From Wikipedia, the free encyclopedia
అమ్మోనియం సైనైడ్ ఒక రసాయనిక సంయోగ పదార్థం. ఇది అస్థిరమైన అకర్బన సమ్మేళన పదార్థం. ఈ సంయోగ పదార్థం యొక్క రసాయనిక ఫార్ములా NH4CN.
| |||
గుర్తింపు విషయాలు | |||
---|---|---|---|
సి.ఎ.ఎస్. సంఖ్య | [12211-52-8] | ||
పబ్ కెమ్ | 159440 | ||
SMILES | [C-]#N.[NH4+] | ||
| |||
ధర్మములు | |||
NH4CN | |||
మోలార్ ద్రవ్యరాశి | 44.0559 g/mol | ||
స్వరూపం | colourless crystalline solid | ||
సాంద్రత | 1.02 g/cm3 | ||
బాష్పీభవన స్థానం | 36 °C (97 °F; 309 K) | ||
నీటిలో ద్రావణీయత |
very soluble | ||
ద్రావణీయత | very soluble in alcohol | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
ఇతరఅయాన్లు | {{{value}}} | ||
ఇతర కాటయాన్లు |
Sodium cyanide Potassium cyanide | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
verify (what is ?) | |||
Infobox references | |||
అమ్మోనియం సైనైడ్ ఒక రంగులేని చతుర్క్కోణ స్పటిక ఘన పదార్థం.[1] ఈ సంయోగ పదార్థం యొక్క అణుభారం 44.055 గ్రాములు/మోల్.[2] అమ్మోనియం సైనైడ్ సాంద్రత 1.02 గ్రాములు/సెం.మీ3. ఈ సంయోగ పదార్థం యొక్క భాస్పిభవన ఉష్ణోగ్రత 36 °C. అమ్మోనియం సైనైడ్నీటిలో, ఆల్కహాల్లో కరుగుతుంది.
అమ్మోనియం సైనైడ్ వియోగం చెందడం వలన అమ్మోనియా, హైడ్రోజన్ సైనైడ్ ఏర్పడును. వియోగ ఫలితంగా తరచుగా నల్లని హైడ్రోజన్ సైనైడ్ పాలిమర్ ఏర్పడును.
అమ్మోనియం సైనైడ్ ద్రావణం లోహ లవణాలతో చర్య వలన ఉభయ వియోగం చెందును. గ్లైఅక్షల్ (glyoxal) తో చర్య వలన అమినోఅసిటిక్ ఆమ్లాన్ని (glycine) ఏర్పరచును.
అలాగే కిటోన్సుతో చర్య ఫలితంగా అమినో నైట్రైల్స్ (aminonitriles) ఏర్పరచును.
తక్కువ ఉష్ణోగ్రత వద్ద సజల అమ్మోనియాలో హైడ్రోజన్ సైనైడ్ను బబ్లింగ్ చెయ్యడం ద్వారా అమ్మోనియం సైనైడ్ను ఉత్పత్తి చెయ్యుదురు.
కాల్షియం సైనైడ్ తో అమ్మోనియం కార్బోనేట్ రసాయనిక చర్య జరిపిన అమ్మోనియం సైనైడ్ఏర్పడును.
పొడి (dry) స్థితిలో ఉన్న పొటాషియం సైనైడ్ లేదా పొటాషియం పెర్రో సైనైడ్,, అమోనియం క్లోరైడ్ మిశ్రమాన్ని వేడి చేసి, ఆవిరి రూపంలో వెలువడిన అమ్మోనియం సైనైడ్ను స్పటికాలుగా మారునట్లు చల్లార్చటం ద్వారా కూడాతయారు చెయ్య వచ్చును.
అమ్మోనియం సైనైడ్ ద్రవంగా లేదా ఘన పదార్థంగా అత్యంత విషకారి.జీర్ణాశయంలో చేరిన మరణం సంభవించును. ఘన రూప అమ్మోనియం సైనైడ్ ప్రభావానికి గురైన ఇది అత్యంత ప్రమాదకరమైన హైడ్రోజన్ సైనైడ్,, అమ్మోనియాగా విఘటన చెందటం వలన చాలా ప్రమాదకరం.
అమ్మోనియం సైనైడ్లో ఉన్న మూలకాల నిష్పతి :హైడ్రోజన్ ( H) : 9.15%, కార్బన్ (C) : 27.23%, నత్రజని (N) : 63.55%.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.