![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bb/Ananta_Vasudeva_Temple.jpg/640px-Ananta_Vasudeva_Temple.jpg&w=640&q=50)
అనంత వాసుదేవ ఆలయం
భువనేశ్వర్, ఒరిస్సాలోని ప్రసిద్ధ దేవాలయం. ఇది వాసుదేవుడు ప్రధాన దైవంగా గలది. / From Wikipedia, the free encyclopedia
అనంత వాసుదేవ ఆలయం శ్రీకృష్ణునికి అంకితమైన ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయం శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు ప్రధాన దైవంగా గలది. ఇది భారతదేశంలోని ఒడిషా రాష్ట్రం లోని భువనేశ్వర్ లో ఉంది.[1] ఈ దేవాలయం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ దేవాలయంలో ప్రధానంగా శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర అనే దేవతలను ప్రదానంగా కొలుస్తారు. ఈ దేవాలయంలో దేవతలైన బలరాముడు ఏడు పడగలు గల సర్పం క్రింద నిలుచుంటాడు. సుభద్ర రత్నాల కుండ, తామరపువ్వు లను ఇరు చేతులతో కలిగి యుండి. ఎడమ పాదాన్ని వేరొక రత్నాల కుండపై ఉంచేటట్లుంటుంది. శ్రీకృష్ణుడు గదను, చక్రాన్ని, కమలాన్ని, శంఖాన్ని కలిగియుండేటట్లుంటుంది. ఈ దేవాలయం "భానుదేవుని" పరిపాలనా కాలంలో "అనంగాభిమ III" యొక్క కుమార్తె అయిన చంద్రికాదేవి కాలంలో నిర్మితమైనది.
త్వరిత వాస్తవాలు అనంత వాసుదేవ ఆలయం, భౌగోళికాంశాలు: ...
అనంత వాసుదేవ ఆలయం | |
---|---|
![]() అనంత వాసుదేవ ఆలయం | |
భౌగోళికాంశాలు: | 20°14′26.18″N 85°50′8.81″E |
స్థానం | |
దేశం: | భారత దేశము |
రాష్ట్రం: | ఒడిషా |
జిల్లా: | ఖుర్ధా |
ప్రదేశం: | భువనేశ్వర్ |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | అనంత వాసుదేవ(కృష్ణుడు) |
చరిత్ర | |
కట్టిన తేదీ: (ప్రస్తుత నిర్మాణం) | 13వ శతాబ్దం |
మూసివేయి