యెనిసెయి నది
From Wikipedia, the free encyclopedia
యెనిసెయి నది (Енисе́й - యిన్యిస్యేయ్) సైబీరియాలో ఉన్న ఒక నది. సైబీరియాలో ప్రవహించే మూడు గొప్ప నదుల్లో ఇది మధ్యది. మిగతా రెండూ ఓబ్, లెనా నదులు. ఇది ఆర్క్టిక్ మహాసముద్రం లోకి ప్రవహించే గొప్ప నది వ్యవస్థకు చెందినది. ఎనిసెయి ప్రపంచంలోని ఐదవ అతి పెద్ద నది. ఇది మిసిసిపీ నది కన్నా కొంచెం చిన్నదిగా ఉంటుంది, కానీ ప్రవాహంలో 1.5 రెట్లు ఉంటుంది.
యెనిసెయి | |
---|---|
పేరు ఉత్పత్తి | ప్రాచీన కిర్గిజి Эне-Сай (“తల్లి నది”) లేకపోతే ఎవెంకీ Ионэсси ('“పెద్ద నీళ్ళు”) నుండి[1][2] |
స్థానిక పేరు | Енисей (Russian) |
స్థానం | |
దేశం | మంగోలియా, రష్యా |
ప్రాంతం | తువా, క్రాస్నొయార్స్క్ క్రాయ్, ఖకాసియా, ఇర్కుట్స్క్ ఓబ్లాస్ట్, బుర్యాటియా, జబేకాల్స్కీ క్రాయ్ |
నగరాలు | కైజిల్, షాగినార్, సయనోగోర్స్కీ, అబకాన్, దివ్నొగోర్స్కీ, క్రాస్నొయార్స్క్, యెనిసెయిస్కీ, లెసోసిబిర్స్క్, ఇగార్కా, దుడింకా |
భౌతిక లక్షణాలు | |
మూలం | Mungaragiyn-Gol |
• స్థానం | ridge Dod-Taygasyn-Noroo, Mongolia |
• అక్షాంశరేఖాంశాలు | 50°43′46″N 98°39′49″E |
• ఎత్తు | 3,351 m (10,994 ft) |
2nd source | The most distant source: Yenisey-Angara-Selenga-Ider system |
• స్థానం | ఖంగాయ్ పర్వతాలు |
• అక్షాంశరేఖాంశాలు | 47°54′47″N 97°57′1″E |
• ఎత్తు | 2,850 m (9,350 ft) |
సముద్రాన్ని చేరే ప్రదేశం | యెనిసెయి సింధుశాఖ |
• స్థానం | ఆర్క్టిక్ సముద్రం, రష్యా |
పొడవు | 3,487 km (2,167 mi) |
పరీవాహక ప్రాంతం | 2,580,000 km2 (1,000,000 sq mi) |
ప్రవాహం | |
• స్థానం | Igarka[3] |
• సగటు | 18,050 m3/s (637,000 cu ft/s) |
• కనిష్టం | 3,120 m3/s (110,000 cu ft/s) |
• గరిష్టం | 112,000 m3/s (4,000,000 cu ft/s) |
పరీవాహక ప్రాంత లక్షణాలు | |
ఉపనదులు | |
• కుడి | అంగారా, పోడ్కెమెన్నయా తుంగూస్కా, నీజ్నాయా తుంగుస్కా |
గ్రేట్ యెనిసెయి, లిటిల్ యెనిసెయి నదులు కైజిల్ వద్ద సంగమించి యెనిసెయి నదిగా మారతాయి. అక్కడి నుండి ఈ నది 3,487 కి.మీ. ప్రవహించి కారా సముద్రంలో కలుస్తుంది..దీని ఉపనది సెలెంగా పుట్టిన దగ్గరి నుండి చూస్తే యెనిసెయి పొడవు 5,075 కి.మీ.[4] దీని పరీవాహక ప్రాంతం 25,80,000 చ.కి.మీ.[5] యెనిసెయి రష్యా అనుబంధ రాజ్యాలైన తువా, ఖకాసియా, [6] క్రాస్నొయార్స్క్ క్రాయ్ ల గుండా ప్రవహిస్తుంది. క్రాస్నొయార్స్క్ నగరం యెనిసెయి నది ఒడ్డున ఉంది.[7]