హోమో ఎరెక్టస్
From Wikipedia, the free encyclopedia
హోమో ఎరెక్టస్ (అంటే 'నిటారుగా ఉన్న మనిషి') అనేది ప్లైస్టోసీన్ భౌగోళిక ఇపోక్‌లో చాలా కాలం పాటు నివసించిన పురాతన మానవుల జాతి. దీని మొట్టమొదటి శిలాజ ఆధారమైన 18 లక్షల సంవత్సరాల క్రితానికి చెందిన శిలాజాన్ని 1991 లో జార్జియాలోని దమానిసిలో కనుగొన్నారు.[5]
హోమో ఎరెక్టస్ | |
---|---|
Reconstructed skeleton of Tautavel Man[2] | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Mammalia |
Order: | Primates |
Suborder: | Haplorhini |
Infraorder: | Simiiformes |
Family: | Hominidae |
Subfamily: | Homininae |
Tribe: | Hominini |
Genus: | Homo |
Species: | H. Erecturs |
Binomial name | |
Homo Erecturs (Dubois, 1893) | |
Synonyms | |
|
హోమో ఎరెక్టస్ వర్గీకరణ, పూర్వీకులు, సంతతికి సంబంధించిన చర్చ, ముఖ్యంగా హోమో ఎర్గాస్టర్తో సంబంధం విషయంలో, ఇంకా కొనసాగుతోంది. ఈ చర్చలో రెండు ప్రధాన దృక్కోణాలున్నాయి:
1) హోమో ఎరెక్టస్ ఆఫ్రికా లోని హోమో ఎర్గాస్టర్ లాంటిదే.[6] ఆఫ్రికా లోని ఈ హోమో ఎర్గాస్టరే తదనంతర కాలంలో హోమో సేపియన్గా పరిణామం చెందింది [7][8][9];
లేదా
2) వాస్తవానికి ఇవి ఆఫ్రికన్ హోమో ఎర్గాస్టర్ కంటే భిన్నమైన ఆసియా జాతి లేదా ఉపజాతి.[8] ఈ ఆసియా హోమో ఎరెక్టస్ తిరిగి ఆఫ్రికాకు వలస వెళ్ళి అక్కడే హోమో సేపియన్ గా పరిణామం చెందింది.[10][11][12]
కొంతమంది పాలియోఆంత్రోపాలజిస్టులు హోమో ఎర్గాస్టర్ ను హోమో ఎరెక్టస్ యొక్క "ఆఫ్రికా" రకంగా భావిస్తారు. ఆసియా జాతిని "హోమో ఎరెక్టస్ సెన్సు స్ట్రిక్టో" (ఖచ్చితమైన అర్థంలో) (హోమో ఎరెక్టస్ ఎస్.ఎస్) అని, అఫ్రికా జాతిని "హోమో ఎరెక్టస్ సెన్సు లాటో" (విస్తృతార్థంలో) (హోమో ఎరెక్టస్ ఎస్.ఎల్) అనీ సూచిస్తారు.[13][14]
హోమో ఎరెక్టస్ చివరికి ఆఫ్రికా, ఐరోపా, ఆసియాల్లో అంతరించిపోయింది. కానీ దాని నుండి కొత్త జాతులు, ముఖ్యంగా హోమో హైడెల్బెర్గెన్సిస్, ఉత్పన్నమయ్యాయి. ఒక క్రోనోస్పీసీస్గా అది అంతరించిపోయిన కాలం వివాదాస్పదంగా ఉంది. 1950 లో ఈ పేరును ప్రతిపాదించినపుడు, జావా మ్యాన్‌ను ఈ జాతికి టైప్ స్పెసిమెన్గా (జాతికి గుర్తింపుగా వాడే శిలాజం - జాతికి పెట్టే పేరు ఈ శిలాజ లక్షణాల నుండే ఏర్పడుతుంది) స్వీకరించారు. ఈ జావా మనిషిని ప్రస్తుతం హోమో ఎరెక్టస్ ఎరెక్టస్ అని అంటున్నారు. అప్పటి నుండి, హోమో జాతుల ప్రతిపాదనల సంఖ్యను తగ్గించే ధోరణి పాలియో ఆంత్రోపాలజీలో ఉంది. ఎంతలా అంటే, హోమో హ్యాబిలిస్ నుండి ఉద్భవించి, తొలి హోమో హైడెల్బెర్గెన్సిస్ కంటే విభిన్నంగా ఉన్న ఉన్న హోమో తొలి రూపాలన్నిటినీ (దిగువ పాతరాతియుగపు) హోమో ఎరెక్టస్ (ఆఫ్రికాలో దీనిని హోమో రొడీసియెన్సిస్ అని కూడా పిలుస్తారు) లోనికే చేర్చేంతలా.[15] ఈ విస్తృతార్థంలో 3,00,000 సంవత్సరాల క్రితం హోమో ఎరెక్టస్ స్థానంలో చాలావరకూ హోమో హైడెల్బెర్గెన్సిస్ స్థిరపడింది. 70,000 సంవత్సరాల క్రితం వరకు జావాలో మనుగడ సాగించిన హోమో ఎరెక్టస్ సోలోయెన్సిస్ బహుశా దీనికి మినహాయింపు.[1]
2013 లో పదనిర్మాణపరంగా విభిన్నమైన " డ్మనిసి పుర్రె 5 " ఆవిష్కరణతో, వేరువేరు పేర్లతో పిలిచిన జాతులను హోమో ఎరెక్టస్ కిందకు మార్చే సిద్ధాంతధోరణిని బలోపేతమైంది.[16] అందువలన హోమో ఎర్గాస్టర్ ఇప్పుడు హోమో ఎరెక్టస్ శరీర నిర్మాణం పరిధిలో ఉంది. హోమో రుడాల్ఫెన్సిస్, హోమో హ్యాబిలిస్ లు కూడా హోమో ఎరెక్టస్ యొక్క ప్రారంభ జాతులుగా పరిగణించాలని కూడా సూచించారు. [17][18]