From Wikipedia, the free encyclopedia
అవంతిక వందనపు ఒక నటి, నటి, నాట్యకారిణి, గాయకురాలు, మోడల్, సంధానకర్త. తను కాలిఫోర్నియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలకి చెందినది. ఆమె జూన్ 2014 లో జరిగిన జీ టీవీ రియాలిటీ కార్యక్రమం "డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ ఉత్తర అమెరికా"లో తన ప్రదర్శనకి పేరు గాంచింది. ఆమె ఆ కార్యక్రమములో రెండవ విజేతగా నిలిచింది.[1] ఐదేళ్ల వయసులో డ్యాన్స్ ప్రాక్టీస్ ప్రారంభించిన అవంతిక.. కూచిపూడి, కథక్, జాజ్, ఇండియన్ కాంటెపరరీ డ్యాన్సులన్నీ నేర్చుకుంది. బొమ్మలు కూడా గీస్తుంది.
అవంతిక వందనపు యూనియన్ సిటి, కాలిఫోర్నియా, అమెరికా సంయుక్త రాష్ట్రం లో జన్మించింది. ఆమె తల్లితండ్రులు భారత దేశానికి చెందినవారు. [2]
అవంతిక తన ఐదవ ఏటనుండే నాట్యంతో తన కళా వృత్తిని మొదలు పెట్టింది. మొదటగా తను సెమీ క్లాసిక్ నృత్యంలో శిక్షణ పొందింది. తదుపరి దక్షిణ భారత సంప్రదాయ నృత్యంలో ఒకటైన కూచిపూడిని తన ఏడవ ఏట నుండి నేర్చుకోవడం మొదలు పెట్టింది. అవంతిక పలు నృత్య ప్రదర్శన పోటీలలో పాల్గొన్నది. 2012 సంవత్సరంలో ATA స్టార్ డాన్సర్ పురస్కారాన్ని పొందింది.[3] 2014 సంవత్సరంలో జీ టీవీ మొదటి ఉత్తర అమెరికా ఎడిషన్ "డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్"లో అవంతిక ద్వితియ స్థానంలో నిలిచింది.[1][4][5][6][7] 2015 సంవత్సరంలో రెండు తెలుగు చలన చిత్రాలలో నటించుటకు ఒప్పుకొనడం ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి వచ్చింది. ఆమె 2016 లో విడుదలైన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారి కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రంలో చుట్కీ పాత్రకు ఎంపికైనది. కానీ షెడ్యూల్ కుదరకపోవడం వలన తను ఆ చిత్రంలో నటించలేదు. అధికారికంగా మహేష్ బాబు, కాజల్, సమంత, ప్రణీత నటించిన బ్రహ్మోత్సవం చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి బాలనటిగా పరిచయమయ్యింది. బ్రహ్మోత్సవం చిత్రం చిత్రీకరణ 2015 సెప్టెంబరు 16 న మొదలైంది. తదుపరి చంద్రశేఖర్ యేలేటి చిత్రం మనమంతాలో నటించింది. గోపి చంద్ చిత్రం ఆక్సిజన్ లో ఒక పాటలో చిన్న పాత్ర చేసింది. తదుపరి నాగ చైతన్య, శ్రుతీ హాసన్ చిత్రం ప్రేమమ్లో తృతీయ కథానాయకి (మడోన్నా సెబాస్టియన్) యుక్త వయసు పాత్రలో నటించింది. అవంతిక అభిషేక్ పిక్చర్స్ చిత్రంలో నటించుటకు ఒప్పుకున్నది.
మార్చి 2016 లో అవంతిక "స్వేచ్ఛ" అనే లఘు చిత్రంలో నటించింది. ఈ లఘు చిత్ర దర్శకుడు "రాజ్ శివసథాని". "చదువుకోవలసిన పసి పిల్లలను పనివాళ్లుగా మార్చకండి. బడికి వెళ్లాల్సిన వయసులో బాల కార్మికులను చేయకండి" అనే ఇతివృత్తంతో రూపొందిన షార్ట్ ఫిల్మ్ "ప్రజా హక్కు"లో అవంతిక వందనపు ప్రధాన పాత్రలో నటించింది. బాలికల విద్య, హక్కులు, కూచిపూడి నాట్య ప్రాముఖ్యతను చర్చించిన ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.[2]
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | వివరణ |
---|---|---|---|---|
2016 | బ్రహ్మోత్సవం | మహేష్ బాబు కజిన్ | తెలుగు | 2016 మే 20 విడుదల |
2016 | స్వేచ్ఛ (లఘుచిత్రం) | కౌమరదశలో గల బాలిక | తెలుగు | 2016 మార్చి 21 విడుదల |
2016 | మనమంతా | అవంతిక | తెలుగు, మలయాళం | ఆగస్టు 4 విడుదల |
2016 | ప్రజాహక్కు (లఘుచిత్రం) | అమ్రీన్ అవంతిక | తెలుగు | 2016 అక్టోబరు 1 న విడుదల,
చిత్రపురి ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటి పురస్కారం |
2016 | ప్రేమమ్ | సింధు | తెలుగు | 2016 అక్టోబరు 7 విడుదల |
2017 | బాబు బాగా బిజీ | అవంతిక | తెలుగు | 2017 మే 5 విడుదల |
2017 | రారండోయ్ వేడుక చూద్దాం | బ్రమరాంబ - జూనియర్ రకుల్ ప్రీత్ | తెలుగు | 2017 మే 25 విడుదల |
2017 | లైక్ గర్ల్ (లఘుచిత్రం) | అవంతిక | తమిళం | పోస్టు ప్రొడక్షన్ |
2017 | బాలకృష్ణుడు | ఆధ్య - జూనియర్ రెజీనా కస్సాంద్ర | తెలుగు | 2017 నవంబరు 23 విడుదల |
2017 | ఆక్సిజన్ | అవంతిక | తెలుగు | 2017 నవంబరు 30 విడుదల |
2018 | అజ్ఞాతవాసి | సంపత్ కుమార్ కుమార్తె | తెలుగు | 2018 జనవరి 10 విడుదల |
2021 | స్పిన్ | రెయా కుమార్ | ఆంగ్లం | |
2021 | భూమిక | తమిళం \ తెలుగు | ||
సినియర్ ఇయర్ | ఆంగ్లం |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.