అగ్ని-4
భారత్ తయారు చేసిన మధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణి / From Wikipedia, the free encyclopedia
అగ్ని క్షిపణుల శ్రేణిలో నాలుగోది అగ్ని-4. మొదట్లో దీన్ని అగ్ని-ప్రైమ్ అనేవారు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన ఈ బాలిస్టిక్ క్షిపణి అనేక కొత్త సాంకేతికతలను ప్రదర్శించింది. క్షిపణి సాంకేతికతను కూడా ఎంతో మెరుగుపరచారు. ఈ క్షిపణి తక్కువ బరువుతో, రెండు ఘన ఇంధన చోదిత దశలతో, పేలోడు చుట్టూ పునఃప్రవేశ రక్షణ కవచంతో ఉంటుంది[4] ఈ క్షిపణిలో మొదటిసారిగా కాంపోజిట్ రాకెట్ మోటారును వాడారు. అది చక్కటి పనితీరు కనబరచింది. ఈ క్షిపణి వ్యవస్థలో రిడండెన్సీతో కూడిన ఆధునిక ఏవియానిక్స్‌ను వాడారు. దీనితో ఇది మరింతగా విశ్వసనీయమైన పనితీరు కనబరచింది. దేశీయంగా తయారైన రింగ్ లేసర్ గైరోస్ ఆధారంగా తయారుచేసిన ఇనర్షియల్ నేవిగేషన్ వ్యవస్థ, మైక్రో నేవిగేషన్ వ్యవస్థలు రెంటినీ గైడెన్స్ మోడ్‌లో మొదటిసారిగా పనిచేయించారు. డిస్ట్రిబ్యూటెడ్ ఏవియానిక్స్ ఆర్కిటెక్చర్‌తో ఆన్‌బోర్డు కంప్యూటరు, హైస్పీడ్ రిలయబుల్ కమ్యూనికేషన్ బస్, పూర్తి డిజిటల్ కంట్రోల్ సిస్టములు కలిసి, క్షిపణిని లక్ష్యం దిశగా నియంత్రిస్తూ, దిశానిర్దేశం చేసాయి. క్షిపణి తన లక్ష్యాన్ని చాలా ఉన్నతమైన కచ్చితత్వంతో ఛేదించింది. ఒరిస్సా తీరాన ఉన్న రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థలు క్షిపణి ప్రయాణాన్ని, దాని పరామితులనూ పర్యవేక్షించాయి. లక్ష్యానికి దగ్గరలో ఉంచిన రెండు భారత నావికాదళ నౌకలు లక్ష్య ఛేదనను వీక్షించాయి.
అగ్ని-4 | |
---|---|
రకం | మధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణి |
అభివృద్ధి చేసిన దేశం | భారత్ |
సర్వీసు చరిత్ర | |
సర్వీసులో | 2014 |
వాడేవారు | భారత సాయుధ బలగాలు |
ఉత్పత్తి చరిత్ర | |
డిజైనరు | భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) |
తయారీదారు | Bharat Dynamics Limited |
విశిష్టతలు | |
బరువు | 17,000 కిలోగ్రాములు (37,000 పౌ.)[1] |
పొడవు | 20 మీటర్లు (66 అ.)[1] |
వార్‌హెడ్ | Strategic nuclear (~15 kilotonnes (15,000 ట.) to ~250 kilotonnes (250,000 ట.)), conventional, Thermobaric |
ఇంజను | Two stage solid propellant engine |
ఆపరేషను పరిధి | 4,000 కి.మీ. (2,500 మై.)[2][3] |
ఫ్లైటు ఎత్తు | 900 కిలోమీటర్లు (560 మై.) |
గైడెన్స్ వ్యవస్థ | Ring Laser Gyro - INS (Inertial Navigation System), optionally augmented by GPS/IRNSS. Terminal guidance with possible radar scene correlation |
లాంచి ప్లాట్ఫారం | 8 x 8 TELAR (Transporter erector launcher) Rail Mobile Launcher |
DRDO డైరెక్టర్ జనరలైన డా. విజయ్ కుమార్ సరస్వత్ క్షిపణి ప్రయోగాన్ని వీక్షించాడు. అగ్ని-4 ప్రయోగం విజయవంతం కావడంతో DRDO శాస్త్రవేత్తలను, ఉద్యోగులను, సాయుధ బలగాలనూ అతడు అభినందించాడు. ఛీఫ్ కంట్రోలర్, (మిస్సైల్స్ అండ్ స్ట్రటీజిక్ సిస్టమ్స్), అగ్ని ప్రోగ్రాము డైరెక్టరూ అయిన అవినాష్ చందర్ ఆధునిక దీర్ఘ శ్రేణి నేవిగేషన్లో ఈ క్షిపణి విజయం ఒక కొత్త యుగం అని వ్యాఖ్యానించాడు. "ఈ విజయం త్వరలో రానున్న అగ్ని-5 పరీక్ష విజయవంతం కావడానికి దోహదపడుతుంది” అని అన్నాడు.
అగ్ని-4 ప్రాజెక్టు డైరెక్టరు టెస్సీ థామస్, ఆమె బృందం క్షిపణి వ్యవస్థలను సమీకృతం చేసి విజయవంతంగా ప్రయోగించడంలో పాత్ర వహించారు. ఆమె మాట్లాడుతూ, 'క్షిపణి వ్యవస్థలో అవసరమైన అనేక వ్యవస్థలను DRDO తయారుచేసి ప్రదర్శించింది' అని చెప్పింది. వ్యూహాత్మక వార్హెడ్లను మోసుకుపోగల ఈ క్షిపణిని భారీ సంఖ్యలో ఉత్పత్తి చేసి వీలైనంత త్వరలో సాయుధ బలగాలకు అందజేస్తారు. రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డైరెక్టరు ఎస్.కె.రాయ్, DRDL డైరెక్టరు పి. వేణుగోపాలన్ , ASL డైరెక్టరు డా.వి.జి. శేఖరన్, ITR డైరెక్టరు ఎస్.పి. దాష్ క్షిపణి ప్రయోగాన్ని పర్యవేక్షించారు.