ఆచార్య జగదీష్ చంద్రబోస్ ఇండియన్ బొటానిక్ గార్డెన్ , దీనిని గతంలో రాయల్ బొటానిక్ గార్డెన్ లేదా From Wikipedia, the free encyclopedia
ఆచార్య జగదీష్ చంద్రబోస్ ఇండియన్ బొటానిక్ గార్డెన్, దీనిని గతంలో రాయల్ బొటానిక్ గార్డెన్ లేదా కలకత్తా బొటానిక్ గార్డెన్ అని పిలిచేవారు.[1] ఇది కోల్‌కతా సమీపంలోని హౌరాలోని షిబ్‌పూర్‌లో ఉన్న బొటానికల్ గార్డెన్. 109 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ ఉద్యానవనంలో మొత్తం 12,000 రకాల మొక్కలు (చెట్లు) ఉన్నాయి. ఇది భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (BSI) క్రింద ఉంది.[2] ప్రపంచంలోని అత్యుత్తమ ప్రకృతి దృశ్యాలతో కూడిన తోటలలో ఇది ఒకటి. ఈ ఉద్యానవనం లండన్ నుండి కొన్ని మైళ్ల దూరంలో థేమ్స్ నది ఒడ్డున ఉన్న క్యూ గార్డెన్‌ను పోలి ఉంటుంది. బెంగాలీ బహుశాస్త్రవేత్త, సహజ శాస్త్రవేత్త అయిన జగదీష్ చంద్రబోస్ గౌరవార్థం ఈ ఉద్యానవనముకు జూన్ 25, 2009న ఆచార్య జగదీష్ చంద్రబోస్ ఇండియన్ బొటానిక్ గార్డెన్‌గా పేరు పెట్టబడింది. ఈ ఉద్యానవనం నో ప్లాస్టిక్ జోన్.
ఆచార్య జగదీష్ చంద్రబోస్ ఇండియన్ బొటానిక్ గార్డెన్ ఆఫ్ ఇండియా, హౌరా, పశ్చిమ బెంగాల్ | |
---|---|
రకం | ప్రజా |
స్థానం | షిబ్పూర్, హౌరా |
సమీప పట్టణం | హౌరా, కోల్‌కతా |
విస్తీర్ణం | 109 హెక్టారులు (270 ఎకరం) |
నవీకరణ | 1787 |
నమూనా కర్త | రాబర్ట్ కైడ్, విలియం రాక్స్బర్గ్ |
నిర్వహిస్తుంది | బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా |
స్థితి | తెరిచి ఉండే వేళలు
(మార్నింగ్ వాకర్స్ కోసం 5 AM - 7 AM) |
వెబ్సైట్ | Official website |
ఈస్టిండియా కంపెనీకి చెందిన ఆర్మీ అధికారి కల్నల్ రాబర్ట్ కైడ్ 1787లో ప్రధానంగా టేకు వంటి వాణిజ్య విలువ కలిగిన కొత్త మొక్కలు, సుగంధ ద్రవ్యాలు పెంచడం కోసం ఈ ఉద్యానవనాన్ని స్థాపించాడు.[3] దీన్ని స్థాపించడానికి గవర్నర్-జనరల్ జాన్ మాక్ఫెర్సన్కు "అరుదైన మొక్కలను కేవలం ఆసక్తితో సేకరించే ఉద్దేశ్యంతో కాదు, ప్రయోజనకరమైనదిగా రుజువు చేసే కథనాలను వ్యాప్తి చేయడానికి ఒక స్టాక్‌ను ఏర్పాటు చేయడం కోసం ఇది ఉద్దేశించబడింది. "ఇక్కడి నివాసులకు అలాగే గ్రేట్ బ్రిటన్ స్థానికులకు, ఇది అంతిమంగా జాతీయ వాణిజ్యం, సంపదల విస్తరణకు మొగ్గు చూపుతుంది."[4] అని లేఖ రాశాడు, భారతదేశం 18వ శతాబ్దంలో తీవ్రమైన సామాజిక-ఆర్థిక సంక్షోభాలతో పాటు రాజకీయ గందరగోళాల ఫలితంగా సామూహిక కరువును ఎదుర్కొంటోంది. ఆహార కొరతను అంతం చేయడానికి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే ప్రయత్నంలో వ్యవసాయ ఆదాయాన్ని పెంచాలనే కోరికతో రాబర్ట్ కైడ్ గార్డెన్ ప్రతిపాదన ప్రేరేపించబడింది.[5] ఇంకా, రాబర్ట్ కైడ్ ఈస్ట్ ఇండీస్ నుండి వివిధ రకాల మొక్కలను (సుగంధ ద్రవ్యాలు) తెచ్చి పెంచాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దాని ఆర్థిక ప్రయోజనాల కారణంగా గార్డెన్లో దాల్చిన చెక్క, పొగాకు, ఖర్జూరాలు, చైనీస్ టీ, కాఫీలను స్థాపించాలనే కైడ్ ఆశయాలకు మద్దతు ఇచ్చింది. చైనీస్ టీని మొదట కలకత్తా గార్డెన్ లో నాటారు, ఆ తరువాత అస్సాం, ఊటీ, నీలగిరిలలో పెద్ద తేయాకు తోటలు స్థాపించబడ్డాయి. అదనంగా, నోపాల్ వంటి కాక్టిలు మెక్సికో నుండి దిగుమతి చేయబడ్డాయి, వస్త్ర రంగులను ఉత్పత్తి చేయడానికి గార్డెన్లో స్థాపించబడ్డాయి. జోసెఫ్ డాల్టన్ హుకర్ ఈ బొటానికల్ గార్డెన్ గురించి ఇలా చెప్పాడు, "దీని గొప్ప విజయాలలో చైనా నుండి తేయాకు-మొక్క పరిచయం పరిగణించబడుతుంది. హిమాలయాలు, అస్సాంలో టీ -వాణిజ్యం స్థాపన అనేది దాదాపు పూర్తిగా సూపరింటెండెంట్ల పని."[6]
అయితే, 1793లో ఉద్యానవనానికి సూపరింటెండెంట్ అయిన తర్వాత వృక్షశాస్త్రజ్ఞుడు విలియం రోక్స్‌బర్గ్, మొక్కల విధానంలో ఒక పెద్ద మార్పును ప్రవేశపెట్టాడు. రోక్స్‌బర్గ్ భారతదేశం నలుమూలల నుండి ఎండిన మొక్కల నమూనాల తీసుకువచ్చి విస్తృతమైన హెర్బేరియంను అభివృద్ధి చేశాడు.[7] ఈ సేకరణ చివరికి 2,500,000 ఎండిన మొక్కలు కలిగి ఉన్న బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ నేషనల్ హెర్బేరియం అయింది. తోట ప్రారంభ సంవత్సరాల్లో జోసెఫ్ డాల్టన్ హుకర్ ఇలా వ్రాశాడు, " ప్రపంచంలోని పబ్లిక్, ప్రైవేట్ గార్డెన్లకు ముందు లేదా తర్వాత ఎక్కువ ఉపయోగకరమైన, అలంకారమైన ఉష్ణమండల మొక్కలను అందించింది. నేను ఇక్కడ గ్రేట్ ఇండియన్ హెర్బేరియం గురించి ప్రస్తావిస్తున్నాను, ప్రధానంగా బొటానిక్ గార్డెన్స్ సిబ్బంది డాక్టర్ నథానియల్ వల్లిచ్ ఆధ్వర్యంలో రూపొందించారు, 1829లో ఐరోపాలోని ప్రధాన మ్యూజియంలకు పంపిణీ చేశారు."[8]
ఈ ఉద్యానవనంలో పెద్ద మర్రి చెట్టు (ఫికస్ బెంఘాలెన్సిస్) ఉంది, ఇది 330 మీటర్ల కంటే ఎక్కువ చుట్టుకొలతతో ప్రపంచంలోనే అతిపెద్ద చెట్టుగా పరిగణించబడుతుంది. ఇది బ్రియాన్ ఆల్డిస్ రాసిన హాట్‌హౌస్ నవలకు పాక్షికంగా స్ఫూర్తినిచ్చింది.[9] ఈ ఉద్యానవనం ఆర్కిడ్లు, వెదురు, అరెకేసి, స్క్రూ పైన్ జాతి (పాండనస్) మొక్కలకు ప్రసిద్ధి చెందింది.
బొటానిక్ గార్డెన్ లోపల కనిపించే జంతువులలో జాకల్ (కానిస్ ఆరియస్), ఇండియన్ ముంగీస, ఇండియన్ ఫాక్స్ (వల్పెస్ బెంగాలెన్సిస్) ఉన్నాయి. తోటలో అనేక రకాల పాములు కూడా కనిపిస్తాయి.
1864లో కోల్‌కతాలో పెద్ద తుఫాను వచ్చినపుడు హుగ్లీ నది నుండి వచ్చిన తుఫాను కెరటం వల్ల గార్డెన్లో ఎక్కువ భాగం నీటిలో మునిగిపోయింది, కొన్ని చోట్ల నీటి మట్టం దాదాపు 8 అడుగులకు చేరుకుంది, దీని వలన 750కి పైగా జీవించి ఉన్న చెట్లు నేలకూలాయి. ఈ శిధిలాలను తొలగించడానికి, 1868లో థామస్ ఆండర్సన్ తన నిష్క్రమణకు ముందు తోటను క్రమపద్ధతిలో నాటడానికి తన మిగిలిన కాలమంతా తీవ్రంగా ప్రయత్నించాడు.[2]
1871లో సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్. జార్జ్ కింగ్ ఉద్యానవనంలో నీటికొరత ఉండకుండ కృత్రిమ సరస్సులను ఏర్పాటు చేసాడు. ఈ సరస్సులు భూగర్భ పైపుల ద్వారా ఒకదానికొకటి అనుసంధానించబడ్డాయి, ఒక ఆవిరి పంపును కూడా అమర్చాడు, దీని ద్వారా గంగానది నుండి నీటిని తీసుకోవచ్చు, నీటిని అధిక స్థాయిలో నిలువ ఉంచవచ్చు. క్యారేజీలు, ప్రజలు సులభంగా వెళ్లేందుకు అనేక విశాలమైన రహదార్లు, ఫుట్ పాత్లను ఏర్పాటు చేసాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.