జీర్ణాశయంలోని జఠర గ్రంథులు జఠర రసాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ జఠర రసంలో హైడ్రో క్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జీర్ణాశయంలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఒక్కోసారి ఇది అధికంగా తయారవుతుంది. అలా అధిక ఉత్పత్తి కావడాన్నే ‘ఎసిడిటీ’ అంటారు.

image =

అసిడిటీ
"ఇదివరకు ఏం తిన్నా అరాయించుకునే వాళ్లం".." ప్రస్తుతం పరిస్థితి అలా లేదు". " ఏ ఆహారం తీసుకోవాలంటే భయమేస్తుందని" చెప్పే వారి సంఖ్య నానాటికి అధికమవుతోంది. ఏదైనా ఆహారం తీసుకోగానే తేన్పులు, చిరాకు, గుండెలో మంట వంటివి వస్తే.. ఈ పరిస్థితినే అసిడిటీ అంటారు .ఎసిడిటీ అనేది జబ్బు కాదు. జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే కడుపులో మంట అన్పిస్తుంది. పొట్టలో ఆమ్లాలు ఉత్పన్నమవుతాయి. రక్తంలో ఆమ్ల, క్షార సమతుల్యత సమపాళ్లలో ఉంటే ఈ సమస్య రాదు.

ఎలా వస్తుంది?

సాధారణంగా మనం తినే ఆహారంవలన, మన జీవన గమనం వలన ఎసిటిడీ వచ్చే వీలుంది. జిహ్వ చాపల్యం అధికంగా వుండేవారికి ఇది దగ్గరి చుట్టం. దొరికింది కదాని.. ఎక్కడపడితే అక్కడ.. ఏది పడితే అది తినేవారికి ఎసిడిటీ సమస్య అందుబాటులో ఉంటుంది.

లక్షణాలు

ఎసిడిటీ వున్నవారికి చాతీలోను, గొంతులోను, గుండెల్లోనూ, జీర్ణాశయంలోనూ మంటగా వుంటుంది. పుల్లటి తేపులతో ఆహారం నోటిలోకి వచ్చినట్లుంది. కడుపు ఉబ్బరించి వాంతి వచ్చినట్లుంటుంది. మలబద్ధకం, అజీర్ణం పెరిగి ఆకలి మందగిస్తుంది.

జీవన విధానం.. మన దైనందిన జీవన విధానం కూడా ఎసిడిటీకి దారితీస్తున్నాయి. ఉద్యోగం, పిల్లలు, పిల్లల చదువులు.. సమాజంలో అవతలవారితో పోటీపడటం, ఉరుకులపరుగుల జీవనం తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఈ మానసిక ఒత్తిడి ఆరోగ్యంమీద పనిచేసి ఎసిడిటీనీ కలిగిస్తున్నాయి. దీనినే ఈ విదంగా చెప్పవచ్చును ... Hurry, worry, curry ....... leads to Acidity .

ఉపశమనం.. జీవన విధానంలో మార్పులు తీసుకోవటం ద్వారా కొంతమేరకు దీని ఉపశమనం పొందవచ్చు.
  • ఆల్కహాల్, పొగ త్రాగుడు, గుట్కాలు లాంటి పదార్థాలను పూర్తిగా మానివేయాలి.
  • మానసిక ఆందోళనను తగ్గించుకోవాలి.
  • ఎక్కడపడితే అక్కడ ఫాస్ట్ఫుడ్స్ తినకూడదు.
  • మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు తినటం తగ్గించుకోవాలి. ప్రతిరోజూ నియమిత సమయంలో, ఆహారాన్ని ఆదరా బాదరాగా కాక ప్రశాంతంగా.. బాగా నమిలి తినాలి.
  • తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
  • కాబట్టి ఎసిడిటీనీ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ.. మన అలవాట్లు, ఆహార నియమాలలో ఉంది. ప్రతివారూ కాస్త శ్రద్ధ తీసుకొని వీటిని పాటిస్తే.. ఎసిడిటీని తరిమేయవచ్చు.
ఈ అసిడిటీతో బాధపడేవారు తినవల్సిన /తినకూడని పదార్ధములు ...
  • పులుపుగా ఉన్న పదార్ధాలు తినికూడదు .,
  • పచ్చిగా ఉన్న కాయలు, పండ్లు తినకూడదు,
  • మసాలా వస్తువులు ఎక్కువగా తినకూడదు .,
  • తేలికగా జీర్ణం అయ్యే పదార్ధములే తినాలి,
  • కొబ్బరి కోరుతో తయారయ్యే పదార్ధములు తక్కువగా తినాలి,
  • నూనే వంటకాలు మితముగా తీసుకోవాలి (ఫ్రై ఫుడ్స్ ),

అసిడిటీని తగ్గించాలంటే...ఆయుర్వేదము

ఆకులు, ఆవకూర, మెంతి కూర, పాలకూర, క్యాబేజీ, ముల్లంగి ఆకులు, ఉల్లి కాడలు, తోటకూరలను తరిగి ఒకటి్న్నర లీటరు నీళ్లలో వేసి బాగా మరిగించాలి. తరువాత అందులో ఉప్పు, అల్లం రసం, నిమ్మరసం, రెండు వెల్లుల్లి రెబ్బలు, నలిపి కలియబెట్టాలి. అసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సూప్ తాగితే ఒంట్లో తేలిగ్గా ఉంటుంది.

అల్లోపతి

యాంటాసిడ్ మాత్రలు గాని, సిరప్ గాని ఉదా: tab . gelusil mps or sy.Divol—3-4 times for 4 days యాసిడ్ ను తగ్గించే మాత్రలు :

  • cap. Ocid -D.. 2 cap / day 3–4 days.
  • Or. cap.Rabest-D.. 1 cap three time /day 3–4 days. వాడాలి .
Thumb
అసిడిటీ

అసిడిటీ మందులు దీర్ఘకాలం వాడొద్దు!

అజీర్ణం, పుల్లటి త్రేన్పులు, ఛాతీలో మంట వంటివి తరచుగా కనిపించే సమస్యలే. ముఖ్యంగా వృద్ధుల్లో ఎంతోమంది వీటితో బాధపడుతుండటం చూస్తూనే ఉంటాం. వీటి నుంచి తప్పించుకోవటానికి చాలామంది ఒమెప్రొజాల్‌ వంటి ప్రోటాన్‌ పంప్‌ ఇన్‌హిబిటార్స్‌ (పీపీఐ) మాత్రలు వేసుకుంటూ ఉంటారు. డాక్టర్లు సిఫారసు చేయకపోయినా సొంతంగా కొనుక్కొని వాడేవాళ్లూ లేకపోలేదు. అయితే వీటిని ముట్లుడిగిన మహిళలు దీర్ఘకాలం వాడటం మంచిది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఎముకల పటిష్ఠం తగ్గి.. తుంటి ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. బోస్టన్‌లోని మసాచుసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రికి చెందిన డాక్టర్‌ హమీద్‌ ఖలీల్‌ బృందం ఇటీవల ఒక అధ్యయనం చేసింది. నెలసరి నిలిచిపోయిన 80 వేల మంది మహిళలను పరిశీలించింది. మొత్తం ఎనిమిదేళ్ల పాటు చేసిన ఈ అధ్యయనంలో.. పీపీఐలు వాడేవారిలో తుంటిఎముక విరిగే ముప్పు 35% పెరిగినట్టు గుర్తించారు. ఇక పొగతాగే అలవాటుంటే ఇది మరింత ఎక్కువవుతుండటం గమనార్హం. ఈ మందులను ఆపేస్తే ఎముక విరిగే ముప్పు రెండేళ్లలోనే మామూలు స్థాయికి చేరుకుంటోంది కూడా. బరువు, వయసు, వ్యాయామం, పొగ తాగటం, ఆహారంలో క్యాల్షియం మోతాదు, క్యాల్షియం మాత్రల వాడకం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈ ముప్పును లెక్కించారు. ఆహారం ద్వారా నియంత్రించ గలిగే సమస్యలకూ డాక్టర్లు చాలాసార్లు పీపీఐలను సిఫారసు చేస్తున్నారని ఖలీల్‌ చెబుతున్నారు. వీటిని కొన్నాళ్లు వాడాక ఆపేయటమే మంచిదని.. అయితే వెంటనే మానేస్తే త్రేన్పులు, ఛాతీలో మంట వంటివి తిరగబెట్టే అవకాశం ఉన్నందువల్ల నెమ్మదిగా తగ్గించుకుంటూ రావాలని సూచిస్తున్నారు. సాధారణంగా ముట్లుడిగిన వారికి క్యాల్షియం మాత్రలనూ సిఫారసు చేస్తుంటారు. అయితే పీపీఐలు మన శరీరం క్యాల్షియాన్ని గ్రహించే ప్రక్రియను అడ్డుకుంటాయి. దీంతో క్యాల్షియం మాత్రలు వేసుకున్నా ప్రయోజనం కనబడటం లేదు. అందువల్లే క్యాల్షియం మాత్రలు వేసుకుంటున్న వారిలోనూ తుంటిఎముక విరిగే ముప్పు అలాగే ఉంటోందని ఖలీల్‌ పేర్కొంటున్నారు.

సూచికలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.