భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్
ఇండియా వెహికల్ లైసెన్స్ ప్లేట్లు / From Wikipedia, the free encyclopedia
భారతదేశంలోని అన్ని మోటారు వాహనాలను నమోదు లేదా అనుమతి సంఖ్యతో గుర్తింపు చేస్తారు. రహదారులపై ప్రయాణించటానికి ప్రధాన అధికారపత్రంగా వాహన నమోదు ఫలకం (సాధారణంగా సంఖ్యా ఫలకం అని అంటారు) సంఖ్యను ఆయా రాష్ట్రాల జిల్లాస్థాయి, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు (ఆర్టీఓ) జారీ చేస్తాయి.సంఖ్యా ఫలకాలు వాహనం ముందు, వెనుక భాగంలో అమర్చబడతాయి. చట్టం ప్రకారం అన్ని ఫలకాలు లాటిన్ అక్షరాలతో ఆధునిక హిందూ-అరబిక్ అంకెల్లో ఉంటాయి.[1] భారతదేశ అంతర్జాతీయ వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ ఐ.ఎన్.డి.