నార్వే
ఉత్తర ఐరోపాలోని ఒక దేశం / From Wikipedia, the free encyclopedia
నార్వే ఉత్తర ఐరోపాకు చెందిన దేశము.[3] అధికారికంగా " కింగ్డం ఆఫ్ నార్వే " యూనిటరీ " మొనార్చీ " అంటారు. స్కాండినేవియా ద్వీపకల్పము పశ్చిమ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది.జాన్ మేయెన్, స్వాల్బార్డ్ ద్వీపసమూహం ఇందులో భాగంగా ఉన్నాయి. ఐరోపా మొత్తంలో అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన దేశాల్లో ఇది ఒకటి. దేశసరిహద్దు ఎక్కువగా స్వీడన్‌తో పంచుకుంటుంది. ఫిన్లాండ్, డెన్మార్క్, రష్యా ఇతర సరిహద్దు దేశాలు. నార్వే జాతీయ దినోత్సవం 1814 మే 17.[5]
కొంగరికెట్ నార్జ్ |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం "Alt for Norge / Alt for Noreg" నార్వే కోసం అందరూ |
||||||
జాతీయగీతం |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | ఓస్లో 59°56′N 10°41′E | |||||
అధికార భాషలు | నార్వేజియన్, సమి | |||||
ప్రభుత్వం | Paliamentary Democracy Constitutional monarchy | |||||
- | మోనార్క్ | హరాల్డ్ 5 | ||||
- | ప్రధానమంత్రి | జోనాస్ గహర్ స్టోర్ (Ap) (2021–) | ||||
స్థాపన | ||||||
- | రాజ్య అవతరణము | 872 | ||||
- | స్వీడెనుతో ఐక్యత నుండి విముక్తి | జూన్ 07 1905 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 385,207 కి.మీ²[1] (67వ) 148,729 చ.మై |
||||
- | జలాలు (%) | 5.7 | ||||
జనాభా | ||||||
- | 2024 అంచనా | 5,550,203[2] (120వ) | ||||
- | జన సాంద్రత | 14.4 /కి.మీ² (213వ) 37 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $257.4 బిలియన్ (40వ) | ||||
- | తలసరి | $55,000 (3వ) | ||||
జీడీపీ (nominal) | 2006 అంచనా | |||||
- | మొత్తం | $335.3 బిలియన్ (25వ) | ||||
- | తలసరి | $95,460 (2వ) | ||||
జినీ? (2000) | 25.8 (low) | |||||
కరెన్సీ | నార్వేజియన్ క్రోన్ (NOK ) |
|||||
కాలాంశం | (UTC+1:00) | |||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .no,.sj,.bv | |||||
కాలింగ్ కోడ్ | ++47 |
అంటార్కిటిక్ " మొదటి పీటర్ ద్వీపం ", ఉప-అంటార్కిటిక్ బోవేట్ ద్వీపం డిపెండెంట్ భూభాగాలు, అందువలన కింగ్డమ్లో భాగంగా పరిగణించబడలేదు. క్వీన్ మౌడ్ ల్యాండ్ అని పిలువబడే అంటార్కిటికా విభాగంగా నార్వే వాదిస్తున్నప్పటికీ ఇది అనుమానంగా ఉంది. 1814 వరకు ఈ రాజ్యంలో ఫారో ద్వీపాలు, గ్రీన్ ల్యాండ్, ఐస్లాండ్ ఉన్నాయి. ఇది 1658 జాంట్లాండ్, హర్జేడలెన్ 1645 వరకు షెలాండ్, ఓర్క్నీ వరకు 1468 వరకు బోహస్లాన్, 1266 వరకు హేబ్రిడ్స్, ఐల్ ఆఫ్ మాన్ లను కలిగి ఉంది.
2017 జనవరి నాటి గణాంకాల ఆధారంగా నార్వే మొత్తం వైశాల్యం 3,85,252 చ.కి.మీ (148.747 చ.మై.), 52,58,317 జనాభా ఉంది.[6] దేశం స్వీడన్‌తో పొడవైన తూర్పు సరిహద్దును పంచుకుంటుంది (1,619 కిమీ లేదా 1,006 మైళ్ళు). నార్వే ఈశాన్య సరిహద్దులుగా ఫిన్లాండ్, రష్యా ఉన్నాయి. దక్షిణ సరిహద్దులో స్కగ్ర్రాక్ స్ట్రైట్, డెన్మార్క్‌తో మరో వైపు ఉంది. నార్వే విస్తృతమైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది. ఉత్తరప్రాంతంలో అట్లాంటిక్ మహాసముద్రం, బారెంట్స్ సముద్రం ఉన్నాయి.
నార్వే ప్రస్తుత రాజు గ్లోక్స్బర్గ్లోని డానో-జర్మన్ హౌస్‌కి చెందిన కింగ్ ఐదవ హెరాల్డ్ . 2013 లో జెన్స్ స్టోల్టెన్బెర్గ్ స్థానంలో " ఎర్నా సోల్బెర్గ్ " ప్రధాన మంత్రి అయ్యాడు.రాచరిక రాజ్యాంగం, నార్వే పార్లమెంటు, కేబినెట్, సుప్రీంకోర్టుల మధ్య రాజ్యాధికారం విభజించబడుతుంది. రాజ్యం పెద్ద సంఖ్యలో చిన్న సామ్రాజ్యాల విలీనంతో స్థాపించబడింది. 872 నుండి సాంప్రదాయ లెక్కల ప్రకారం రాజ్యం 1,145 సంవత్సరాలు నిరంతరంగా ఉనికిలో ఉంది. నార్వే చక్రవర్తుల జాబితాలో అరవై రాజులు, తొమ్మిది ప్రభువులు మంది ఉన్నారు.
నార్వే రెండు పరిపాలనా, రాజకీయ ఉపవిభాగాలు కౌంటీలు, పురపాలక సంఘాలు అనే రెండు పాలనా విభాగాలను కలిగి ఉంది. సామీ ప్రజలు సంప్రదాయ భూభాగాలపై స్వీయ-నిర్ణయం, ఆధిపత్యం పార్లమెంటు, ఫిన్మార్క్ చట్టం ద్వారా స్వయంప్రతిపత్తి కలిగి ఉన్నారు. యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ రెండింటితోనూ నార్వే సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. నార్వే ఐక్యరాజ్యసమితి,నాటో, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, యూరోప్ కౌన్సిల్, అంటార్కిటిక్ ట్రీటీ, నార్డిక్ కౌన్సిల్ యొక్క వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. యూరోపియన్ ఎకనామిక్ ఏరియా, డబల్యూ.టి.ఒ., ఒ.ఇ.సి.డి. సభ్యదేశంగా ఉంది.స్కెంజెన్ ప్రాంతంలో ఒక భాగంగా ఉంది.
దేశ ఆర్థిక వ్యవస్థ, సార్వజనీన ఆరోగ్య సంరక్షణ, సమగ్ర సాంఘిక భద్రతా వ్యవస్థతో నోర్డిక్ సంక్షేమ నమూనా కలయికను నిర్వహిస్తుంది. పెట్రోలియం, సహజ వాయువు, ఖనిజాలు, కలప,సముద్ర ఆహారాలు, మంచినీరు, జలశక్తి విస్తృతమైన నిల్వలు ఉన్నాయి. పెట్రోలియం పరిశ్రమ దేశం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో నాలుగింట ఒక వంతును కలిగి ఉంది.[7] మిడిల్ ఈస్ట్ వెలుపల చమురు, సహజ వాయువు ఉత్పత్తిలో తలసరి ప్రాతిపదికన నార్వే ప్రథమ స్థానంలో ఉంది.[8][9] ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్.జాబితాలలో ప్రపంచంలో తలసరి అత్యధిక ఆదాయం కలిగిన దేశాలలో నార్వే నాలుగో స్థానంలో ఉంది.[10] స్వతంత్ర భూభాగాలు, ప్రాంతాలను కలిగి ఉన్న సి.ఐ.ఎ. తలసరి జి.డి.పి.జాబితా (2015 అంచనాల ప్రకారం) నార్వే పదకొండవ స్థానంలో ఉంది.[11] 1 ట్రిలియన్ డాలర్లు సంపదతో నార్వే ప్రపంచంలోని అతిపెద్ద సార్వభౌమ సంపద నిధిని కలిగి ఉంది.[12] 2009 నుండి ప్రపంచంలోని అత్యధిక మానవ అభివృద్ధి సూచికలో నార్వే మొదటి స్థానంలో ఉంది. ఇది 2001, 2006 మధ్యకాలంలో కూడా జరిగింది.[13] అసమానత-సర్దుబాటు చేసిన దేశాలలో నార్వే మొదటి స్థానంలో ఉంది.[14][15][16][17] ప్రపంచ హ్యాపీనెస్ రిపోర్ట్ ఒ.ఇ.సి.డి. బెటర్ లైఫ్ ఇండెక్స్, పబ్లిక్ ఇంటిగ్రిటి సూచిక, డెమోక్రసీ ఇండెక్స్‌లో నార్వే మొదటి స్థానంలో ఉంది.[18]