From Wikipedia, the free encyclopedia
అంతర్జాతీయ యువజన దినోత్సవమును ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి యువత కోసం చేపట్టిన ప్రపంచ కార్యాచరణ కార్యక్రమం పట్ల యువతకు అవగాహన కలిగించేందుకు అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రకటించింది. మొదటి అంతర్జాతీయ యువజన దినోత్సవం 2000 ఆగస్టు 12 లో జరిగింది. ధరిత్రీ దినోత్సవం వంటి ఇతర రాజకీయ అవగాహన దినోత్సవాల మాదిరిగా ఈ దినోత్సవమును జరుపుకోవడం వలన యువత దృష్టిని ఆకర్షించడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. సాంస్కృతిక, చట్టపరమైన సమస్యల ద్వారా అపాయంలో చిక్కుకున్న జనాభాకు ఇటువంటి దినోత్సవాల అవసరం ఉంది.
ఇది ప్రపంచ యువజన దినోత్సవం (వరల్డ్ యూత్ డే) అని తికమక పడరాదు. (It is not to be confused with World Youth Day)
అంతర్జాతీయ యువజన దినోత్సవం (ఇంటర్నేషనల్ యూత్ డే) ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న జరుపుకుంటారు. ఇది 1999లో ఐక్యరాజ్యసమితి తీర్మానం 54/120 అనుసరణ ద్వారా రూపొందించబడింది. .[1]
ప్రపంచ వ్యాప్తంగా యువత సమస్యలను పరిష్కరించేందుకు, యువత దృష్టిని ఆకర్షించేందుకు ప్రభుత్వాలకు, ఇతరులకు ఇది ఒక అవకాశం. అంతర్జాతీయ యువజన దినోత్సవం గౌరవార్ధం కన్సర్ట్స్, వర్క్‌షాప్ లు, సాంస్కృతిక కార్యక్రమాలు,, సమావేశాలను జాతీయ, స్థానిక ప్రభుత్వ అధికారులు, యువజన సంస్థలు పాల్గొని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.