సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్
From Wikipedia, the free encyclopedia
సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్ (/seɪnt ˈvɪnsənt ænd ðə ɡrɛnəˈdiːnz/ ( listen)) లెస్సర్ ఆంటిల్లెస్ ద్వీపసమూహంలో సార్వభౌమాధికారం కలిగిన దేశం.ఇది కరీబియన్ సముద్రంలోని దక్షిణతీరంలో ఉంది. ద్వీపం ఈతరువాత అట్లాంటిక్ సముద్రం మొదలౌతుంది. దేశాన్ని సెయింట్ విన్సెంట్ అని కూడా క్లుప్తంగా పిలుస్తారు.
Saint Vincent and the Grenadines | |
---|---|
నినాదం: "Pax et Justitia" (Latin) "Peace and Justice" | |
గీతం: | |
రాజధాని | Kingstown 13°10′N 61°14′W |
అధికార భాషలు | English |
జాతులు |
|
పిలుచువిధం | Vincentian, Vincy |
ప్రభుత్వం | Parliamentary democracy under constitutional monarchy |
• Monarch | Elizabeth II |
• Governor-General | Frederick Ballantyne |
• Prime Minister | Ralph Gonsalves |
శాసనవ్యవస్థ | House of Assembly |
Independence | |
• Associated State | 27 October 1969 |
• from the United Kingdom | 27 October 1979 |
విస్తీర్ణం | |
• మొత్తం | 389 km2 (150 sq mi) (184th) |
• నీరు (%) | negligible |
జనాభా | |
• 2013 estimate | 103,000[1] (196th) |
• 2011 census | 109,991 |
• జనసాంద్రత | 307/km2 (795.1/sq mi) (39th) |
GDP (PPP) | 2016 estimate |
• Total | $1.243 billion[2] |
• Per capita | $11,291[2] |
GDP (nominal) | 2016 estimate |
• Total | $784 million[2] |
• Per capita | $7,123[2] |
హెచ్డిఐ (2014) | 0.720[3] high · 97th |
ద్రవ్యం | East Caribbean dollar (XCD) |
కాల విభాగం | UTC-4 |
వాహనాలు నడుపు వైపు | left |
ఫోన్ కోడ్ | +1 784 |
ISO 3166 code | VC |
Internet TLD | .vc |
దేశంలోని 389చ.కి.మీ వైశాల్యం కలిగిన భూభాగం సెయింట్ విన్సెంట్ ద్వీపం ప్రధానభూభాగంగా ఉంది. దేశంలో భాగంగా ఉన్న సెయింట్ విన్సెంట్ ద్వీపానికి గ్రెనడా ద్వీపానికి మద్య ఉన్న చిన్నద్వీపాలను గ్రెనడైంస్ ద్వీపాలు అంటారు.సెయింట్ విన్సెంట్ ద్వీపంలోని అత్యధిక భాగం హరికెన్ బెల్టులో ఉంది.సెయింట్ విన్సెంట్ ఉత్తరదిశలో సెయింట్ లూసియా, తూర్పుదిశలో బార్బడోస్ ఉన్నాయి.1,02,000 జనసంఖ్య కలిగిన సెయింట్ విన్సెంట్ గ్రెనడైంస్ జసంధ్రత అధికంగా కలిగినదేశం. రాజధాని నగరం " కింగ్స్టన్ " దేశానికి ప్రధాన నౌకాశ్రయ నగరంగా కూడా ఉంది.సెయింట్ విన్సెంట్ ఫ్రెంచి, బ్రిటిష్ కాలానీచరిత్రను కలిగి ఉంది.ప్రస్తుతం " ఆర్గనైజేషన్ ఆఫ్ ఈస్టర్న్ కరీబియన్ స్టేట్స్, కరీబియన్ కమ్యూనిటీ, కామంవెల్ట్ ఆఫ్ నేషంస్, బొలివేరియన్ అలయంస్ ఫర్ ది అమెరికాస్ , కమ్యూనిటీ ఆఫ్ లాటిన్ అమెరికన్ అండ్ కరీబియన్ స్టేట్స్లో భాగంగా ఉంది.