బెరీ |
విద్యాసంస్థ | లండన్ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ |
బిరుదు | సీఈవో, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా |
పదవీ కాలం | 2011–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | నతాషా పూనావాలా |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు |
|
ఆదార్ పూనావాలా పూణేలోని ది బిషప్స్ స్కూల్, కాంట్బెరీలోని సెయింట్ ఎడ్మండ్స్ స్కూల్ లో ఉన్నత విద్యను అభ్యసించాక లండన్ లోని లండన్ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ మినిస్టర్[2] నుండి పట్టభద్రుడయ్యాడు.
లండన్ నుండి తిరిగి వచ్చి 2001లో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేరాడు. ఆయన కంపెనీలో చేరగా విదేశీ ఎగుమతులపై ద్రుష్టి పెట్టి దాదాపు 35 దేశాలకు వారి కంపెనీ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ప్రారంభించాడు. 2015 నాటికీ వారి ఉత్పత్తులు దాదాపు దేశాలకు విస్తరించాడు. సీరమ్ కు 85 % లాభాలు విదేశాలనుండి వస్తుంది.[3] ఆదార్ పూనావాలా 2011లో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితుడయ్యాడు.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన అస్త్రజెనెకా కోవిడ్ 19 వ్యాక్సిన్ను భారత్లో తయారు చేస్తుంది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అమెరికన్ వ్యాక్సిన్ డెవలపర్ ‘నోవావ్యాక్స్’తో సీరం సంస్ధ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. సీరం ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు ముగిసాయి. 2021 ఫిబ్రవరి నాటికి ఫ్రంట్ లైన్ వారియర్లకు, 2021 ఏప్రిల్ నాటికి సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 2024 నాటికి దేశంలో ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆదార్ పూనావాలా తెలిపారు.[4]
ఆదార్ పూనావాలాకు 2021 ఏప్రిల్ 28న కేంద్ర హోంశాఖ ‘వై’ కేటగిరీ భద్రత ఏర్పాటు చేసింది.[5][6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.