భారత ప్రాంతీయ రవాణా కార్యాలయాల జాబితా
వికీమీడియా వ్యాసాల జాబితా / From Wikipedia, the free encyclopedia
ఇది భారత ప్రాంతీయ రవాణా కార్యాలయాల జాబితా, వాహన నమోదు కోసం కేటాయించిన సంకేతాలు దీనిలో ఉంటాయి. దీనిలో రాష్ట్రాలుకుకేంద్రపాలిత ప్రాంతాలుకు, వాటి జిల్లాలకు సంకేతాలు విభజించబడ్డాయి. భారతదేశంలోని అన్ని వాహనాలు, డ్రైవర్ల డేటాబేస్ను ఉంచే బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది. ఈ బాధ్యతను ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాలు వారి ఆర్.టి.ఒ లేదా ప్రాంతీయ రవాణా అథారిటీ ద్వారా నిర్వహిస్తాయి. భారతీయ రహదారిపై తిరిగే వాహనాల డేటాను భద్రపరచడం, భారతదేశంలో లైసెన్స్లు, పర్మిట్ల జారీ, సంబంధిత అన్ని ధ్రువపత్రాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను పర్యవేక్షించే రవాణా కమిషనర్ ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు అధిపతిగా వ్యవహరిస్తాడు.