From Wikipedia, the free encyclopedia
అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం ప్రతి ఏట మే 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేటికాలంలో సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలను తెలియజేయడంకోసం ఈ కుటుంబ దినోత్సవం నిర్వహించబడుతుంది.[1]
అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం | |
---|---|
యితర పేర్లు | ప్రపంచ కుంటుబ దినోత్సవం |
జరుపుకొనేవారు | ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు |
జరుపుకొనే రోజు | మే 15 |
ఆవృత్తి | వార్షిక |
అనుకూలనం | ప్రతి ఏటా ఇదే రోజు |
గతంలో మాదిరిగా ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు ఉండడంలేదు. ఈ పరిణామం వల్ల ఒంటరితనం పెరిగిపోయి వ్యసనాలకు బానిసలు కావడం, పట్టించుకునేవారు లేకపోవడంతో మహిళలపై పనిభారం పెరిగి వారి ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
కుటుంబ వ్యవస్థ బలహీనమవ్వడం మూలంగా సమాజంలో జరిగే దుష్పరిణామాలు గ్రహించిన ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడంకోసం 1993, మే 15న అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం ప్రారంభించింది.[2]
మన సమాజంలో కుటుంబాలు పోషించే కీలక పాత్రను, ప్రామ్యుఖ్యతను, వారు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, జనాభా సమస్యల గురించి అవగాహన పెంచడానికి, సమాజం లో కుటుంబం కీలక పాత్రను బాగా అర్థం చేసుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి, అంతర్జాతీయ సమాజాన్ని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవం రోజును ఏర్పాటు చేసింది. ఒక రకంగా భావిస్తే, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం మన కుటుంబాలలో మేము పంచుకునే ప్రేమ, బంధం, సంబంధాల మద్దతును జరుపుకునే రోజు గా భావించవచ్చు[3]. సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ, సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి, కుటుంబ విలువలను తెలియజేయడం కోసం, ఉమ్మడి కుటుంబాల అవసరం గురించి వివరించడం కోసం ఈ రోజును ప్రత్యేకంగా కేటాయించారు.
2024 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం వాతావరణ మార్పు కుటుంబాలను ఎలా ప్రభావితం చేస్తుందో, వాతావరణ చర్యలో కుటుంబాలు పోషించగల పాత్ర గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది[4].
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.